కృష్ణ

గెలుపే లక్ష్యంగా పని చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, ఏప్రిల్ 19: మరో రెండేళ్లల్లో జరగనున్న ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు పని చేయాలని పలువురు నేతలు పిలుపునిచ్చారు. రాష్ట్ర న్యాయ, క్రీడా, యువజన సంక్షేమ శాఖల మంత్రి కొల్లు రవీంద్ర అధ్యక్షతన బుధవారం స్థానిక సిరి కల్యాణ మండపంలో తెలుగుదేశం పార్టీ బందరు నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి పార్లమెంట్ సభ్యుడు కొనకళ్ల నారాయణరావు, పార్టీ జిల్లా అధ్యక్షుడు, శాసనమండలి సభ్యుడు బచ్చుల అర్జునుడుతో పాటు పరిశీలకులుగా ఏడుకొండలు, పార్ధసారథి, సత్యవాణిలు పాల్గొని కార్యకర్తలకు దిశా, నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా పార్టీ ముఖ్య నేతలు మాట్లాడుతూ రాష్ట్ర విభజన అనంతరం అధికారంలోకి వచ్చిన తమ ప్రభుత్వం ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తోందన్నారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదురైనప్పటికీ అభివృద్ధి, సంక్షేమ పథకాల విషయంలో రాజీ పడకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలన సాగిస్తున్నారన్నారు. ప్రభుత్వం ప్రవేశ పెట్టే ప్రతి సంక్షేమ పథకాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లి విస్తృత ప్రచారం కల్పించాలన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతు, డ్వాక్రా రుణ మాఫీ చేశామన్నారు. పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా డెల్టా భూములను సస్యశ్యామలం చేసి అధిక దిగుబడుల ద్వారా రైతులకు లబ్ధి చేకూర్చిన ఘనత మనకే దక్కుతుందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ పెన్షన్, రేషన్ అందిస్తూ పేద ప్రజల మన్ననలు పొందుతున్నట్లు చెప్పారు. ఇంత చేసినా ప్రతిపక్షం మాత్రం ప్రభుత్వంపై బురద జల్లేందుకు ప్రయత్నిస్తోందని, దీనికి అడ్డుకట్ట వేయాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందని అన్నారు. ఈ సమావేశంలో టిడిపి రాష్ట్ర కార్యదర్శి కొనకళ్ల బుల్లయ్య, మాజీ డిప్యూటీ స్పీకర్ బూరగడ్డ వేదవ్యాస్, టిడిపి సీనియర్ నాయకులు కొనకళ్ల బుల్లయ్య, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ మాజీ చైర్మన్ బూరగడ్డ రమేష్ నాయుడు, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గొర్రిపాటి గోపిచంద్, మున్సిపల్ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్, జెడ్పీటిసి లంకే నారాయణ ప్రసాద్, ఎంపిపి కాగిత వెంకటేశ్వరరావు, ఎఎంసి చైర్మన్ గోపు సత్యనారాయణ, కౌన్సిలర్లు, సర్పంచ్‌లు, ఎంపిటిసిలు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.