శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

కోడలిని హత్య చేసిన మామకు జీవిత ఖైదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు లీగల్, జూన్ 21: కోడలిని అతి దారుణంగా అత్యాచారం చేసి దారుణంగా హత్య చేసినట్లు నమోదైన కేసులో నిందితుడు మామ షేక్ కాలేషాపై ఆరోపణలు సాక్ష్యాధారాలతో రుజువైనందున అతనికి యావజ్జీవ కారాగార శిక్షతోపాటు 1500 రూపాయలు జరిమానా విధిస్తూ నెల్లూరు మొదటి అదనపు జిల్లాసెషన్స్ జడ్జి కె శ్యామలాదేవి మంగళవారం తీర్పు చెప్పారు. అలాగే అత్యాచారం చేసిన అభియోగంపై నిందితుడు కాలేషా(55)కు మరో ఏడేళ్ల శిక్ష విధించి రెండు శిక్షలు ఏకకాలంలో అనుభవించాలని న్యాయమూర్తి తన తీర్పులో పేర్కొన్నారు. భార్య షేక్ రసూలమ్మ (20)ను కట్నం కోసం వేధించారన్న అభియోగంపై రెండవ నిందితుడు భర్త రెహమాన్‌కు ఏడాది జైలుశిక్ష ఐదు వందల రూపాయల జరిమానా విధించారు. ఇదే కేసులో నిందితురాలైన అత్త కె ఖాదరిబిపై ఆరోపణలు రుజువు కానందున ఆమెపై కేసు కొట్టివేశారు. ఈ కేసు వివరాలిలా ఉన్నాయి. నెల్లూరు మైపాడ్ రోడ్డు రాజీవ్‌గాంధీ కాలనీకి చెందిన రెహమాన్‌తో రసూలమ్మకు వివాహం అయిన తరువాత నాలుగేళ్లు కాపురం చేశారు. వీరికి ఇద్దరు ఆడపిల్లలు కలిగారు. తరువాత భర్త రెహమాన్ చెడువ్యసనాలకు లోనై ఆమెను వేధించడం మొదలుపెట్టాడు. దీంతోపాటు మామ కాలేషా అత్త ఖాదర్‌బి కూడా అదనపు కట్నం 50వేల రూపాయలు తెమ్మని హతురాలిని వేధించసాగాడు. పైగా తన కోర్కె తీర్చమని మామ కాలేషా హతురాలి వెనుకపడి వేధించేవాడు. అందుకు ఆమె అంగీకరించకపోవడంతో మామ కాలేషా అవకాశం కోసం ఎదురు చూడసాగాడు. ఈనేపథ్యంలో కొందరు మధ్యవర్తుల సలహాతో రెహమాన్, షేక్ రసూలమ్మ అదే ప్రాంతంలో వేరే ఇంట్లో కాపురం పెట్టారు. ఈక్రమంలో 2012 ఆగస్టు 22వ తేదీ మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో కాలేషా, రెహమాన్ కలసి షేక్ రసూలమ్మ ఉన్న ఇంటికి భోజనానికి వెళ్లి తర్వాత పనిమీద ఇద్దరూ బయటకు వెళ్లిపోయారు. అదేరోజు మధ్యాహ్నం 2:30 గంటల సమయంలో నిందితుడు కాలేషా రసూలమ్మ ఉన్న ఇంటికి వచ్చి తన కోర్కె తీర్చమని కోడలిని బలాత్కరించబోయాడు. ఆమె అరవడంతో నోట్లో గుడ్డలు కుక్కి మంచం కోళ్లతో తలపై కొట్టాడు. దీంతో స్పృహతప్పిన ఆమెపై నిందితుడు కాలేషా కిరాతకంగా అత్యాచారం చేశాడు. తర్వాత రసూలమ్మ బతికి ఉంటే తనకు ఇబ్బంది కలుగుతుందన్న ఆలోచనతో ఒక చీరతో ఆమెను ఉరివేశాడు. తర్వాత ఆమె ఉరి వేసుకుని చనిపోయిందని కాలేషా అందరికి చెప్పాడు. ఈ సంఘటనపై అందిన ఫిర్యాదు మేరకు నెల్లూరు రెండో పట్టణ పోలీసులు సమగ్రంగా దర్యాప్తుచేసి నిందితుడు కాలేషాపై హత్య, అత్యాచారం అభియోగాలపై కేసు నమోదు చేశారు. రెండో నిందితుడు రెహమాన్, ఖాదర్‌బిలపై వరకట్న వేధింపుల కేసు నమోదు చేశారు. ఈమేరకు వారిపై చార్జ్‌షీట్ దాఖలు చేశారు. కేసు విచారణ అనంతరం న్యాయమూర్తి పైమేర తీర్పు చెప్పారు.

