తెలంగాణ

ఈ గెలుపుతో బాధ్యత పెరిగింది: కేసిఆర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో సంపూర్ణ విజయం సాధించామని, ప్రాంత, కుల, మత విబేధాలు చూపకుండా మంచి మెజారిటీతో విజయం అందించిన జంటనగరాల ప్రజలకు శిరసువంచి నమస్కరిస్తున్నానని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు. గ్రేటర్ ఫలితాల అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజలు ఇష్టంతో వేసిన ఓట్లవల్లే గెలిచామని, తమకష్టంతో ఈ గెలుపు రాలేదని ఆయన అన్నారు. హైదరాబాద్‌లో ఉన్నవారంతా తమ బిడ్డలేనని, వారి జీవనోపాధికి, రక్షణకు బాధ్యత తీసుకుంటామని అన్నారు. ఈ వచ్చే ఆర్థిక సంవత్సరంలో గ్రేటర్‌లో లక్ష బెడ్ రూమ్ ఇళ్లు కట్టించి, గృహప్రవేశాలుకూడా జరిగేలా చూస్తానని ఆయన అన్నారు. ప్రతిపక్షాల వైఖరి మారాలని, ప్రజాతీర్పును అనుసరించి నిర్మాణాత్మక సూచనలు చేయాలని ఆయన సూచించారు. మేయర్, డిప్యూటి మేయర్‌ల ఎంపికపై పార్టీనేతలు, మంత్రులు కలసి చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. గ్రేటర్ హైదరాబాద్‌లో లంచం లేకుండా పనిజరిగే వాతావరణం కల్పించాల్సిన బాధ్యత కొత్తగా ఎంపికైన యువ కార్పొరేటర్లు, కాబోయే మేయర్, డిప్యూటి మేయర్‌లపై ఉందని, అప్పుడే ఈ విజయానికి సార్థకత లభిస్తుందని ఆయన అన్నారు.