రాష్ట్రీయం

కొన్నాళ్లాగాలి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 14: ఎప్పుడెప్పుడా అని పార్టీ నేతలు ఎదురు చూస్తోన్న పదవుల పందేరం మళ్లీ వాయిదా పడినట్టేనని తెరాస వర్గాల సమాచారం. వరంగల్, ఖమ్మం నగరపాలక సంస్థలతోపాటు కొన్ని మున్సిపాల్టీలకు జరుగనున్న ఎన్నికలకు నెలాఖరున నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. అలాగే శాసనసభ బడ్జెట్ సమావేశాలు వచ్చే మార్చి మొదటివారంలో ప్రారంభంకానున్నాయి. ఈ రెండింటి ప్రక్రియ ముగిసిన తర్వాతే పదవుల పందేరం నిర్వహించాలని పార్టీ అధినేత, సిఎం కె చంద్రశేఖర్‌రావు యోచిస్తున్నట్టు తెరాస వర్గాల సమాచారం.
తెరాస ప్రభుత్వం అధికారపగ్గాలు చేపట్టి దాదాపు 20 మాసాలు గడస్తున్నా పదవుల పందేరం ఎప్పటికప్పుడు వాయిదా పడుతూవస్తుంది. వాస్తవానికి కొత్త ఏడాది ఆరంభం నుంచే పదవుల పందేరం జరపాలని సిఎం భావించారు. నామినేటేడ్ పదవులను త్వరలోనే భర్తీ చేయనున్నట్టు ఈమేరకు పార్టీ పొలిట్‌బ్యూరో సమావేశంలో స్వయంగా ప్రకటించారు కూడా. అయితే గత జనవరిలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలను వెంటనే నిర్వహించాల్సిందిగా హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించడం, ఎన్నికల షెడ్యూల్డ్ విడుదలకావడంతో పదవుల పందేరం ఆగిపోయింది. గ్రేటర్ ఎన్నికల్లో తెరాస అప్రతిహత విజయం సాధించడంతో, ఇదే వేడిలో వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ల ఎన్నికల నిర్వహణకూ మంచి సమయమని అధికార పార్టీ భావిస్తుంది. ఈమేరకు ఈనెల 20లోగా రెండు మున్సిపల్ కార్పొరేషన్లతోపాటు కొత్తగా ఏర్పడిన మున్సిపల్ పట్టణాలకూ ఎన్నికలు నిర్వహించడానికి నోటిఫికేషన్ విడుదల కాబోతుందని సమాచారం. ఈ ఎన్నికలకు ముందు పదవుల పందేరం నిర్వహిస్తే పదవులు దక్కనివారు పార్టీ విజయానికి కృషి చేయకపోవచ్చని, అలాకాకుండా ఎన్నికల తర్వాత నామినేటెడ్ పోస్టుల భర్తీ చేస్తామనడం వల్ల పార్టీ విజయానికి అందరూ కష్టపడతారని పార్టీ భావిస్తుంది. పైగా శాసనసభ బడ్జెట్ సమావేశాలు వచ్చే మార్చి మొదటివారం నుంచి ప్రారంభం కాబోతున్నాయి. బడ్జెట్ సమావేశాలు మార్చి నెలాఖరు వరకు కొనసాగనున్నాయి. వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ల ఎన్నికల ప్రక్రియ ముగియగానే, బడ్జెట్ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. దీంతో నామినేటెడ్ పోస్టుల భర్తీకి ఏప్రిల్ మొదటివారంలో కసరత్తు ప్రారంభించి, రెండోవారంలో నియామకాలు చేయాలని సిఎం భావిస్తున్నట్టు తెరాస వర్గాల సమాచారం. తెరాసలో చేరి ప్రత్యేక రాష్ట్ర సాధనకు 14ఏళ్లు కష్టపడినప్పటికీ, పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లుకావస్తున్నా, ఇంకా తమకు పదవులు దక్కకపోవడం పట్ల పార్టీ ద్వితీయ శ్రేణి నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కనీసం ఈసారి శాసనసభ సమావేశాలు ముగిసిన తర్వాతైనా పదవులు దక్కుతాయన్న గంపేడాశతో ఎదురు చూస్తున్నారు.