సర్వం సిద్ధం
శ్రీహరికోటలో రాకెట్ ప్రయోగ సందడి
అందరి చూపు షార్ వైపే
నిఘా నీడలో షార్
సూళ్లూరుపేట, జూన్ 21: శ్రీహరికోటలోని సతీష్ థావన్ అంతరిక్ష కేంద్రం షార్ నుండి బుధవారం ఉదయం 9:26 గంటలకు చేపట్టబోయే పిఎస్‌ఎల్‌వి-సి 34 రాకెట్ ప్రయోగానికి శాస్తవ్రేత్తలు సర్వం సిద్ధం చేశారు. ఒకేసారి 20 ఉపగ్రహాలను నింగిలోకి పంపేందుకు ఇస్రో శ్రీకారం చుట్టడంతో ప్రపంచ దేశాల చూపు షార్ వైపు మళ్లింది. ఈ ప్రయోగం విజయవంతమైతే అధిక ఉపగ్రహాలను పంపిన దేశంగా భారత్ రెండో స్థానంలో నిలవనుంది. పిఎస్‌ఎల్‌వి ప్రయోగాల్లో ఇది 36వ ప్రయోగం కాగా ఈ ఏడాది ఐదో ప్రయోగం కావడం విశేషం. ప్రయోగ నేపధ్యంలో ఇస్రోలోని అన్ని సెంటర్ల డైరెక్టర్లు, మన శాస్తవ్రేత్తలతో పాటు విదేశాలకు చెందిన శాస్తవ్రేత్తలు షార్‌కు చేరుకోవడంతో సందడి వాతావరణం నెలకొంది. ప్రయోగం దృష్ట్యా షార్‌లో భద్రతను కట్టుదిట్టం చేశారు. షార్ చుట్టుపక్కల ప్రాంతాల్లో సిఐఎస్‌ఎఫ్ బలగలాలు, సముద్ర మార్గాన కోస్టల్ గార్డ్సుచే జల్లెడపట్టి గాలిస్తున్నారు. షార్ మొదటి గేటు వద్ద ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనీఖీలు చేసి పంపుతున్నారు. సూళ్లూరుపేట - శ్రీహరికోట మార్గమధ్యలో అట్టకానితిప్ప వద్ద సిఐఎస్‌ఎఫ్ అవుట్ చెక్‌పోస్టు ఏర్పాటుచేసి వాహనాలను తనిఖీలు చేస్తున్నారు. బుధవారం 9:26 గంటలకు రాకెట్ నింగిలోకి ఎగరనుంది. షార్ నుండి ఈ ఏడాది ఐదో ప్రయోగం కావడంతో పాటు ఒకేసారి 20 ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టేందుకు ఇస్రో శ్రీకారం చుట్టడంతో విజయవంతం చేసేందుకు శాస్తవ్రేత్తలు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ రాకెట్ ద్వారా మన దేశానికి చెందిన మూడు ఉపగ్రహాలతో పాటు మరో 17 విదేశీ ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు. ఈ రాకెట్ ద్వారా పంపే ఉపగ్రహాల్లో మన దేశానికి చెందిన ప్రధాన ఉపగ్రహమైన కార్టోశాట్-2సి ద్వారా పట్టణ, గ్రామీణాభివృద్ధి, తీర ప్రాంత భూములు, తాగునీటికి పంపిణీకి సంబంధించి ఛాయాచిత్రాలు తీసి ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందిస్తోంది. తమిళనాడులోని సత్యభామ విశ్వవిద్యాలయం విద్యార్థులు రూపొందించిన 1.5 కిలోల బరువుగల సత్యభామ శాట్ ఉపగ్రహం ద్వారా