కృష్ణ

ఘాట్లలో పిండ ప్రధానం, నదిలో సంకల్పానికి ఆటంకాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఆగస్టు 14: కృష్ణా పుష్కరాలను ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నప్పటికీ పలు స్నాన ఘట్టాల్లోను, దేవాలయాల్లోను ప్రత్యేక సమస్యలు తెరపైకి వస్తుండటం చూసి ముఖ్యమంత్రి చంద్రబాబు నివ్వెరపోతున్నారు. ఓ దశలో అసహనానికి గురవుతున్నారు. ప్రతిరోజూ మధ్యాహ్నం మీడియా ప్రతినిధులతో సమావేశమై యాత్రికులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఫీడ్‌బ్యాక్ తీసుకుంటున్నారు. భవానీ ఘాట్, మరికొన్ని ఘాట్లలో పిండ ప్రధానంకు కేవలం 15 నిమిషాలే సమయం కేటాయిస్తూ త్వరగా ముగించాలంటూ విధి నిర్వహణలోనున్న సిబ్బంది వేధిస్తుండటం, పూజలనంతరం కృష్ణానదిలో యాత్రికులచే సంకల్పం చేయించడానికి పురోహితులను అనుమతించకపోవడం సిఎం దృష్టికి వచ్చాయి. తాను కూడా పిండ ప్రధానంలో పాల్గొన్నానని కనీసం ఒక గంట సమయం పడుతుంటే 15 నిమిషాలకే ఎలా పరిమితం చేస్తారంటూ ప్రశ్నించారు. స్థలాభావం ఉంటే ఇప్పటికే ఎండను దృష్టిలో ఉంచుకుని అదనంగా షామియానాలు వేయించాం కదా అన్నారు. నదిలో సంకల్పంకు అవరోధం సృష్టించవద్దని అధికారులను ఆదేశించారు. పలు ఘాట్‌లలో బట్టలు మార్చుకునే గదులకు అడ్డంగా తేలికపాటి వస్త్రాలను కట్టటంతో గాలిలో ఎగురుతున్నాయని పలువురు ఫిర్యాదు చేయగా తక్షణం పకడ్బందీ ఏర్పాట్లు చేయాలంటూ ఆదేశించారు.