కృష్ణ

కాపులను బిసిల్లో చేర్చేందుకు 8 మాసాల్లో నివేదిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* అఖిల భారత కాపు సమాఖ్యను బలోపేతం చేస్తాం
* కాపు కార్పొరేషన్ చైర్మన్ చలమలశెట్టి
* రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా నరహరశెట్టి, మాసాబత్తుల
విజయవాడ, మార్చి 11: తెలుగుదేశం పార్టీ తన ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీలకు అనుగుణంగా కాపుల సంక్షేమానికి అన్ని విధాలుగా తమ ప్రభుత్వం పాటుబడుతోందంటూ కాపు కార్పొరేషన్ చైర్మన్ చలమలశెట్టి రామానుజయ్య తెలిపారు. ప్రధానంగా కాపులను బిసిల జాబితాలో చేర్పించేందుకు నియమితులైన జస్టిస్ మంజునాథ్ కమిషన్ సరిగ్గా మరో 8మాసాల్లో తన నివేదికను సమర్పించనుందన్నారు. ఇటు ప్రభుత్వంపై విశ్వాసం.. అటు విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని ముద్రగడ పద్మనాభం తన దీక్షను వాయిదా వేయడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. ఇక తాను జాతీయ అధ్యక్ష హోదాలో అఖిల భారత కాపు సమాఖ్యను బలోపేతం చేయబోతున్నామన్నారు. ఐదారు రాష్ట్రాల్లో ఇప్పటివరకు అడ్‌హక్ కమిటీలు కొనసాగుతున్నాయంటూ ఆంధ్రప్రదేశ్‌కు అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా న్యాయవాది నరహరశెట్టి శ్రీహరి, ఎన్‌ఆర్‌ఐ మాసాబత్తుల శ్రీనివాస్‌ను నేడు నియమిస్తున్నానంటూ హర్షధ్వానాల మధ్య ప్రకటిస్తూ వారిరువురికి నియామక పత్రాలను అందజేశారు. ఆంధ్రతో పాటు తెలంగాణా, తమిళనాడు, కర్నాటక, చత్తీస్‌ఘడ్, ఒరిస్సా రాష్ట్రాల్లో కాపులు పెద్ద సంఖ్యలో ఉన్నారన్నారు.
శుక్రవారం నాడిక్కడ ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో రామానుజయ్య మాట్లాడారు. ఇటీవల ఇచ్చిన హామీ ప్రకారం చంద్రబాబు ప్రస్తుత బడ్జెట్‌లో కాపు కార్పొరేషన్‌కు వెయ్యి కోట్లు కేటాయించారన్నారు. అట్టడుగునున్న కాపు విద్యార్థులు, యువకులను విద్య, ఉపాధి, ఆర్థికపరంగా ఇటు కాపు సమాఖ్య అటు కార్పొరేషన్ సర్వే విధాలుగా ఆదుకోగలదన్నారు. ఈనెల 12న అనంతపురంలో జరిగే రుణమేలాలో 15వేల మందికి ఆర్థిక సహాయం అందించనున్నామని ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, స్థానిక మంత్రులు పాల్గొననున్నారని తెలిపారు. రాష్ట్ర అధ్యక్షునిగా నియమితులైన శ్రీహరి మాట్లాడుతూ కాపు కార్పొరేషన్, కాపు సమాఖ్యల సహకారంతో కాపుల సంక్షేమం కోసం తాను అహర్నిశలు పాటుబడగలనన్నారు. ఈ సమావేశంలో సమాఖ్య జాతీయ కార్యదర్శి అర్జా శివకుమార్, కాపు సంఘ నేతలు అర్జా పాండురంగారావు, సర్వ కాపు సమ్మేళనం కన్వీనర్ మల్లెమూడి పిచ్చయ్యనాయుడు, నాయకులు కంది అమరలింగేశ్వరరావు, నెలిబండ్ల రాజు తదితరులు పాల్గొన్నారు.