కృష్ణ

పంచాయతీల అభివృద్ధికి నిర్దిష్ట ప్రణాళికలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం: గ్రామ పంచాయతీల అభివృద్ధికి నిర్దిష్టమైన ప్రణాళికలు రూపొందించాలని జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి వి నాగార్జునసాగర్ తెలిపారు. 2016-17 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి గ్రామ పంచాయతీల యాక్షన్ ప్లాన్ తయారీపై శనివారం స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో బందరు డివిజన్‌లోని అధికారులకు ఒకరోజు శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ పంచాయతీల అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అధిక ప్రాధాన్యత ఇస్తున్నాయన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని యాక్షన్ ప్లాన్ తయారుచేయాల్సిన అవసరం ఉందన్నారు. గ్రామ పంచాయతీ కార్యదర్శులపై పనిభారం ఎక్కువగా ఉన్నప్పటికీ కచ్చితమైన యాక్షన్ ప్లాన్ తయారుచేసి పంచాయతీల ఆర్థిక పరిపుష్టికి కృషి చేయాలని సూచించారు. ప్రభుత్వ మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలన్నారు. గ్రామ పంచాయతీ స్థాయిలో ప్రణాళిక తయారీ బృందాన్ని ఏర్పాటు చేయాలన్నారు. గ్రామ పంచాయతీ వికేంద్రీకృత ప్రణాళిక తయారీలో ప్రజలను భాగస్వాములను చేయాలని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో డెప్యూటీ సిఇఓ ఎ నాగమహేశ్వరరావు, బందరు డివిజనల్ పంచాయతీ అధికారి సత్యనారాయణ పాల్గొనగా బాపట్లలో శిక్షణ పొందిన మోపిదేవి, మొవ్వ ఇఓపిఆర్‌డిలు దిలీప్, శర్మ రిసోర్స్ పర్సన్స్‌గా వ్యవహరించారు. శిక్షణ తరగతుల్లో మండల పరిషత్ అధ్యక్షులు, ఎంపిడివోలు, ఇఓపిఆర్‌డిలు, ఎన్‌ఆర్‌జిఎస్ ఎపిఓలు, పంచాయతీరాజ్ ఎఇలు, ఐసిడిఎస్ సూపర్‌వైజర్లు పాల్గొన్నారు.

దక్షిణ కాశీ పెదకళ్లేపల్లిలో
లక్ష మంది భక్తులకు ఏర్పాట్లు
మోపిదేవి, మార్చి 5: కృష్ణానది ఉత్తరవాహినిగా ప్రవహించటంతో దక్షిణ కాశీగా పేరొందిన పెదకళ్ళేపల్లిలో మహాశివరాత్రికి లక్ష మందికి పైగా భక్తులు వస్తారనే అంచనాతో చల్లపల్లి ఎస్టేట్ దేవాలయాల అధికారులు శ్రీ దుర్గా నాగేశ్వర స్వామివారి ఆలయం వద్ద, కృష్ణానది ఒడ్డున ఏర్పాట్లు చేస్తున్నారు. ఆలయం లోపల, వెలుపల ప్రత్యేక షామియానాలు ఏర్పాటు చేసి బారికేడ్లు నిర్మిస్తున్నారు. కృష్ణానది ఒడ్డున రెండు ఘాట్లు ఏర్పాటు చేసి బారికేడ్లు కడుతున్నారు. ఎస్టేట్ దేవాలయాల ఏసి ఎం శారదాకుమారి శనివారం ఏర్పాట్లను పరిశీలించారు. ఆమె వెంట సూపరింటెండెంట్ టి చన్నకేశవ, విఆర్‌ఓ అర్జా వెంకటేశ్వరరావు, గ్రామస్తులు పాల్గొన్నారు.
శివరాత్రికి జల్లుస్నానాలే శరణ్యం!
తోట్లవల్లూరు, మార్చి 5: దక్షిణ కాశీగా పేరొందిన తోట్లవల్లూరు మండలంలోని ఐలూరు ఘాట్లలో నీరులేని పరిస్థితి నెలకొంది. భక్తుల స్నానాలకు రెండు ఘాట్లను గతంలో నిర్మించగా ఇపుడు అలంకారప్రాయంగా మారాయి. దీంతో 7న మహా శివరాత్రికి వచ్చే భక్తులు స్నానాలు చేసేందుకు కృష్ణా నదీపాయలో ఐదు బోర్లను ఏర్పాటు చేస్తున్నారు. శనివారానికి ఐదు బోర్ల ఏర్పాటు పూర్తికాగా కూలీలు ప్లాస్టిక్ పైపులు వేసే పనిలో నిమగ్నమయ్యారు. గత కొన్ని సంవత్సరాల నుంచి జల్లుస్నానాలు చేస్తున్నప్పటికీ నదీపాయలో ఎక్కడో ఒకచోట పారుతుండే స్వచ్చమైన నీరు ఉండేది. నడవలేని భక్తులు జల్లుస్నానాలు చేసేవారు. ఓపిక ఉన్నవారు నదీపాయలో ప్రవహించే నీటిలో స్నానాలు చేసేవారు. బోయలదిబ్బ అవతల, ఐలూరు-ఐనపూరు మధ్య కొద్దిగా నీరుంది. ఇదికూడా ప్రవాహం లేనిదే. దీపాయలో మంచినీటి కోసం కూడా అధికారులు ఐదు చేతిపంపులు ఏర్పాటు చేస్తున్నారు. 7న ఆర్టీసీ అధికారులు ప్రత్యేక సర్వీసులు నడుపనున్నారు.