కృష్ణ

ఆన్‌లైన్ వైద్య కేంద్రాలుగా యుహెచ్‌సిలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కార్పొరేషన్), ఏప్రిల్ 6: ప్రజలకు మెరుగైన వైద్య సేవలందిస్తామన్న రాష్ట్ర ప్రభుత్వ హామీ మేరకు ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాల పేరిట ఆన్‌లైన్ వైద్య సేవలను అందుబాటులోకి వస్తున్నాయి. రాష్ట్రంలో మొత్తం 222 కేంద్రాలను ప్రారంభిస్తుండగా విజయవాడ నగరంలో 22 కేంద్రాలతోపాటు జగ్గయ్యపేట, గుడివాడ, మచిలీపట్నంలో మరో 9 కేంద్రాలను శుక్రవారం ప్రారంభం కానున్నాయి. వైద్యం లో నిపుణులైన వైద్యులు వారి వారి హాస్పటల్స్‌లలో అందుబాటులో ఉం టారు. రోగులకు ఏమైనా నిపుణుల సూచనలు అవసరమైతే ఆన్‌లైన్ ద్వారా లైవ్ డెమో నిర్వహించి రోగిని, రోగి సమస్యను వీక్షించి అందుకనుగుణంగా వైద్య సలహాలతోపాటు మందులను కూడా ఆన్‌లైన్ ద్వారానే తెలుపుతారు. ఈవిధానంతో ఇప్పటివరకూ జ లుబు, దగ్గు, జ్వరాలకే పరిమితమై అంతంత మాత్రంగా వైద్య సేవలందిం చే అర్బన్ హెల్త్ సెంటర్లు ఆన్‌లైన్ వై ద్యం ద్వారా నిపుణులు తమ సలహాలను రోగికి అందిస్తారు. వైద్య నిపుణు ల సలహాల కోసం కార్పొరేట్ వైద్యశాలలకు వెళ్ళకుండానే ఈకేంద్రాల ద్వారా తెలుసుకోవచ్చు. అత్యంత ఆధునిక సాంకేతిక వసతులతో ఏర్పాటుచేసిన ఆన్‌లైన్ వైద్య కేంద్రాలను శుక్రవారం సిఎం చంద్రబాబునాయుడు సచివాలయంలోని తన కార్యాలయం నుంచి ఆన్‌లైన్ ద్వారా ప్రారంభించనున్నారు. నగర పరిధిలో ఏర్పాటైయ్యే వైద్య కేంద్రాలు ఈవిధంగా ఉన్నాయి. పటమట, న్యూ ఆర్‌ఆర్ పేట, భవానీపురం పున్నమీ హోటల్ సమీపంలో గల కరకట్ట సౌత్, కెల్‌రావు నగర్‌లోని లంబాడిపేట, కొత్తపేట సుబ్రమణ్యస్వామి గుడి వద్ద, వించిపేట నిజాం గేటు వద్ద, కేదరేశ్వరపేట సెంట్రల్ వేర్ హౌసింగ్ వద్ద, అజిత్‌సింగ్‌నగర్ భగత్‌సింగ్ కమ్యూటీహాల్లోని ఆరోగ్య కేంద్రం, కండ్రిక కమ్యూనిటీహాల్ యుహెచ్‌సి, మధురానగర్ మున్సిపల్ కాంప్లెక్స్‌లోని యుహెచ్‌సి, గిరిపురం రెడ్ సర్కిల్ కమ్యూనిటీహాల్ యుహెచ్‌సి, దుర్గాపురం, గుణదల, లబ్బీపేట, రామలింగేశ్వరనగర్, రాణిగారితోట కమ్యూనిటీహాల్, కృష్ణలంక మున్సిపల్ మెటర్నటీ హోం, ప్రకాష్‌నగర్ కమ్యూనిటీహాల్, పటమట అంబేద్కర్ నగర్ ఈ వైద్య సెంటర్, వాంబేకాలనీ యుహెచ్ సి, గులామ్ మొహిద్దీన్ నగర్ యుహెచ్‌సి, భీమనవారిపేట యుహెచ్‌సి, న్యూ జోజినగర్, క్రీస్తురాజుపురం, శాంతినగర్, జక్కంపూడి వైఎస్‌ఆర్ కాలనీలో ఏర్పాటు చేస్తున్నారు. జిల్లాలో పరిశీలిస్తే గుడివాడలోని బాపూజీనగర్, ఎన్‌టిఆర్ కాలనీ, బేతవోల్, జగ్గయ్యపేట లోని మెట్టుగూడెం యుహెచ్‌సి, మచిలీపట్నం లోని బందర్‌కోట, వీరుగూడెం, చిలకలపూడి, నారాయణపురం, శారదానగర్‌లలోని ఆరోగ్య కేంద్రాల్లో నూతనంగా ఆన్‌లైన్ వైద్య సేవలను అందుబాటులోకి తెస్తున్నారు. ఈమేరకు జిల్లా, పురపాలక ఆరోగ్యాధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు.

