తెలంగాణ

రోహిత్ తల్లికి కన్నయ్య పరామర్శ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: హెచ్‌సియులో ఆత్మహత్య చేసుకున్న దళిత విద్యార్థి రోహిత్ తల్లి రాధికను జెఎన్‌యు (దిల్లీ) విద్యార్థి సంఘం నేత కన్నయ్య కుమార్ బుధవారం పరామర్శించారు. రోహిత్ ఆత్మహత్యకు దారితీసిన కారణాలను ఆయన తెలుసుకున్నారు. కాగా, కన్నయ్యను హెచ్‌సియులోకి అనుమతించేది లేదని క్యాంపస్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. కన్నయ్యకు వర్సిటీలో ప్రవేశం లేదని వైస్ చాన్సలర్ అప్పారావు అధికారికంగా ప్రకటించారు. హెచ్‌సియులో రోహిత్ సంస్మరణ సభ జరిగితే పరిస్థితి అదుపుతప్పే ప్రమాదం ఉందని పోలీసులు క్యాంపస్‌లోకి ఎవరినీ అనుమతించడం లేదు. విస్తృతంగా తనిఖీలు చేస్తూ ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరిస్తున్నారు.