కృష్ణ

రూ.3 లక్షలకే డబుల్ బెడ్‌రూమ్ ఫ్లాట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: పేదలకు, సామాన్యులకు ప్రభుత్వంతో కలిసి నామమాత్రపు ఖర్చులతో టూ బెడ్ రూమ్ అపార్ట్‌మెంట్లు కట్టించి నవ్యాంధ్ర ప్రజలకు అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని అప్రెడా (ఆంధ్రప్రదేశ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్) ప్రతినిధులు ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. సోమవారం రాత్రి నగరంలోని సిఎం క్యాంప్ కార్యాలయంలో రియల్ ఎస్టేట్ సంస్థల నిర్వాహకులతో సమావేశం జరిగిందని అప్రెడా రాష్ట్ర అధ్యక్షుడు హరిబాబు తెలిపారు. ఈ సందర్భంగా నవ్యాంధ్రలోని 13 జిల్లాల్లో అతి తక్కువ ధరకు డబుల్ బెడ్‌రూమ్ ఫ్లాట్లు నిర్మించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని వివరించినట్లు తెలిపారు. అతి తక్కువ వ్యయంతో నాణ్యతా ప్రమాణాలతో అత్యంత అధునికంగా ఫ్లాట్లు తీర్చిదిద్దనున్నట్లు పేర్కొన్నారు. అప్రెడా రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో ఈ ప్రాజెక్టును నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని, మొత్తం లక్ష అపార్టుమెంట్లు కట్టించి ఇచ్చేందుకు తాము కృత నిశ్చయంతో ఉన్నట్లు సిఎంకి తెలిపామన్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు డబుల్ బెడ్‌రూమ్ ఫ్లాట్లు ఇచ్చేందుకు ముందుకు వచ్చిందని, ఇందులో భాగంగానే ముఖ్యమంత్రి వివిధ రియల్ ఎస్టేట్ సంస్థల నిర్వాహకులతో సమావేశం ఏర్పాటు చేశారని తెలిపారు. ఈ క్రమంలోనే తాము 13 వేల కోట్ల రూపాయలతో 500 చదరపు అడుగుల విస్తీర్ణంలో కేవలం 3 లక్షలకు డబుల్ బెడ్‌రూమ్ ఫ్లాట్ నిర్మించేందుకు సిద్ధంగా ఉన్నామని సిఎంకి తెలిపామన్నారు. ఉచిత ఇసుక విషయంలో సిఎం విధి విధానాల గురించి చర్చించారని, తమకు తెలిసిన సూచనలు, సలహాలు ఇచ్చామన్నారు. ఇసుక మాఫియా రాకుండా చూడాలని సిఎంకు తెలియజేసినట్లు అప్రెడా ప్రతినిధులు తెలిపారు. అనంతరం చంద్రబాబునాయుడు మాట్లాడుతూ దీనిపై సబ్ కమిటీలో చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటామని తెలిపారన్నారు. ఈ సమావేశంలో అప్రెడా ఆంధ్రప్రదేశ్ వైస్ ప్రెసిడెంట్ చావా రమేష్‌బాబు, విశాఖ, గుంటూరు, నార్త్ ఆంధ్ర అధ్యక్షులు, విశాఖపట్నం బిల్డర్స్ అసోసియేషన్ తాళ్లూరి శివాజీ, అప్రెడా విజయవాడ నగర శాఖ అధ్యక్షులు జిఎస్‌ఎస్ ప్రసాద్ పాల్గొన్నారు.

