రాష్ట్రీయం

హోదా కోసం రాజీనామా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, అక్టోబర్ 25: రాష్ట్రానికి ప్రత్యేక హోదా ప్రకటించడానికి కేంద్ర ప్రభుత్వానికి వేసవి కాల సమావేశాలవరకూ గడువు ఇస్తున్నామని, ఆ తరువాత కూడా హోదా ఇస్తున్నట్లు ప్రకటన చేయకపోతే తమ పార్టీ పార్లమెంటుసభ్యులు రాజీనామా చేస్తారని వైకాపా అధినేత జగన్ హెచ్చరించారు. కర్నూలు నగరంలో మంగళవారం వైకాపా ఆధ్వర్యంలో యువభేరి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక హోదా, ఉద్యోగ కల్పన, నిరుద్యోగ భృతి, హామీల విస్మరణ వంటి అనేక అంశాలపై విద్యార్థులతో చర్చాగోష్టి నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ ప్రత్యేక హోదా రాష్ట్రానికి, ప్రధానంగా వెనుకబడిన జిల్లాలకు సంజీవని వంటిదని తెలిపారు. హోదా కారణంగా లభించే నిధులతో వెనుకబడిన ప్రాంతాలు శరవేగంగా అభివృద్ధి చెందుతాయన్నారు. హోదా సాధనలో కేంద్ర ప్రభుత్వంలో మిత్రపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీ విఫలమైందని జగన్ విమర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తనపై ఉన్న కేసుల కారణంగా కేంద్ర ప్రభుత్వానికి భయపడి హోదాపై ఒత్తిడి తీసుకురాలేదని ఆరోపించారు. రానున్న శీతాకాల, బడ్జెట్ సమావేశాల్లో తమ పార్టీ ఎంపిలు ప్రత్యేక హోదా కోసం పోరాడతారని, వేసవి కాలంలోగా హోదా ఇవ్వకపోతే వారంతా రాజీనామా చేస్తారని స్పష్టం చేశారు. పోరాటానికి విద్యార్థుల నుంచి అపూర్వ స్పందన లభిస్తోందని జగన్ అన్నారు. విద్యార్థులను తమ పార్టీకి దూరం చేయాలన్న ఉద్దేశంతో హోదా కోసం పోరాడితే పిడి కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారని మండిపడ్డారు. ఒక్క విద్యార్థిపై ప్రభుత్వం కేసు పెట్టినా, చేయి చేసుకున్నా రాష్ట్రం అల్లకల్లోలం అవుతుందని హెచ్చరించారు. రాష్ట్రంలో ఎన్నికలు ఏ క్షణాన వచ్చినా తెలుగుదేశం పార్టీని బంగాళాఖాతంలో కలపడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు.