రాష్ట్రీయం

ఆంధ్రకు కెసిఆర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రేపు విజయవాడకు..
చండీయాగానికి చంద్రబాబుకు ఆహ్వానం

హైదరాబాద్, డిసెంబర్ 12: ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు 14న విజయవాడలో ఆంధ్ర సిఎం చంద్రబాబును కలుస్తారు. 23నుంచి కెసిఆర్ నిర్వహించే అయుత మహా చండీయాగానికి చంద్రబాబును ఆహ్వానించేందుకు కెసిఆర్ విజయవాడ వెళ్తున్నారు. చండీయాగానికి ఇప్పటికే రాష్టప్రతిని, పలు రాష్ట్రాల గవర్నర్‌లను, కేంద్ర మంత్రులను కెసిఆర్ ఆహ్వానించారు. ఆంధ్ర సిఎం చంద్రబాబును ఆహ్వానిస్తానని గతంలోనే కెసిఆర్ ప్రకటించారు. అమరావతి శంకుస్థాపనకు చంద్రబాబు స్వయంగా కెసిఆర్ క్యాంపు కార్యాలయానికి వెళ్లి ఆహ్వానించారు. అదేవిధంగా ఇప్పుడు కెసిఆర్ విజయవాడ వెళ్లి క్యాంపు కార్యాలయంలో బాబును కలిసి చండీయాగానికి ఆహ్వానిస్తారు. చండీయాగం జరిగే సమయానికి రాష్టప్రతి హైదరాబాద్‌లోనే ఉంటారు. యాగానికి రాష్టప్రతి హాజరవుతారు. అదేవిధంగా ఉమ్మడి గవర్నర్ నరసింహాన్, కేంద్ర మంత్రి ఎం వెంకయ్యనాయుడు హాజరుకానున్నారు.
నోటుకు ఓటు కేసు తరువాత అమరావతి శంకుస్థాపన సమయంలో, తిరిగి ఇప్పుడు యాగం సమయంలో ఇద్దరు సిఎంలు కలువనున్నారు. కెసిఆర్ నివాసానికి బాబు వచ్చినప్పుడు ఇద్దరు నేతలు కొద్దిసేపు ఏకాంతంగా చర్చించుకున్నారు. అమరావతి శంకుస్థాపనలో ప్రధాన సమక్షంలోనే ఇద్దరు సిఎంలు కలుసుకున్నా మాట్లాడుకునే అవకాశం చిక్కలేదు. అరుణ్‌జైట్లీ ఇంట్లో పెళ్లి విందుకు హాజరైనపుడూ పలకరింపులే తప్ప చర్చలకు చాన్స్ దొరకలేదు. కెసిఆర్ 14న విజయవాడ వెళ్లి చంద్రబాబును ఆహ్వానించే సమయంలో ఇద్దరు సిఎంల చర్చకు అవకాశం ఉంటుంది. రెండు రాష్ట్రాలకు సంబంధించి పెండింగ్‌లోని పలు అంశాలపై చర్చించవచ్చని తెరాస వర్గాలు అంటున్నాయి.