గ్రీన్స్‌హౌస్ వాయువుల సమాచారాన్ని సేకరించేందుకు ఉపయోగపడనుంది. పూణే ఇంజినీరింగ్ విద్యార్థులు రూపొందించిన ఒక కిలో బరువుగల స్వయంశాట్ ద్వారా పాయింట్ టు పాయింట్ సమాచారాన్ని అందిస్తోంది. ఇండోనేషియాకు చెందిన 20 కిలోల బరువుగల లపాన్-3ఎ సహజ వనరుల గుర్తించడంతో పాటు వాతావరణ పరిశోధనకు ఎంతో ఉపయోగపడుతోంది. జర్మనీకి చెందిన 130 కిలోల బరువున్న బీరోస్ ఏరోస్పేస్ అంతరిక్షంలో ఏర్పడే అధిక ఉష్ణోగ్రతను అధ్యయనం చేయనుంది. కెనడాకు చెందిన రెండు ఉపగ్రహాల్లో 85 కిలోల బరువుగల ఎం 3 ఎం శాట్ ఆటోమ్యాటిక్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్‌పై సమాచారం చేరువేస్తోంది. 25.5 కిలోల బరువుగల జిహెచ్‌జి శాట్-డి ద్వారా వాతావరణంలోని మిథేన్ కార్బన్‌డైయాక్సైడ్ వాయువుల పై అధ్యయనం చేసేందుకు వీలుటుంది. అమెరికాకు చెందిన 110కిలోల బరువుగల స్కైశాట్-జన్ 2-1 ఉపగ్రహంతో మరో 4.7కిలోల బరువుగల మరో 12 డౌ శాటిలైట్ మొత్తం 13 ఉపగ్రహాలు. వీటి ద్వారా భూమి పై వాతావరణంలో కలిగే మార్పులను పరిశీలించి ఛాయా చిత్రాల ద్వారా సమాచారం అందించేందకు ఎంతో ఉపయోగపడతాయి. ఇస్రో ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఒకేసారి 20 ఉపగ్రహాలను పంపే భారీ ప్రయోగం చేపట్టేందుకు శ్రీకారం చుట్టింది. ఇప్పటి వరకు 10 ఉపగ్రహాలను మాత్రమే 2008లో చంద్రయాన్ ద్వారా పంపించి విజయం సాధించింది. ఇప్పటి వరకు అమెరికా మాత్రమే 29 ఉపగ్రహాలను పంపించి ఉంది. ఇది విజయవంతమైతే ఇస్రో ప్రపంచ దేశాల్లో అధిక ఉపగ్రహాలు పంపిన దేశంగా అమెరికా తరువాత స్థానంలో నిలవనుంది.
నాలుగు దశల్లో ప్రయోగం
పిఎస్ ఎల్‌వి-సి 34 రాకెట్ ప్రయోగం నాలుగు దశల్లో జరగనుంది. 320టన్నుల బరువు, 44.4మీటర్ల ఎత్తుగల గల పిఎస్‌ఎల్‌వి మొదటి దశలో రాకెట్‌ను వేగంగా నెట్టేందుకు ఆరు స్ట్ఫ్రాన్ మోటార్లు 138టన్నుల ఘన ఇంధనం కలిగి ఉంటుంది. రెండో దశలో 42టన్నుల ధ్రవ ఇంధనం, మూడో దశలో 7.6టన్నుల ఘన ఇంధనం, నాలుగో దశలో 2.5టన్నుల ధ్రవ ఇంధనం ఉంటుంది. రాకెట్ భూమి ఎగిరినంతరం తన నాలుగు దశలను ఒకదాని తరువాత ఒకటి పూర్తిచేసుకొని 26:30నిమిషాల్లో భూమికి 505కిలో మీటర్ల దూరంలో ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యలోకి పిఎస్‌ఎల్‌వి-సి 34 రాకెట్ చేర్చనుంది.