క్రైమ్/లీగల్

జూదరుల అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దువ్వూరు, మే 14: మండల కేంద్రమైన దువ్వూరులోని క్రిష్టియన్ కాలనీలోని నలుగురు జూదం ఆడుతుండగా వారిని అరెస్టు చేసినట్లు ఎస్సై విద్యాసాగర్ తెలిపారు. సోమవారం క్రిష్టియన్ కాలనీ సమీపంలో కంపచెట్లులో జూదం ఆడుతున్నట్లు సమాచారం రావడంతో ఎస్సై తన సిబ్బందితో కలిసి దాడి చేశారు. ఈ దాడిలో కోగటం మత్తయ్య, మరో ముగ్గురిని అదుపులోకి తీసుకుని వారి వద్ద వున్న రూ.2250లు స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ మేరకు కేసును నమోదు చేసి దర్యాప్తు చేసుకున్నారని ఆయన వివరించారు.

క్రికెట్ బెట్టింగ్ రాయుళ్ల అరెస్టు
రైల్వేకోడూరు, మే 14: పట్టణంలో క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడిన ఆరుగురు యువకులను అరెస్టు చేసినట్లు ఎస్సై వెంకటేశ్వర్లు తెలిపారు. పట్టణానికి చెందిన రాఖీ, ఆలీ, శివయ్య, మరో ముగ్గురిని అరెస్టు చేసి, వారి నుంచి 6 సెల్‌ఫోన్‌లు, రూ. 11,300 నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.