క్రైమ్/లీగల్

అదుపు తప్పిన వాహనం: ముగ్గురు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖాజీపేట, సెప్టెంబర్ 6: కర్ణాటక రాష్ట్రం నుంచి తిరుమల బయల్దేరిన తుఫాన్ వాహనం గురువారం ఖాజీపేట వద్ద రివైడర్‌ను ఢీకొని వాగులో పడింది. ఈ ఘటనలో లక్ష్మణ్ (50), గణేశ్ (30), మరొక వ్యక్తి మృతి చెందగా 18 మంది తీవ్రంగా గాయపడి కడపలో చికిత్స పొందుతున్నారు. వివరాల్లోకి వెళితే మహారాష్ట్ర లోని నాందేడ్ జిల్లా తండా గ్రామానికి చెందిన 21 మంది ప్రయాణికులు తిరుమల దైవ దర్శనానికి బయల్దేరి వచ్చారు. కడప జిల్లా ఖాజీపేట మండలం భూమాయపల్లె వద్దకు రాగానే తుఫాన్ వాహనం టైర్ పంఛర్ కావడంతో అతి వేగంగా వెళ్లి రివైడర్‌ను ఢీకొని వాగులో పడిపోయింది. ఈ సంఘటనలో వాహనం తునాతునకలు కాగా అందులో వున్న 21 మంది హాహాకారాలు చేస్తూ చల్లాచదురుగా పడిపోయారు. విషయాన్ని గమనించిన స్థానికులు ఘటనా స్థలం నుండి క్షతగాత్రులను బయటకు తీసి చికిత్స నిమిత్తం కడప రిమ్స్‌కు తరలించే ప్రయత్నం చేశారు. మైదుకూరు రూరల్ సీఐ హనుమంత్‌నాయక్, ఎస్‌ఐ హాజీవల్లిలు హైవే అంబులెన్స్ ద్వారా 21 మందిని కడపకు తరలించగా త్రిపత్, అర్చనా, జిజియాభాయ్, సంధ్య, రాథోడ్, వైష్ణవి, మనోజ్, ఆర్థిలు తీవ్రంగా గాయపడ్డారు. అందరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఘటనా స్థలిలో ఎస్‌ఐ హాజీవలి పనితీరును స్థానికులు కొనియాడారు.