బిజినెస్

కుదుటపడిన స్టాక్ మార్కెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఫిబ్రవరి 12: గురువారం భారీ నష్టాలకు లోనైన దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం స్వల్ప లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ ఆర్థిక మందగమనం, పలు ప్రముఖ సంస్థల ఆర్థిక ఫలితాలు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో మదుపరులు గురువారం తీవ్ర అమ్మకాల ఒత్తిడికి లోనైనది తెలిసిందే. ఈ క్రమంలోనే బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 807 పాయింట్లు, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 239 పాయింట్ల మేర కోల్పోయాయి. అయితే శుక్రవారం మదుపరుల ఆలోచన సరళిలో మార్పు చోటుచేసుకోగా, కొనుగోళ్లపై కాస్త ఆసక్తి కనబరిచారు. ఫలితంగానే సెనె్సక్స్ 34.29 పాయింట్లు కోలుకుని 22,986.12 వద్ద ముగియగా, నిఫ్టీ 4.60 పాయింట్లు లాభపడి 6,980.95 వద్ద నిలిచింది. నిజానికి ఉదయం ప్రారంభంలో సెనె్సక్స్ దాదాపు 165 పాయింట్లు, నిఫ్టీ 50 పాయింట్ల మేర లాభాల్లో కదలాడాయి. అయితే సమయం గడుస్తున్నకొద్దీ మదుపరులు మళ్లీ పెట్టుబడుల ఉపసంహరణ దిశగా నడిచారు. దీంతో సూచీలు స్వల్ప లాభాలకే పరిమితం కావాల్సి వచ్చింది. ఇకపోతే టెలికామ్, ఆటో, టెక్నాలజీ, యుటిలిటీస్, ఎఫ్‌ఎమ్‌సిజి, ఐటి రంగాల షేర్ల విలువ 5.56 శాతం నుంచి 0.25 శాతం మధ్య పెరిగింది. క్యాపిటల్ గూడ్స్, చమురు, గ్యాస్, ఇంధనం, రియల్టీ, మెటల్, ఇండస్ట్రియల్స్, హెల్త్‌కేర్ రంగాల షేర్ల విలువ 3.05 శాతం నుంచి 0.77 శాతం మధ్య క్షీణించింది. బిఎస్‌ఇ మిడ్-క్యాప్ 0.78 శాతం, స్మాల్-క్యాప్ 1.21 శాతం మేర పడిపోయాయి. మరోవైపు అంతర్జాతీయంగా జపాన్ సూచీ 4.84 శాతం పెరిగితే, హాంకాంగ్, దక్షిణ కొరియా సూచీలు 1.22 శాతం, 1.41 శాతం చొప్పున నష్టపోయాయి. ఐరోపా మార్కెట్లలో ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్ సూచీలు 1.25 శాతం నుంచి 1.68 శాతం మధ్య పుంజుకున్నాయి.
బాండ్ల వేలం
న్యూఢిల్లీ: సోమవారం బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ విదేశీ మదుపరులకు 3,011 కోట్ల రూపాయల విలువైన బాండ్లను వేలం వేయనుంది. సాధారణ ట్రేడింగ్ కార్యకలాపాల అనంతరం మధ్యాహ్నం 3:30 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు రెండు గంటలపాటు ఈ వేలం జరుగుతుంది.