రాష్ట్రీయం

‘ఒక్క నిమిషం’ నిబంధన టెన్త్ పరీక్షల్లో తొలగింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐదు నిమిషాల వరకు అనుమతి
తెలంగాణ డిప్యూటీ సిఎం ఆదేశాలు

హైదరాబాద్, మార్చి 12: తెలంగాణలో ఈ నెల 21న ప్రారంభం అవుతున్న టెన్త్ పరీక్షల సందర్భంగా విద్యార్థులకు ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించేది లేదనే నిబంధనను తొలగించారు. కనీసం తొలి ఐదు నిమిషాల వరకూ విద్యార్థులను అనుమతించాలని అధికారులను ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఆదేశించారు. కేవలం చీఫ్ సూపరింటెండెంట్ వద్ద మినహా ఎవరి వద్దా సెల్ ఫోన్లను అనుమతించ వద్దని ఉప ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ నెల 21 నుండి ప్రారంభం అవుతున్న పరీక్షలు ఏప్రిల్ 9వ తేదీ వరకూ జరగనున్నాయి.
ఉదయం 9.30 నుండి మధ్యాహ్నం 12.15 గంటల వరకూ ఈ పరీక్షలు జరుగుతాయని, పరీక్ష రాస్తున్న విద్యార్ధులు అంతా ఉదయం 8.30 గంటలకే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని ఉప ముఖ్యమంత్రి సూచించారు. పరీక్ష 9.30కు ప్రారంభం అవుతుందని, అయినా 9.35 గంటల వరకూ విద్యార్ధులను అనుమతిస్తారని అన్నారు. అదనపు సమయం ఇవ్వడం జరగదని, కనుక ముందుగానే విద్యార్ధులు పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు.