కరీంనగర్

నేడు రాజన్న క్షేత్రానికి కెసిఆర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏర్పాట్లలో తలమునకలైన అధికార యంత్రాంగం * ఉదయం 10.30 గంటలకు సిఎం రాక
వేములవాడ, డిసెంబర్ 27: ముఖ్యమంత్రి కెసిఆర్ నేడు రాజరాజేశ్వరస్వామి క్షేత్రానికి వస్తున్నారు. మెదక్ జిల్లాలోని జగదేవపూర్ మండలం ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో లోక కల్యాణార్థం నిర్వహించిన అయుత చండీయాగం విజయవంతంగా పూర్తి అవడంతో రాజరాజేశ్వరస్వామిని దర్శించుకోవాలని కెసిఆర్ నిర్ణయించుకున్నారు. ఈ మేరకు జిల్లా అధికార యంత్రాంగానికి పర్యటనకు సంబంధించిన సమాచారం అందింది. ఆదివారం ఆగమేఘాల మీద జిల్లా కలెక్టర్ నీతూకుమారి ప్రసాద్, ఓఎస్డీ సుబ్బారాయుడు, ఈవో రాజేశ్వర్, వివిధ శాఖ అధికారులు హుటహుటిన వేములవాడకు చేరుకుని పర్యటనకు సంబంధించి పూర్తి ఏర్పాట్ల చేశారు. ఓఎస్డీ సుబ్బారాయుడు, సబ్ డివిజన్ అధికారులతో కలసి ఆలయంలో బందోబస్తు ఏర్పాట్లు పరిశీలించారు. భక్తుల రద్దీ అధికంగా ఉండే అవకాశం ఉండటంతో భద్రత పరంగా తీసుకోవాల్సిన చర్యలు, జాగ్రత్తల గురించి స్థానిక పోలీసు అధికారులకు ఓఎస్డీ సూచనలు ఇచ్చారు.
ఆలయ అభివృద్ధి కలెక్టర్ సమీక్ష
ఇప్పటి వరకూ ఆలయంలో జరుగుతున్న అభివృద్ధి పురోగతిపై కలెక్టర్ నీతూకుమారి ప్రసాద్ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఆదివారం ధర్మకర్తల మండలి సమావేశ మందిరంలో పోలీస్, రెవెన్యూ, దేవాదాయ, పర్యాటక శాఖ అధికారులతో ఆమె ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఆలయ అభివృద్ధి ఏ స్థాయిలో ఉన్నాయో స్వయంగా ఈవో రాజేశ్వర్‌ను అడిగి ఆమె తెలుసుకున్నారు. అనంతరం గుడి చెరువు కట్ట ప్రాంతంలో హెలిప్యాడ్‌ను ఆమె పరిశీలించారు.
సిఎం షెడ్యూల్ ఇదీ..
ముఖ్యమంత్రి కెసిఆర్ కుటుంబ సభ్యులు సోమవారం ఉదయం 8గంటలకు ఎర్రవల్లిలోని యాగశాల నుంచి నేరుగా వేములవాడకు రహదారి మార్గన బయలుదేరి వస్తారు. ఆలయానికి చేరుకున్నాక ఆలయ అతిథి గృహంలో కాసేపు విడిది నిర్వహించి అనంతరం స్వామివారికి దర్శించుకోడానికి సతీసమేతంగా అతిథి గృహం నుంచి ఆలయంలో బయలుదేరుతారు. గర్భాలయంలో కొలువుదీరిన శ్రీ స్వామివార్లకు,అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసుకుంటారు.