కృష్ణ

ఐకమత్యంగా అభివృద్ధి సాధిద్దాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పామర్రు, డిసెంబర్ 12: అందరూ కలిసికట్టుగా కృషి చేస్తే అటు రాజధానిని, ఇటు గ్రామాలను అభివృద్ధి పర్చుకోవచ్చని ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి అన్నారు. స్మార్ట్ విలేజ్ కార్యక్రమాల్లో భాగంగా తాను దత్తత తీసుకున్న స్వర్గీయ ఎన్టీఆర్ సతీమణి బసవరామతారకం జన్మించిన పామర్రు మండలం కొమరవోలు గ్రామానికి ఆమె శనివారం విచ్చేశారు. ఈ సందర్భంగా గ్రామస్థులతో గ్రామ సమస్యలపై సమీక్ష నిర్వహించి మాట్లాడుతూ కుల, మత, రాజకీయాలకతీతంగా అందరూ కలిసి వస్తే గ్రామాలు అభివృద్ధి చెందుతాయన్నారు. తాను దత్తత తీసుకున్న తొమ్మిది నెలల కాలంలో కొమరవోలులో ఇప్పటికే ప్రతి గృహం, పాఠశాల, అంగన్‌వాడీ కేంద్రాలలో మరుగుదొడ్లు నిర్మించుకున్నారని, సంపూర్ణ పారిశుద్ధ్య గ్రామంగా ప్రకటించాలని కలెక్టర్‌కు వినతిపత్రం పంపుతున్నట్లు రాతపూర్వకంగా ఆమె వేదికపై నుంచి పత్రికా ప్రకటనను విడుదల చేశారు. 45 డ్వాక్రా గ్రూపుల్లో 478 మంది సభ్యులుండగా గ్యాస్ కనెక్షన్లు లేని వారందరికీ కనెక్షన్లు అందిస్తున్నానని నూతనంగా స్టౌ కనెక్షన్ పత్రాలు అందించారు. ఎన్టీఆర్ ట్రస్ట్ తరుపున 190 వీధి విద్యుత్ స్తంభాలను ఎల్‌ఇడి బల్బులు అందిస్తున్నట్లు ప్రకటించారు. ఎన్టీఆర్ గృహ నిర్మాణపు పథకం కింద 210 మంది పేదలకు పక్కా గృహాలు మంజూరు చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వ భూమిని కొనుగోలు చేసి అర్హులుగా గుర్తించిన 50 మందికి నివేశన స్థలాలు దశల వారీగా అందజేస్తామన్నారు. గ్రామాభివృద్ధికి కృషి చేస్తున్న ఈ గ్రామానికి చెందిన పామర్రు జెడ్పీటిసి పొట్లూరి శశి, టిడిపి జిల్లా అధికార ప్రతినిధి పొట్లూరి కృష్ణబాబును, వితరణతో ఆర్వో వాటర్ ప్లాంట్‌ను నిర్మించిన మోటూరి వెంకట దుర్గాప్రసాద్‌ను, సర్వమతాలకు, కులాలకు కలిపి సర్వమత శ్మశానానికి రూ. 5 లక్షల విరాళం ఇచ్చిన వాణిజ్య వేత్త కాట్రగడ్డ రమేష్‌ను భువనేశ్వరి ప్రత్యేకంగా సన్మానించి కొనియాడారు.
ఎంపి కొనకళ్ల నారాయణరావు మాట్లాడుతూ రాష్ట్రంలోనే ఆదర్శంగా నిర్మించతలపెట్టిన సర్వమత శ్మశానానికి ఎంపి లాడ్స్ నుంచి రూ. 10 లక్షలు ఇస్తానని ప్రకటిస్తూ జిల్లాలో ఏ గ్రామంలోనైనా సర్వమతాలకు కలిసి ఒకే శ్మశానం నిర్మిస్తే వారికి కూడా రూ. 10 లక్షలు చొప్పున ఎంపి లాడ్స్ కేటాయిస్తానన్నారు. మంత్రి దేవినేని ఉమమహేశ్వరరావు మాట్లాడుతూ కొమరవోలు గ్రామానికి చెందిన పంట కాలవల మరమ్మతులకు రూ. 30 లక్షలతో నీటిపారుదల శాఖ ప్రతిపాదనలు తయారు చేసినట్లు ఆయన ప్రకటించారు. కొమరవోలు గ్రామంలో రూ. 11.4 లక్షలతో నిర్మించిన సిమెంట్ రోడ్డును భువనేశ్వరి సమక్షంలో సర్పంచ్ పొట్లూరి కృష్ణకుమారి ప్రారంభించారు. ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పామర్రు నియోజకర్గ ఇన్‌చార్జి, రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ చైర్మన్ వర్ల రామయ్య అధ్యక్షతన భువనేశ్వరి ప్రారంభించారు. యార్డ్ చైర్మన్ మండపాక శంకరబాబు కొనుగోలు రేట్లు వివరించారు. జనచైతన్య యాత్రలో భాగంగా గ్రామంలో కృష్ణాజిల్లా టిడిపి అధ్యక్షులు బచ్చుల అర్జునుడితో పర్యటిస్తూ 10 మంది మహిళలను ప్రభుత్వ పథకాల అమలుపై పెన్షన్‌పై భువనేశ్వరి అడిగి తెలుసుకున్నారు. ఎన్టీఆర్ బసవరామ తారకం విగ్రహాలకు భువనేశ్వరి అంబేద్కర్ విగ్రహానికి టిడిపి జిల్లా ప్రెసిడెంట్ బచ్చుల అర్జునుడు, జగ్జీవన్‌రాం విగ్రహానికి ఎంపి కొనకళ్ల పూలమాలలు వేసి నివాళులర్పించారు.

చల్లారని విభేదాలు!
ఆంధ్రభూమి బ్యూరో
మచిలీపట్నం, డిసెంబర్ 12: మచిలీపట్నం పురపాలక సంఘం చైర్మన్, వైస్ చైర్మన్ మధ్య నెలకొన్న విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. చైర్మన్ మోటమర్రి బాబాప్రసాద్ పరిపాలనా తీరును తీవ్రంగా వ్యతిరేకిస్తున్న వైస్ చైర్మన్ పంచపర్వాల కాశీవిశ్వనాథం వర్గానికి చెందిన కొందరు కౌన్సిలర్లు రాజీనామాలకు సిద్ధపడిన సంగతి తెలిసిందే. శనివారం ఆయనతో పాటు మరో 10మంది వరకు టిడిపి కౌన్సిలర్లు రాజీనామా చేస్తారని పట్టణంలో పెద్దఎత్తున ప్రచారం జరిగింది. ఈనేపథ్యంలో ఉదయం 10గంటల సమయంలో రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర, టిడిపి రాష్ట్ర కార్యదర్శి కొనకళ్ళ జగన్నాథరావు పట్టణంలోని ఓ రహస్య ప్రాంతంలో వైస్ చైర్మన్ చంటి వర్గంతో చర్చలు జరిపారు. తెలుగుదేశం పార్టీకి చెందిన కౌన్సిలర్లందరి అభిప్రాయం తీసుకున్న తర్వాత ఒక నిర్ణయానికి వద్దామని మంత్రి రవీంద్ర సర్దిచెప్పినట్టు తెలిసింది. ఇదిలావుండగా చంటికి మద్దతుగా ఆయన సామాజిక వర్గానికి చెందిన కార్యకర్తలు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. రాజీనామాల విషయమై ఆదివారం ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

లోక్ అదాలత్ కేసుల పరిష్కారంలో ప్రథమ స్థానంలో జిల్లా
ఆంధ్రభూమి బ్యూరో
మచిలీపట్నం, డిసెంబర్ 12: రాష్టవ్య్రాప్తంగా శనివారం నిర్వహించిన జాతీయ మెగా లోక్ అదాలత్ ద్వారా కేసుల పరిష్కారంలో జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది. జిల్లావ్యాప్తంగా పలు న్యాయస్థానాల్లో నిర్వహించిన లోక్ అదాలత్‌లలో 3699 కేసులను రాజీ మార్గాన పరిష్కరించారు. ఇందులో 3,033 క్రిమినల్ కేసులు, 300 సివిల్ కేసులు, 108 ప్రీ లిటిగేషన్ కేసులు, మోటారు యాక్సిడెంట్‌లలో నష్టపరిహారం కోసం దాఖలైన 201 కేసులు ఉన్నాయి. మోటారు యాక్సిడెంట్ కేసులకు సంబంధించి రూ.3కోట్ల మేర కక్షిదారులకు నష్టపరిహారాన్ని అవార్డు రూపంలో అందజేశారు. జిల్లా కేంద్రం మచిలీపట్నంలోని జిల్లా న్యాయస్థానంలో నిర్వహించిన లోక్ అదాలత్‌ను జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి రవీంద్రబాబు జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో తరచూ నిర్వహిస్తున్న లోక్ అదాలత్ లు సత్ఫలితాలను ఇస్తున్నాయన్నారు. లోక్ అదాలత్‌లో కేసుల పరిష్కారానికి అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. అదాలత్‌ల ద్వారా ప్రీ లిటిగేషన్ కేసులను కూడా పరిష్కరించుకోడానికి కక్షిదారులు చొరవ చూకటం హర్షణీయమన్నారు. కక్షిదారులకు సత్వర న్యాయం అందటంతోపాటు లోక్ అదాలత్‌ల పట్ల నమ్మకాన్ని మరింత పెంచుతుందన్నారు. ఒక మోటారు యాక్సిడెంట్ కేసుకు సంబంధించి న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ వారు రూ.18ల క్షలు నష్టపరిహారాన్ని కక్షిదారునికి అందజేశారు. పదవ అదనపు జిల్లా జడ్జి స్వర్ణలత, సీనియర్స్ సివిల్ జడ్జి శ్రీనివాస శర్మ, బార్ అసోసియేషన్ అధ్యక్షులు తాతా దుర్గాప్రసాద్, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి చిన్నంశెట్టి రాజు పాల్గొన్నారు.

ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తి మృతి
గుడ్లవల్లేరు, డిసెంబర్ 12: ఆర్టీసీ బస్సు ఢీకొని ఒక వ్యక్తి మృతి చెందిన సంఘటన శనివారం మండల పరిధిలోని వేమవరంలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం గ్రామానికి చెందిన మనె్నం వెంకటేశ్వరరావు(53) తన ఇంటి పక్కనున్న శివయ్య అనే వ్యక్తి మృతి చెందటంతో అతని కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు వెళుతుండగా వెనుక నుండి వచ్చిన ఆర్టీసీ బస్సు ఢీకొంది. దీంతో వెంకటేశ్వరరావు అక్కడిక్కడే మృతి చెందాడు. ఎఎస్‌ఐ సుబ్బారావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వెంకటేశ్వరరావు మృతితో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. మృతునికి భార్య, ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. వడ్లమన్నాడు పిఎసిఎస్ డైరెక్టర్ పామర్తి కొండబాబు, గ్రామ టిడిపి నాయకుడు మనె్నం నరసింహరావు ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు.

అనుమానాస్పద స్థితిలో విద్యార్థిని మృతి
తోట్లవల్లూరు, డిసెంబర్ 12: తోట్లవల్లూరులో ఒక విద్యార్థిని పురుగు మందు తాగి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. పోలీసుల కథనం ప్రకారం.. పోస్ట్ఫాస్ వీధికి చెందిన కిలారపు ఉషాలక్ష్మి(19) ఉయ్యూరులోని ఒక వ్రైవేటు కాలేజీలో బి.కాం ద్వితీయ సంవత్సరం చదువుతోంది. ఈ నెల 10న కాలేజీకి వెళ్లి సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చి కొద్దిసేపటికి గ్రామోక్సిన్ పురుగుల మందు తాగింది. వెంటనే కుటుంబ సభ్యులు ఉయ్యూరు ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం చినఅవుటపల్లి వైద్యశాలకు తీసుకెళ్లగా చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతి చెందింది. కడుపునొప్పి భరించలేక తమ కుమార్తె పురుగుల మందు తాగిందని తల్లి రమాదేవి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అనుమానాస్పద మృతి కింద హెడ్ కానిస్టేబుల్ జ్ఞాన్‌స్సన్ కేసు నమోదు చేసి దర్యాపు చేస్తున్నారు. పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులు ఉషాలక్ష్మి మృతదేహాన్ని శనివారం తీసుకొచ్చి అంత్యక్రియలు నిర్వహించారు.

రుణదాతల ఒత్తిడి భరించలేక
ఆటోడ్రైవర్ ఆత్మహత్య
చాట్రాయి, డిసెంబర్ 12: తీసుకున్న అప్పును పదిమందిలో అడిగి తనను చులకన చేశారన్న బాధతో ఒక యువకుడు మృతి చెందిన సంఘటన శుక్రవారం రాత్రి మండలంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం విస్సన్నపేట మండలానికి చెందిన షేక్ సర్దార్ (19) అనే యువకుడు కొంతకాలంగా చాట్రాయి, విస్సన్నపేట మండలాల్లో కిరణాషాపుల్లో ఉదయం పూట ధూపం వేసేవాడు. ఆ తరువాత ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. కొద్ది రోజుల క్రితం చాట్రాయిలోని అటో మొబైల్స్ యజమాని మందపాటి విద్యాధరరెడ్డి వద్ద ఆటో టైరు, ఆటోకు సంబంధించిన కొన్ని వస్తువులు అప్పుగా తీసుకున్నాడు. షాపు ఎదురుగా ఉన్న చెప్పుల షాపు యజమానైన ఎస్ దుర్గారావు వద్ద 2 వేల రూపాయలు అప్పుగా తీసుకున్నాడు. రెండు నెలలు గడిచిన అప్పు తిరిగి ఇవ్వకపోవడంతో శుక్రవారం రాత్రి ఆటో వేసుకువస్తున్న సర్దార్‌ను ఆపి తమ అప్పు చెల్లించాలని ఇరువురు నిలదీశారు. వారి మధ్య వాగ్వివాదం జరిగిన తరువాత తన బాబాయి అయినా చాంద్‌బాషా వచ్చి వారి అప్పు చెల్లిస్తానని చెప్పడంతో అతన్ని వారు వదిలివేశారు. పదిమందిలో అప్పు తీర్చమని అడిగి తనను అవమానించారని మనస్థాపం చెందిన సర్దార్ పక్కనే ఉన్న ఎరువుల దుకాణంలో పురుగుల మందు కొని బయటకు వెళ్ళి తాగి చాట్రాయి సెంటరుకు వచ్చాడు. ఆతని బాబాయి చాంద్‌బాషా వచ్చే సమయానికి సర్దార్ పరిస్థితి విషమంగా ఉండటంతో నూజివీడు ఏరియా ఆసుపత్రికి తరలిస్తుండగానే మార్గమధ్యలోనే మృతి చెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ పరమేశ్వర్ తెలిపారు.