క్రైమ్/లీగల్

కారు దగ్ధం.. తప్పిన పెనుప్రమాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్ష్మీదేవిపల్లి, ఏప్రిల్ 10: కొత్తగూడెం నుంచి భద్రాచలం వైపు వెళుతున్న టాటా ఇండికా కారులో అకస్మాత్తుగా మంటల చెలరేగి కారు దగ్ధమైన సంఘటన లక్ష్మీదేవిపల్లి మండల పరిధిలోని మొర్రేడు బ్రిడ్జిపైన మంగళవారం జరిగింది. ట్రాఫిక్ ఎస్సై అంజయ్య కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. భద్రాచలం వెళ్లేందుకు ఐదుగురు ప్రయాణికులు టాటా ఇండికా కారులో వెళుతుండగా షార్ట్ సర్క్యూట్, అధిక ఉష్ణోగ్రత కారణంగా ఒక్కసారిగా కారులో మంటల వ్యాపించాయి. పరిస్థితిని పసిగట్టిన కారు డ్రైవర్ చాకచక్యంగా కారును నిలిపివేయటంతో ప్రయాణికులు కారులో నుంచి బయటకు వచ్చారు. దీంతో పెనుప్రమాదం తప్పినట్లైంది. మొర్రేడు బ్రిడ్జిపై కారు కాలిపోతుండటంతో బ్రిడ్జికి ఇరువైపులా పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోవటంతో సుమార గంటకు పైగా ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. ట్రాఫిక్ ఎస్సై అంజయ్య సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ను క్రమబద్దీకరించారు.

వేటగాళ్లు అమర్చిన కరెంటు తీగలకు పశువుల కాపరి బలి
బూర్గంపహాడ్, ఏప్రిల్ 10: అడవి జంతువులను వేటాడేందుకు వేటగాళ్లు అమర్చిన విద్యుత్ తీగ తగిలి పశువుల కాపరి మృతి చెందిన ఘటన మండల పరిధిలోని ఇరివెండి అటవీ ప్రాంతంలో మంగళవారం చోటుచేసుకుంది. ఇరివెండి పంచాయతీ చింతకుంట గ్రామానికి చెందిన మడకం కన్నయ్య(26) మంగళవారం ఉదయం రోజు మాదిరిగానే పశువులను తోలుకొని అడవికి వెళ్లాడు. ఈ క్రమంలోనే అడవి జంతువుల కోసం వేటగాళ్లు అమర్చిన విద్యుత్ తీగ తగిలి కన్నయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. మధ్యాహ్నం గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు అటుగా వెళ్లటంతో విషయం బయట పడింది. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించటంతో పాల్వంచ సి ఐ రాఘవేందరావు, బూర్గంపహాడ్ ఎస్సై సంతోష్‌లు ఘటనా స్తలాన్ని సందర్శించి వివరాలు సేకరించి కేసు నమోదుచేసి దర్యాప్తు ప్రారంభించారు.