మారుతీ సుజుకీ కార్మికులకు
న్యాయం జరిగే వరకు పోరాటం
ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ, ఏప్రిల్ 6: బహుళజాతి సంస్థల ఒత్తిడికి లొంగిపోయిన ప్రభుత్వాలు కార్మికుల హక్కులను, ప్రయోజనాలను విస్మరిస్తున్నాయని, దీనికి మారుతీ సుజుకీ కార్మికులపై అక్రమ కేసులు బనాయించి శిక్షలు విధించటమే ఉదాహరణ అని ఎఐటియుసి రాష్ట్ర సమితి అధ్యక్షుడు చలసాని వెంకట రామారావు విమర్శించారు. మారుతీ సుజుకీ కార్మికులకు సంఘీభావంగా కేంద్ర ట్రేడ్ యూనియన్ల పిలుపులో భాగంగా గురువారం లెనిన్‌సెంటర్‌లో ట్రేడ్ యూనియన్ల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ హర్యానా రాష్ట్రం గుర్‌గావ్‌లో మారుతీ సుజుకీ కార్మికులు కార్మిక సంఘం ఏర్పాటు కోసం యాజమాన్యం, ప్రభుత్వంతో పోరాడాల్సి వచ్చిందని, యూనియన్ రిజిస్ట్రేషన్ అనంతరం రెగ్యులరైజేషన్, వేతనాల పెంపుదల కోసం సమ్మె చేస్తే యాజమాన్యం కిరాయి గుండాలను ప్రవేశపెట్టి దౌర్జన్యానికి పాల్పడి, మేనేజర్ మృతికి కారణమయ్యిందని, దీనికి కార్మికుల పై నెట్టి 13 మందికి జీవిత ఖైదు విధించడం అప్రజాస్వామికమని పేర్కొన్నారు. సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్ నర్సింగారావు మాట్లాడుతూ మార్చి 16వ తేదీ కార్మికులకు బ్లాక్‌డే అని మారుతీ సుజుకీ కార్మికులకు శిక్షలు విధించడం ప్రభుత్వ కార్మిక వ్యతిరేక వైఖరిని తెలియజేస్తుందని అన్నారు. ఐఎఫ్‌టియు రాష్ట్ర కార్యదర్శి పి ప్రసాదరావు మాట్లాడుతూ కార్మిక సంఘాల ఐక్య ఆందోళనలను ప్రభుత్వం పరిగణలోకి తీసుకుని కార్మిక సమస్యలపై దృష్టి పెట్టాలని కోరారు. వైఎస్సార్సీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు పి గౌతంరెడ్డి మాట్లాడుతూ కేంద్ర కార్మిక సంఘాల ఉద్యమానికి తమ మద్దతు ఉంటుందని తెలిపారు. ఐఎఫ్‌టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె రామారావు మాట్లాడుతూ ప్రభుత్వ చర్యలకు నిరసనగా కార్మిక సంఘాలు ఐక్య పోరాటం నిర్వహించాలని కోరారు. ఎఐటియుసి రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి ఆర్ రవీంద్రనాథ్ మాట్లాడుతూ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను తీవ్రంగ విమర్శించారు. లెనిన్ సెంటర్‌లో జరిగిన ధర్నా కార్యక్రమంలో ఎఐటియుసి నగర ప్రధాన కార్యదర్శి వియ్యపు నాగేశ్వరరావు, సిఐటియు జిల్లా కార్యదర్శి శ్రీనివాస్, నాయకులు డేవిడ్, ఐఎఫ్‌టియు రాష్ట్ర కమిటీ సభ్యులు కుటుంబరావు, తదితరులు పాల్గొన్నారు.

బుడమేరు కాల్వ, రైల్వే డబుల్ లైన్
ట్రాక్‌కు భూసేకరణ వేగవంతం
ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ, ఏప్రిల్ 6: బుడమేరు కాలువ విస్తీర్ణ, విజయవాడ - నిడదవోలు రైల్వే డబుల్ లైన్ ట్రాక్‌కు అవసరమైన భూసేకరణను వేగవంతం చేయాలని జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ గంథం చంద్రుడు రెవెన్యూ అధికారులను ఆదేశించారు. గురువారం ఇన్‌చార్జి కలెక్టర్ గంథం చంద్రుడు, విజయవాడ రూరల్ మండలం, దొని ఆత్కూరు గ్రామంలో బుడమేరు కాలువ, రైల్వే డబుల్ లైన్ విస్తరణకు కావాల్సిన భూమికి సంబంధించిన ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఇన్‌చార్జి కలెక్టర్ మాట్లాడుతూ విజయవాడ - నిడదవోలు డబుల్‌ట్రాక్‌కు సంబంధించిన స్థలంకు భూసేకరణ భూమి అవసరం వున్నందున సంబంధిత రైతులకు ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం నష్టపరిహారం అందజేయటం జరుగుతుందని రైతులకు తెలిపారు. అదే విధంగా బుడమేరు కాలువ విస్తీర్ణకు కావాల్సిన భూములకు సంబంధించిన రైతులకు ఎటువంటి నష్టం లేకుండా నష్టపరిహారం అందజేయటం జరుగుతుందని ఇన్‌చార్జి కలెక్టర్ గంథం చంద్రుడు తెలిపారు. పర్యటనలో విజయవాడ రూరల్ మండలం, తహశీల్దార్ మదన్ మోహన్, రెవెన్యూ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు. విజయవాడ రూరల్ మండలంలో ఇన్‌చార్జి కలెక్టర్ గంథం చంద్రుడు పర్యటనలో భాగంగా గొల్లపూడిలోని ఆంధ్రప్రదేశ్ స్టేట్ బేవరేజ్ కార్పొరేషన్ లిమిటెడ్ గోడౌన్‌ను తనిఖీ చేశారు. ఈసందర్భంగా గోడౌన్‌ను నిర్వహిస్తున్న తీరును ఆయన అడిగి తెలుసుకున్నారు.