రాష్ట్రీయం

జాప్యం సహించను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యాదాద్రి పనులపై ముఖ్యమంత్రి కెసిఆర్ అసంతృప్తి
నిధుల కొరత లేదని స్పష్టీకరణ
భోజనానికి రమ్మని ‘విస్తరణ’ బాధితులకు ఆహ్వానం
మాస్టర్ ప్లాన్ రూపకల్పనలో జాప్యంపై అసహనం
లక్ష్మీ నారసింహునికి పట్టువస్త్రాల సమర్పణ

నల్లగొండ, మార్చి 17: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధి విస్తరణ పనులు మందకొడిగా జరుగుతున్నందుకు ముఖ్యమంత్రి కెసిఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. నిధుల కొరత లేదనీ, పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. యాదాద్రి లక్ష్మీనరసింహుడి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం స్వామివారి తిరుకల్యాణోత్సవానికి ప్రభుత్వం తరపున కెసిఆర్ దంపతులు పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పించారు. ఉదయం 10.30 గంటలకు హెలికాప్టర్‌లో గుట్టలో దిగిన కెసిఆర్ నేరుగా కొండపై ఆండాళ్ నిలయం అతిథి గృహానికి చేరుకున్నారు. అక్కడి నుండి అర్చక బృందం వేద మంత్రోచ్చరణల మధ్య కెసిఆర్ దంపతులు పట్టువస్త్రాలను తలపై పెట్టుకుని గర్భాలయానికి చేరుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధానార్చకులు నందీగల్ నరసింహాచార్యుల ఆధ్వర్యంలోని అర్చక బృందం కెసిఆర్ దంపతులకు, మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి దంపతులకు ఆశీర్వచనాలు పలికారు. స్వామివారి అలంకార సేవలో భాగంగా ఎనిమిదవ రోజు నిర్వహించిన పంచనారసింహడి శ్రీరామ అలంకార సేవలో కెసిఆర్ దంపతులు పాల్గొన్నారు. పూజాదికాలు పూర్తయిన అనంతరం ఆండాళ్ అతిథి గృహంలో వైటిడిఎఏ వైస్ చైర్మన్ కిషన్‌రావు, జిల్లా కలెక్టర్ సత్యనారాయణరెడ్డి, జెసి సత్యనారాయణ, ఈవో గీత, స్థపతి సౌందర్యరాజన్, అర్కిటెక్ట్ అనందసాయిలతో ఆలయ అభివృద్ధి పనులను సమీక్షించారు. నిధుల కొరత లేకున్నా విస్తరణ పనుల్లో వేగం లోపించిందని అసంతృప్తి వ్యక్తం చేశారు. కూల్చివేతల ఆలస్యంతోపాటు టెంపుల్ సిటీ నిర్మాణం పనుల ప్రారంభంలో, మాస్టర్ ప్లాన్ రూపకల్పనలో కన్సల్టెన్సీ ఏజెన్సీ జాప్యం చేయడంపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేస్తూ వెంటనే ఆర్‌అండ్‌బీ అధికారులకు సదరు పనులను అప్పగించాలని అధికారులను ఆదేశించారు. కల్యాణమండపాన్ని కనీసం ఆరు వేలమంది కూర్చునేలా రూపొందించాలని సూచించారు. బాల ఆలయ నిర్మాణ పనులు సత్వరమే పూర్తి చేయాలన్నారు. పలు వాస్తుమార్పులను కూడా కెసిఆర్ సూచించారు. ఆలయ విస్తరణతో నష్టపోతున్న దుకాణాదారుల నుండి 20మంది ప్రతినిధులను శుక్రవారం తన ఇంటికి భోజనానికి రావాలని సీఎం కెసిఆర్ సూచించారు. తన క్యాంపు ఆఫీస్‌లోనే కూర్చుని మాట్లాడుకుందామని వారు సంతృప్తి చెందిన పిదపనే ఆలయ మార్గాల్లో రోడ్ల విస్తరణ, కూల్చివేతలను కొనసాగిస్తామని సీఎం చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు నీటితో నింపనున్న బస్వాపురం చెరువు సమీపంలో 200 ఎకరాల్లో బెంగుళూర్ బృందావన్ గార్డెన్ తరహాల్లో పార్క్ నిర్మించేందుకు వెంటనే ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. (చిత్రం) లక్ష్మీనరసింహుడి కల్యాణోత్సవానికి పట్టువస్త్రాలను సమర్పిస్తున్న సిఎం కెసిఆర్ దంపతులు