తెలంగాణ

కారును ఢీకొన్న లారీ: అయిదుగురు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజమాబాద్: పదో తరగతిలో మంచి మార్కులతో ప్యాసయిన పిల్లలను హైదరాబాద్‌లోని కళాశాలలో చేర్పిద్దామని తీసుకువెళ్తుండగా మృత్యువు కాటేసింది. ఈ ఘటనలో ముగ్గురు పిల్లలు, దంపతులు ప్రాణాలు కోల్పోయారు. నిజామాబాద్ జిల్లా కామారెడ్డి వద్ద బుధవారం ఉదయం ఈ ఘోరం జరిగింది. ఆలూరుకు చెందిన హర్ష, వెల్మల్‌కు చెందిన నిఖిత, భరత్‌లతో పాటు వారి తల్లిదండ్రులు కారులో హైదరాబాద్‌కు వెళ్తుండగా ఎదురుగా వచ్చిన లారీ ఢీకొంది. దీంతో అయిదుగురు సంఘటన స్థలంలోనే మరణించారు. కారు నుజ్జునుజ్జయ్యింది. ఈ ఘటనపై సిఎం కెసిఆర్, జిల్లా మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.