కృష్ణ

ఈ-పోస్ ద్వారా ఎరువుల పంపిణీ * కలెక్టర్ బాబు .ఎ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కార్పొరేషన్), మార్చి 4: సాగుచేసే ఎరువుల వినియోగం దుర్వినియోగం కాకుండా వాటి వినియోగాన్ని మరింత క్రమబద్దీకరించే క్రమంలో ఎలక్ట్రానిక్ పాయింట్ ఆఫ్ సేల్ (ఇ-పోస్) విధానంతో ఎరువుల విక్రయాలు జరుగుతాయని, కొనుగోలు చేసే వారి వివరాలను సమగ్రంగా పర్యవేక్షించేందుకు గాను ఇ-పోస్ పద్దతిని ప్రవేశపెడుతున్నట్టు జిల్లా కలెక్టర్ బాబు.ఎ పేర్కొన్నారు. ఈసందర్భంగా పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక కాబడిన 20 ఎరువుల దుకాణాల నిర్వహుకులకు శుక్రవారం మండల వ్యవసాయ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైతులు, ఎరువుల వినియోగ క్రమంలో సాగుచేసే పంట, ప్రాంతానికి ఏఏ ఎరువులు ఎంత మొత్తంలో వినియోగించాలో సరైన అవగాహన లేకపోవడంతో ఎరువుల దుర్వినియోగం ఎక్కువగా ఉంటోందన్నారు. అందువలన ప్రస్తుతం ప్రవేశపెట్టిన ఇ-పోస్ విధానంతో రైతులు వారు పండించే పంట, అక్కడి భూసార పరీక్షల వివరాలు ఇ-పోస్‌లో పొందుపర్చి అందుకనుగుణంగా ఎరువుల వినియోగానికి సూచనలివ్వడం జరుగుతుందన్నారు. ఎరువుల కోసం వచ్చే రైతులు వారి సర్వే నెంబర్, గ్రామం తదితర వివరాలను అందించి ఎరువును తీసుకెళ్లవచ్చన్నారు. జిల్లాలో సగటున సాగుచేసే రైతు 2ఎకలాల వరకూ పంటను పండించడం జరుగుతుందని, 21 రకాల ఉత్పత్తులకు చెందిన అమ్మకాలు చేస్తున్నామని కలెక్టర్ తెలిపారు. అలాగే సాగు చేసే రైతులు ఎరువు కోసం తమ ఆధార్ కార్డు నెంబర్, వివరాలను అందించాలన్నారు. దీని వలన దళారీ వ్యవస్థకు చెక్ పెట్టవచ్చన్నారు. తొలిదశలో మచిలీపట్నం, బంటుమిల్లి, కోడూరు, మొవ్వ, గుడివాడ, గుడ్లవల్లేరు, ముదినేపల్లి, కైకలూరు, కంకిపాడు, తోట్లవల్లూరు, జి కొండూరు, జగ్గయ్యపేట, నూజివీడు, బాపులపాడు గన్నవరం, ఉయ్యూరు, విసన్నపేట, తిరువూరు, గంపలగూడెం, పరిధిలోని 20 దుకాణాల్లోను, ప్రాథమిక వ్యవసాయ కేంద్రాల్లో పైలెట్ ప్రాజెక్టుగా ఇ-పోస్‌ను అమలు చేస్తున్నామన్నారు. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ఇ-పోస్ పైలెట్ ప్రాజెక్టును సమర్థవంతగా నిర్వహించాలని కోరారు. ఈ సమావేశంలో జెడిఎ ఎన్ బాలునాయక్, ఎన్‌ఐసి అధికారి పిజిబి శర్మ, విజన్‌టెక్ ప్రతినిధులు హేమంత్, శ్రీనివాస్, తారప్ప తదితరులు పాల్గొన్నారు.