కృష్ణ

కార్తీక స్నానాలకు విస్తృత ఏర్పాట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంద్రకీలాద్రి, నవంబర్ 29: భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పవిత్ర స్నానాలు ఆచరించేందుకు ఆలయ సిబ్బంది సకల ఏర్పాట్లు చేయాలని శ్రీదుర్గా మల్లేశ్వరస్వామివార్ల దేవస్థానం ఇలో సిహెచ్ నరసింగరావుసిబ్బంది ఆదేశాలు జారీ చేసారు. అమ్మవారి భవానీదీక్షమండపంలో ఇవో సిబ్బందితో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. సోమవారం అధిక సంఖ్యలో పవిత్ర స్నానాలు ఆచరించేందుకు భక్తులు దుర్గాఘాట్‌కు మాత్రమే వచ్చే అవకాశం ఉందని ఈఅంశాన్ని దృష్టిలో పెట్టుకొని భక్తుల రద్ధీకి అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని ఆయన సిబ్బందికి ఆదేశాలు జారీ చేసారు. ఘాట్‌ను నిరంతరం పరిశుభ్రంగా ఉంచే విధంగా ఆలయ సిబ్బంది అదనపుసిబ్బంది ఏర్పాటు చేసుకోవటంతోపాటు, అవసరమేరకు స్వచ్చంధ సేవ సంస్ధల కార్యకర్తల సహాకారం తీసుకోవాలన్నారు. జల్లు స్నానాలు, మంచినీటి వసతి, తదితర భక్తులకు అవసరమైన వౌళిక ఏర్పాట్లును ముందుగానే చేసుకోవాలని నరసింగరావు పేర్కొన్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా సిబ్బంది చర్యలు తీసుకోవాలన్నారు. ఈసందర్భంగా ఇప్పటి వరకు తీసుకున్న వివిధ కార్యక్రమాలు, ఏర్పాట్లు, సిబ్బంది ఏర్పాటు,తదితర వివరాలను సిబ్బంది ఇవోదృష్టికి తీసుకొచ్చారు.