రాష్ట్రీయం

కాపులను బిసిల్లో చేరిస్తే ఉద్యమం తీవ్రతరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 12: కాపులను బిసిల జాబితాలో కలిపితే బిసిల ఉద్యమ సత్తా చూపిస్తామని జాతీయ బిసి సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ జనాభాలో ఆరు శాతం ఉన్న కాపులు ఉద్యమం ద్వారా ప్రభుత్వాన్ని బెదిరించి బిసిల జాబితాలో కలపాలని ఒత్తిడి తెస్తే 54 శాతం జనాభా ఉన్న బిసిలు చూస్తూ ఊరుకోరని, అంతకంటే తీవ్రమైన ఉద్యమం చేపడతారని ఆయన స్పష్టం చేశారు. శుక్రవారం నాడిక్కడ కృష్ణయ్య ఒక ప్రకటన విడుదల చేశారు. బిసిల్లో కాపులను కలిపేందుకు చంద్రబాబు ప్రభుత్వం పావులు కదుపుతున్నందుకు నిరసనగా ఈ నెల 15న ఎపిలోని 13 జిల్లా కేంద్రాల్లో బిసి సంఘాల ఆధ్వర్యంలో నిరాహార దీక్షలు చేపట్టాలని నిర్ణయించినట్లు ఆయన వెల్లడించారు. వాస్తవాలను గ్రహించకుండా తెలుగుదేశం పార్టీ రాజకీయ లబ్ధికోసం కాపులను బిసిల్లో చేర్చడానికి యత్నిస్తోందని అన్నారు. ప్రతిపక్ష పార్టీలు కాపులకు మద్దతు ఇస్తే అది బిసిలకు అన్యాయం తలపెట్టినట్టే అవుతుందని అన్నారు. బిసిలకు అన్యాయం జరుగకుండా కాపులకు బిసి రిజర్వేషన్లు ఇస్తామని సిఎం చంద్రబాబు చెప్పడం ఆచరణలో సాధ్యం కాదని పేర్కొన్నారు. ఎలాంటి శాస్ర్తియత, హేతుబద్ధత లేకుండా రాజకీయ ఒత్తిడితో కాపులను బిసిల జాబితాలో కలిపితే భవిష్యత్‌లో మరికొన్ని అభివృద్ధి చెందిన కులాలు ఇలాంటి ఉద్యమాలే చేపట్టి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే ప్రమాదం ఉందన్నారు. బిసిల రిజర్వేషన్లను 50 శాతానికి పెంచి 9వ షెడ్యూల్‌లో చేరిస్తే మరీ మంచిదని కృష్ణయ్య స్పష్టం చేశారు. బిసిలకు చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్లు వర్తించే విధంగా కేంద్రంపై ఒత్తిడి తెచ్చి పార్లమెంటులో బిసి బిల్లు పెట్టించి ఆమోదింప చేయాలని ఆయన ఎపి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేంద్రంలోని ఒబిసి రిజర్వేషన్లను కూడా ఎ, బి, సి, డి, ఇలుగా వర్గీకరించాలని, ఎపిలోని మొత్తం కులాల వారీగా లెక్కలు తీసి కాపుల జనాభా ఎంత, విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో వారికి ఇప్పుడున్న ప్రాతినిధ్యం ఎంతో లెక్కించాలని ఆయన డిమాండ్ చేశారు.