క్రైమ్/లీగల్

చినీపై నుండి పడి మధ్యప్రదేశ్ కార్మికుడి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాల్వంచ, జూన్ 12: కేటీపీఎస్ 7వ దశ కర్మాగారంలో ఓ నిర్మాణ కార్మికుడు మృతి చెందిన సంఘటన మంగళవారం జరిగింది. మధ్యప్రదేశ్ డెవొర గ్రామానికి చెందిన రాంపాల్‌కేవత్ (29) గత సంవత్సరం క్రితం పాల్వంచలో నూతనంగా నిర్మాణం చేస్తున్న కెటిపిఎస్ 7వ దశ కర్మాగారంలో పెయింటర్‌గా పని చేసేందుకు బిహెచ్‌ఇఎల్ కంపెనీకి చెందిన ఒక కాంట్రాక్టర్ ద్వారా ఇక్కడకు వచ్చి పని చేస్తున్నాడు. రోజుమాదిరిగా రాంపాల్ కర్మాగారంలోని చిమ్నిపై రంగులు వేస్తుండగా ఒక్కసారిగా గాలి, వర్షం రావడంతో రాంపాల్ కిందకు దిగుతున్న క్రమంలో ప్రమాదవశాత్తు జారి కిందపడ్డాడు. దీంతో రాంపాల్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని జెన్‌కో అధికారులు స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

రూ.25 లక్షలు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలి
కిందపడి మృతి చెందిన రాంపాల్ కుటుంబానికి రూ.25లక్షలు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేస్తూ సిఐటియు, ఎఐటియుపి నాయకులు ఆసుపత్రి వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు యూనియన్ నాయకులు మాట్లాడుతూ నూతనంగా నిర్మాణం చేస్తున్న 7వ దశ కర్మాగారంలో పని చేస్తున్న కార్మికులకు ఎలాంటి రక్షణ చర్యలు తీసుకోకపోవడమే కార్మికులు మృత్యువాత పడుతున్నారని అన్నారు. రాంపాల్ మృతుని కుటుంబానికి ఎక్స్‌గ్రేషియా చెల్లించే వరకు ఆందోళనను విరమించబోమన్నారు.