రాష్ట్రీయం

ఖమ్మంలో కెసిఆర్ టూర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 14: మూడురోజుల ఢిల్లీ పర్యటనను ముగించుకున్న సిఎం కెసిఆర్ ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఢిల్లీ పర్యటనలో ప్రధాని మోదీ, మంత్రి పియూష్, కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో వేర్వేరుగా సమావేశమైన సంగతి తెలిసిందే. విభజన చట్టం ప్రకారం తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన హామీలను నెరవేర్చడంతో పాటు తెలంగాణ ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించి బడ్జెట్‌లో చేర్చాల్సిందిగా ప్రధానికి సిఎం విజ్ఞప్తి చేశారు. ఇలా ఉండగా సిఎం కెసిఆర్ సోమవారంనుంచి రెండు రోజుల పాటు ఖమ్మం జిల్లా పర్యటనకు వెళ్లనున్నారు. సోమవారం ఖమ్మంలో అధికారులతో సమావేశమై జిల్లాల్లో చేపడుతున్న అభివృద్ధిని సమీక్షిస్తారు. అలాగే మంగళవారం జిల్లాలోని తిరుమలాయపాలెంలో రామదాసు ఎత్తిపోతల పథకానికి, రోళ్ళపాడులో శ్రీరామ సాగునీటి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయనున్నారు. ఖమ్మం పర్యటన ముగిసిన తర్వాత 19న వరంగల్ జిల్లా మేడారానికి వెళ్లి సమ్మక్క, సారలమ్మకు మొక్కులు చెల్లించుకోనున్నారు. ఈ రెండు జిల్లాల్లో సిఎం అధికారిక పర్యటనలు అయినప్పటికీ, త్వరలో వరంగల్, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్లకు జరుగనున్న ఎన్నికలపై దృష్టి కేంద్రీకరించనున్నారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో తెరాస ఘన విజయం సాధించినట్టుగానే వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల్లోనూ పార్టీని విజయపథాన నడిపించడానికి ముందస్తు ప్రణాళికలతో ముందుకెళ్తున్నారు. గ్రేటర్ మున్సిపల్ ఎన్నికల బాధ్యతలను ఐటీ శాఖ మంత్రి కెటిఆర్‌కు అప్పగించినట్టే, వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచార బాధ్యతలను ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ఖమ్మం మున్సిపల్ ఎన్నికల బాధ్యతలను ఆ జిల్లాకు చెందిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు అప్పగించాలని సిఎం నిర్ణయంచినట్టు పార్టీ వర్గాల సమాచారం.