రాష్ట్రీయం

కాపులను బిసిలుగా గుర్తించేందుకు ఇదే తగిన సమయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 24: ఎన్నికల ప్రచారం సమయంలో తొలిసారిగా అన్ని ప్రధాన రాజకీయ పక్షాలు కాపులను బిసిలుగా గుర్తించేందుకు స్పష్టమైన హామీలు ఇచ్చినందునే ఇక ఏ మాత్రం జాప్యం లేకుండా ఆ హామీలను కార్యరూపం దాల్చేందుకు ఇదే తగిన సమయం అని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి అన్నారు. ఈ విషయంలో ఇప్పటికే రెండేళ్లపాటు జాప్యం జరిగింది. ఇక ఏ మాత్రం ఆలస్యం కాకుండా వచ్చే విద్యా సంవత్సరంలో కాపు విద్యార్థులందరూ బిసి రిజర్వేషన్లలో అన్ని స్థాయిల్లోనూ సీట్లు పొందేలా సిఎం చంద్రబాబు నాయుడు చొరవ చూపాలన్నారు. ఎంతో కీలకమైన ఈ విషయంలోనూ తనది రెండు కళ్ల సిద్ధాంతం అంటూ బిసిలను రెచ్చగొట్టకుండా తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలన్నారు. రాజకీయాలకతీతంగా అందునా భవిష్యత్‌లో ఏ పార్టీలోను చేరబోమంటూనే నిస్వార్థంతో ఈ నెల 31న తునిలో మాజీ మంత్రి ముద్రగడ నిర్వహించబోయే సభకు కాంగ్రెస్ పార్టీ పరిపూర్ణంగా మద్దతు నివ్వటమే గాక కులమతాల కతీతంగా కార్యకర్తలు, ప్రజలను తరలిస్తామని రఘువీరా స్పష్టం చేశారు. కాపులను బిసిలుగా గుర్తించేవరకు కాంగ్రెస్ పార్టీ కాపు బిసి సెల్ కొనసాగుతుందన్నారు. కాపు బిసి సెల్ ఆధ్వర్యంలో పిసిసి ప్రధాన కార్యదర్శి ఆకుల శ్రీనివాసకుమార్ అధ్యక్షతన ఆదివారం నాడిక్కడ జరిగిన విస్తృత స్థాయి సదస్సులో రఘువీరారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఎన్నికల సమయంలో తమ నేత సోనియాగాంధీ గుంటూరు సభలో కాపులను బిసి జాబితాలో చేరుస్తామంటూ స్పష్టమైన హామీనిచ్చారు. అలాగే జగన్ కూడా హామీనిచ్చారు. ఇక చంద్రబాబు ఊరూవాడా కూడా ఇదే విధమైన హామీనిస్తూ కాపుల ఓట్లతో అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తి కావస్తున్నా తాత్సారం చేస్తున్నారన్నారు. కాపుల నుంచి ఒత్తిళ్లు పెరుగటంతో గత్యంతరం లేని స్థితిలో కంటితుడుపుగా సభ్యులు లేకుండా కమిషన్‌ను ప్రకటించారు కాని దానికి కాలపరిమితి నిర్ణయించకపోవటంలోనే బాబు కపటనీతి స్పష్టంగా కన్పిస్తోందన్నారు. ప్రస్తుత బిసి రిజర్వేషన్లకు ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేకుండా రాజ్యాంగంలోనున్న విధంగా షెడ్యూల్ 9 ప్రకారం పార్లమెంట్ ఉభయ సభల్లో ఏకగ్రీవ తీర్మానంతో ప్రత్యేకంగా రిజర్వేషన్లను వర్తింపచేయవచ్చన్నారు. గతంలో కర్ణాటక, తమిళనాడు ఇదే విధానాన్ని పాటించిందన్నారు. 1999 నాటి ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కరరెడ్డి నియమించిన పుట్టుస్వామి కమిషన్ ఎంతో క్షుణ్ణంగా పలు కోణాల్లో అధ్యయనం చేసి సమర్పించిన నివేదికను నేరుగా ప్రస్తుత కమిషన్‌కు అందచేసి నెలరోజుల్లో తెప్పించుకుని ముందుగా మంత్రివర్గ సమావేశంలోను ఆపై శాసనసభలోను ఆమోదించి నేరుగా కేంద్రానికి పంపించాలని రఘువీరారెడ్డి డిమాండ్ చేశారు. ప్రధాని మోదీ, సిఎం బాబు జోడి జోడి అంటున్నారు. అలాగే యుపిఎ భాగస్వామ్య పార్టీలన్నింటినీ ఒప్పిస్తాం ఏకంగా ఏకగ్రీవంగా ఆమోదింప చేయవచ్చు. ఆపై రాజ్యసభలో కాంగ్రెస్ పార్టీకి ఎటూ మెజార్టీ ఉంది. ఆఘమేఘాలపై అంగీకరింపజేసేందుకు తాము అక్కడే మకాం వేస్తామన్నారు. ఏది ఏమైనా ఈ ప్రక్రియ మొత్తం వచ్చే పార్లమెంట్ సమావేశాల్లోగా పూర్తికావాలన్నారు. దేనికైనా సంకల్ప బలం ఉండాలి. అయితే తెలుగుదేశంలో ఏ మాత్రం కన్పించడం లేదన్నారు. పైగా పార్టీలోని కాపు వర్గానికి చెందిన నేతలతో రకరకాల ప్రకటనలు చేయిస్తున్నారు. పైగా కాపునాడు సభకు వెళ్లవద్దంటూ హుకుం జారీ చేయించటంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. పైగా వారిచే బిసిలను కవ్వించి రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. తూర్పున ఉదయించే సూర్యుడు పడమట ఉదయించినా 2019 ఎన్నికల్లో రాహుల్‌గాంధీ ప్రధాని కావటం, కాపులను బిసిలుగా చేయటం ఖాయమన్నారు. సభలో మాజీ ఎమ్మెల్సీ కందుల దుర్గేష్, జిల్లా, నగర కాంగ్రెస్ అధ్యక్షులు కడియాల బుచ్చిబాబు, మల్లాది విష్ణు ప్రసంగించారు. సభలో కాపునాడు రాష్ట్ర అధ్యక్షుడు పిళ్లా వెంకటేశ్వరరావు, పిసిసి ప్రధాన కార్యదర్శులు మీసాల రాజేశ్వరరావు, నరహరశెట్టి నరసింహారావు, ఎన్‌ఎస్‌యుఐ రాష్ట్ర అధ్యక్షులు రాజీవ్త్రన్ తదితరులు పాల్గొన్నారు.