అక్షర

వర్తమాన సామాజిక సమస్యల ప్రతిబింబం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కిటికీ తెరిస్తే.. .. ..
విహారి కథానికలు
వెల: రు.110/-
ప్రతులకు: 1) చినుకు పబ్లికేషన్సు
గరికపాటి వారి వీధి
గాంధీనగర్, విజయవాడ- 520 003
2) జె.యస్.మూర్తి
16-11-310/12/ఎ/1/1
గణపతి గుడి బజారు
మలక్‌పేట, హైద్రాబాదు- 500 036
సెల్: 98480 25600

ప్రముఖ రచయిత విహారి కలంనుండి వెలువడిన మరో కథాసంకలనం ‘కిటికీ తెరిస్తే’. ఇందులో వర్తమాన సామాజిక సమస్యల మీద రాసిన 15 కథలున్నాయి. ఇవన్నీ ఇటీవలి కాలంలో పత్రికలలో ప్రచురింపబడినవే.
వెనుకటి తరం వాళ్ల ఆలోచనా ధోరణిని ప్రతిబింబించే మంచి కథ ‘నీకు తెలుసుగా నాన్నా’. పిల్లల వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దటంలో ఆనాటి అమ్మలు తీసుకున్న శ్రద్ధ ఈ కథలో కనిపిస్తుంది.
ఫ్లోరోసిస్ రోగ బాధితుల కష్టాలు ‘గొంతు దాటని కేక’ కథలో విశదీకరించారు. రోగి కుటుంబ సభ్యులు అనుభవించే మానసిక వేదన ఇందులో జాలిగొలుపుతుంది. అయిదేళ్లకొకసారి వచ్చి ఓట్లేయించుకొని వెళ్లే రాజకీయ నాయకులకు, ఆ తర్వాత ప్రజలు గుర్తుండరని చెప్పటానికి, ఫ్లోరైడ్ నీళ్ల సమస్య ఒక గొప్ప ఉదాహరణ.
పిల్లలకు ఇష్టంలేని చదువుల్లో బలవంతంగా చేర్పించినప్పుడు కలిగే అనర్థాలను తెలియజెప్పే మంచి కథ ‘కిటికీ తెరిస్తే’. కార్పొరేట్ కాలేజిలు చేసే ప్రచారం మాయలోపడే తల్లితండ్రులకు ఈ కథ ఒక హెచ్చరిక లాంటిది.
లక్షలు ఖర్చుచేసి సంపాదించిన బి.టెక్ డిగ్రీలకు విలువలేకుండా పోయినప్పుడు కలిగే నిరాశనిస్పృహలను ప్రతిబింబించే మంచికథ ‘సహజాతాలు’. వాస్తవ పరిస్థితులను ఇందులో చక్కగా విశే్లషించారు. పెద్ద ఉద్యోగాలకోసం ఎదురుచూస్తూ కాలం వృధాచేయటంకన్నా, దొరికిన చిన్న ఉద్యోగాలలో చేరటం మంచిదనే సూచన ఇందులో ఉంది.
‘దృశ్యం అదృశ్యం’ కథలో రాగింగ్ భూతాన్ని ఎదుర్కోటానికి ఒక కొత్త రకం టెక్నిక్ ఉంది.
వైద్యవిధానాలలో తేడాలను ‘అది చూపు, ఇది నడక’ కథలో విశే్లషించారు. వేలం వెర్రిగా ఖరీదైన వైద్యంకోసం వెంపర్లాడ వలసిన అవసరం లేదని ఈ కథ సూచిస్తుంది.
ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగాఉన్న సంసారంలో ఉండే కష్టాలను వెల్లడించే మంచి కథ ‘చేదోడు’.
‘కొత్త దృశ్యం’ కథలో రచయిత తీసుకున్న ఇతివృత్తం బాగుంది గానీ రచన మాత్రం సహజత్వానికి మరీ దూరంగా ఉంది.మనస్తత్వ శాస్త్రానికి సంబంధించిన విశే్లషణ ‘బొరుసు’ కథలో ఆసక్తికరంగా ఉంది.

-ఎం.వెంకటేశ్వరశాస్ర్తీ