రాష్ట్రీయం

తెలంగాణ కాశ్మీరం ఆదిలాబాద్: కేసీఆర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లా తెలంగాణ కాశ్మీరం అని, ఈ జిల్లా ఇంకా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని డైట్ కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఆదిలాబాద్ నియోజకవర్గ ప్రజాప్రతినిధుల సమావేశంలో పాల్గొని ముఖ్యమంత్రి ప్రసంగించారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహారాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి.. 50 ఏండ్లుగా కొనసాగుతున్న లోయర్ పెన్‌గంగా ప్రాజెక్టుపై ఉన్న ప్రతిష్టంభనను తొలగించామని తెలిపారు. ఈ సంవత్సరంలోనే లోయర్ పెన్‌గంగా నీళ్లను ఆదిలాబాద్ జిల్లాలో పారిస్తామని తెలిపారు. బోథ్ నియోజకవర్గంలో రూ. 210 కోట్లతో గోముత్రి రిజర్వాయర్ నిర్మాణం చేపడుతామన్నారు.