క్రైమ్/లీగల్

76 ఎర్రచందనం దుంగలు స్వాధీనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సుండుపల్లె, అక్టోబర్ 23: రెండు వేర్వేరు ప్రదేశాలలో జరిగిన దాడుల్లో 76 ఎర్రచందనం దుంగలను స్వాధీనపరచుకొని పది మంది ఎర్రచందనం కూలీలను అరెస్టు చేసినట్లు ఫారెస్టు శాఖాధికారులు తెలిపారు. సానిపాయిలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో పింఛా ఫారెస్ట్ సెక్షన్ అధికారి ఎంవి రమణ మాట్లాడుతూ జిల్లేలమంద బీట్ పింఛా సెక్షన్‌లోని ముచ్చుకుంట ప్రదేశంలో జరిగిన దాడుల్లో ఆరు మంది తమిళ కూలీలను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. వారి వద్ద నుండి 60 ఎర్రచందనం దుంగలను స్వాధీనపరచుకున్నామన్నారు. తమిళనాడుకు చెందిన గోవిందన్, మురుగేశన్, హనుమాన్, శివకుమార్, కాలీరామన్, రామన్‌కాలీముత్తు, రామస్వామి, కడియన్, చిన్నప్పన్, సుధాకర్‌లను దాడుల్లో అదుపులోకి తీసుకుని అరెస్టు చేశామన్నారు. వీరి వద్ద నుండి రెండు టన్నుల ఎర్రచందనాన్ని స్వాధీనపరచుకున్నట్లు తెలిపారు. శేషాచలం అడవులపై కనే్నసిన తమిళులను చాకచక్యంగా అజ్ఞాతవ్యక్తులు ఇచ్చిన సమాచారం మేరకు తమ సిబ్బంది ఈ దాడుల్లో పాల్గొని అరెస్టు చేసినట్లు తెలిపారు. అలాగే ముడుంపాడు బీట్, చిప్పబావి ప్రదేశం నందు దాడులు చేసి నలుగురు ఎర్రచందనం కూలీలను అదుపులోకి తీసుకొని 16 ఎర్రచందనం దుంగలను స్వాధీనపరచుకున్నట్లు రిజర్వ్‌డ్ ఫారెస్టు డిప్యూటీ అధికారి పిచ్చయ్య తెలిపారు. 500 కేజీల ఎర్రచందనం దుంగలు రూ.1.80 లక్షలు విలువ చేస్తాయన్నారు. ముద్దాయిలపైన కేసు నమోదు చేసి కోర్టుకు తరలించినట్లు తెలిపారు. చిత్తూరు జిల్లా వైవి పాలెం మండలానికి చెందిన ఆర్.సుబ్రమణ్యం, అనంతపురం జిల్లా సివి పల్లెకు చెందిన శ్రీనివాసులు, బెంగళూరుకు చెందిన గోపాల్, సంబేపల్లె మండలం మోటకట్లకు చెందిన వెంకటరమణలను ఈ దాడుల్లో ముడుంపాడు బీట్ పరిధిలో అరెస్టు చేసినట్లు తెలిపారు. శేషాచలం అడవులలో గత ఐదు రోజులుగా జరిగిన కూంబింగ్‌లో ఈ పది మందిని అరెస్టు చేశామన్నారు. ఈ కార్యక్రమాల్లో పింఛా సెక్షన్ ఎఫ్‌బీవో రవిశంకర్, సునీర్‌బాష, ముడుంపాడు, పింఛా సెక్షన్ ఫారెస్టు సిబ్బంది పాల్గొన్నారు.