గృహిణిపై భర్త హత్యాయత్నం
* కత్తితో నరకటంతో తీవ్ర గాయాలు
* చావుబతుకుల మధ్య బందరు తరలింపు
నాగాయలంక, మార్చి 1: కడవరకు తోడుగా ఉండాల్సిన భర్తే తన భార్యపై హత్యాయత్నానికి పాల్పడ్డాడు. మండల పరిధిలోని కమ్మనమోలు గ్రామంలో మంగళవారం ఈ ఘటన జరిగింది. భర్త చేతిలో కత్తిపోట్లకు గురైన ఆ గృహిణి ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతోంది. పోలీసుల కథనం ప్రకారం.. కమ్మనమోలు గ్రామానికి చెందిన లక్ష్మీనాంచారమ్మకు, పర్రచివరకు చెందిన ఆరెవరపు శ్రీనుకు 2012లో వివాహం జరిగింది. వీరి దాంపత్యం అన్యోన్యంగా సాగుతుండగా రెండేళ్ల క్రితం మగపిల్లాడు పుట్టాడు. గత ఏడాది డిసెంబరులో లక్ష్మీనాంచారమ్మ రెండో కాన్పులో మరో మగబిడ్డకు జన్మనిచ్చింది. పురుడు పోసుకునేందుకు కమ్మనమోలులో పుట్టింటికి వచ్చిన లక్ష్మీనాంచారమ్మను తనతో పంపాలంటూ శ్రీను గత సోమవారం అత్త కూరాకు సోవమ్మను కోరాడు. తన బిడ్డను 5వ నెలలో పంపిస్తానని ఆమె చెప్పింది. దీంతో ఆగ్రహించిన శ్రీను మంగళవారం మధ్యాహ్నం మోటారు బైక్‌పై వచ్చి మంచంపై నిద్రిస్తున్న లక్ష్మీనాంచారమ్మను కత్తితో తీవ్రంగా గాయపర్చాడని సోవమ్మ స్థానిక పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. తన అల్లుడు వచ్చీరాగానే నీకున్న ఎకరం భూమిలో కుంట భూమిని తక్షణమే అమ్మి తనకు డబ్బు ఇవ్వాంటూ ఒత్తిడి చేశాడని, తాను మరో కూతురి వివాహం చేయాల్సి ఉన్నందున అది సాధ్యం కాదని చెప్పటంతో ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని సోవమ్మ పేర్కొంది. తన కుమార్తె వివాహ సమయంలో పసుపు, కుంకుమల కింద ఎకరంన్నర భూమి ఇచ్చామని, అయినా తన కుమార్తె ఆడబిడ్డలైన పున్నమ్మ, కృష్ణకుమారి, రాఘవమ్మ ఒత్తిడి మేరకు శ్రీను తరచూ అదనంగా భూమిని ఇవ్వాలని కోరుతున్నట్లు తెలిపింది. లక్ష్మీనాంచారమ్మను బాలింత అని కూడా చూడకుండా గోతాములో చుట్టి తెచ్చిన కత్తితో నరికి పరారయ్యాడని, రక్తపు మడుగులో పడి ఉన్న తన బిడ్డను గ్రామస్తుల సహాయంతో నాగాయలంక తీసుకొచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశానని తెలిపింది. అనంతరం వైద్యచికిత్స కోసం అవనిగడ్డలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తీసుకెళుతున్నామని సోవమ్మ విలేఖర్లకు వివరించింది. ఈ కేసు విషయమై నాగాయలంక ఎస్‌ఐ గుడివాడ అనిల్‌ను వివరణ కోరగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న లక్ష్మీనాంచారమ్మ వాంగ్మూలం తీసుకున్న తరువాత విచారణ చేపడతామని చెప్పారు. లక్ష్మీనాంచారమ్మను తొలుత అవనిగడ్డ ఏరియా ఆసుపత్రిలో చికిత్స జరిపిన్పటికీ అక్కడి వైద్యుల సూచనల మేరకు జిల్లా కేంద్రం మచిలీపట్నం ప్రభుత్వ వైద్యశాలకు తరలించినట్లు అవనిగడ్డ సిఐ పి చంద్రశేఖర్ చెప్పారు. శ్రీనుపై 307 సెక్షన్ కింద కేసు నమోదు చేశామని, విచారణ జరుపుతున్నామని వివరించారు.