కృష్ణ

సోనియా, రాహుల్‌పై ఎన్డీఎ కక్షసాధింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం (కోనేరుసెంటర్), డిసెంబర్ 19: ఎఐసిసి అధినేత్రి సోనియా గాంధి, ఉపాధ్యక్షులు రాహుల్ గాంధిలపై ఎన్డీఎ ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు అబ్దుల్ మతీన్ ధ్వజమెత్తారు. ఇందుకు నిరసనగా శనివారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా మతీన్ మాట్లాడుతూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ చీఫ్ కట్టూ సోనియా గాంధి, రాహుల్‌లకు క్లీన్‌చిట్ ఇచ్చినా బిజెపి తన నేత సుబ్రహ్మణ్యం స్వామిని పావుగా వాడుకుని సోనియా, రాహుల్‌లను కేసులో ఇరికించారన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు యండి దాదా సాహెబ్, షేక్ రబ్బాని, ఎం దత్తుడు, జోగి అంజయ్య, కె రాజా, కె వెంకటేశ్వరరావు, గౌస్ షరీఫ్, ఎస్‌కె ఖాదర్ తదితరులు పాల్గొన్నారు.
తహశీల్దార్ కార్యాలయం ఎదుట ఎంఆర్‌పిఎస్ ధర్నా
మచిలీపట్నం (కోనేరుసెంటర్), డిసెంబర్ 19: ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లును ప్రవేశ పెట్టాలని డిమాండ్ చేస్తూ ఎంఆర్‌పిఎస్ బందరు శాఖ ఆధ్వర్యంలో శనివారం స్థానిక తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. మాదిగ, మాదిగ ఉప కులాలకు న్యాయబద్ధంగా ఎస్‌సి వర్గీకరణ జరపాలని గత 21 సంవత్సరాలుగా ఎంఆర్‌పిఎస్ పోరాడుతున్నా ప్రభుత్వాలు ఏ మాత్రం పట్టించుకోకపోవడం లేదని ఎంఆర్‌పిఎస్ నాయకులు ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్‌పిఎస్ నాయకులు మరియ కుమార్, సిహెచ్ రాజు, బి రవి, రవీంద్ర, కె ఆంజనేయులు, కె బసవేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
ఉత్తరప్రదేశ్ జట్టుపై విజయం సాధించిన దివిసీమ జట్టు
అవనిగడ్డ, డిసెంబర్ 19: స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల క్రీడా మైదానంలో అఖిల భారత స్థాయిలో నిర్వహిస్తున్న క్రికెట్ పోటీల్లో శనివారం దివిసీమ, ఉత్తరప్రదేశ్ జట్ల మధ్య పోటీ జరిగింది. ఆరు ఓవర్ల తేడాతో దివిసీమ జట్టు 112 పరుగులతో విజయం సాధించింది. ఉత్తర ప్రదేశ్ జట్టు 85 పరుగులకే అలౌట్ అయ్యింది. అలాగే దివిసీమ, తెలంగాణ జట్ల మధ్య ఆసక్తికరంగా జరిగిన పోటీలో తెలంగాణ జట్టు విజయం సాధించింది. ఈ కార్యక్రమంలో డియస్‌పి ఖాదర్ బాషా, గ్రామీణ యువజన వికాస సమితి చైర్మన్ మండలి రాజా, జడ్‌పిటిసి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
32 అడుగుల ఎత్తులో క్రిస్మస్ స్టార్
బంటుమిల్లి, డిసెంబర్ 19: క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని బంటుమిల్లి సిఎస్‌ఐ చర్చి ఆధ్వర్యంలో అంబేద్కర్ సెంటరులో క్రీస్తు పుట్టుకకు చిహ్నమైన నక్షత్రాన్ని 32 అడుగుల ఎత్తులో ఏర్పాటు చేశారు. రెవ. ప్రభాకరరావు ఈ నక్షత్రాన్ని శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రైస్తవులు క్యాండిల్స్‌తో అంబేద్కర్ సెంటరులో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.
నేడు గుర్వాయిపాలెం ఎత్తిపోతల పథకం ప్రారంభం
కలిదిండి, డిసెంబర్ 19: మండల పరిధిలోని గుర్వాయిపాలెం ఉప్పుటేరు వద్ద కోటి రూపాయలతో ఏర్పాటు చేసిన ఎత్తిపోతల పథకాన్ని ఆదివారం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డా. కామినేని శ్రీనివాసరావు, భారీ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రారంభించనున్నారు. ఈ ఎత్తిపోతల పథకం ద్వారా 25వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు సరఫరా కానుంది. కృష్ణా డెల్టా శివారు భూములు కావటంతో సాగునీరు అందక వ్యవసాయ భూములు బీడు పడుతున్నాయి. దీంతో రైతులు ఐక్యంగా ఎత్తిపోతల పథకాన్ని ఏర్పాటు చేయాలని మంత్రి కామినేని శ్రీనివాస్, ఏలూరు ఎంపి మాగంటి వెంకటేశ్వరరావులపై వత్తిడి తెచ్చారు. దీనిపై స్పందించిన వారు యుద్ధ ప్రాతిపదికన ఎత్తిపోతల పథకం నిర్మాణాన్ని ప్రారంభించి అతి తక్కువ సమయంలో నిర్మాణ పనులను పూర్తి చేశారు. మాజీ ఎమ్మెల్యే జయమంగళ వెంకట రమణ రూ.5లక్షలు విలువ చేసే పంపు సెట్‌ను ఈ ఎత్తిపోతల పథకానికి అందించారు. ప్రస్తుతం నాలుగు పంపు సెట్లు ప్రారంభానికి సిద్ధంగా ఉండగా మరో ఆరు పంపు సెట్లు ఏర్పాటు చేస్తున్నారు. లంక గ్రామాల భూములకు ఈ ఎత్తిపోతల పథకం వరంగా మారనుంది.
రోడ్డు ప్రమాదంలో
ఇద్దరికి గాయాలు
కృత్తివెన్ను, డిసెంబర్ 19: ద్విచక్ర వాహనాన్ని మినీ వ్యాన్ ఢీకొనటంతో ఇరువురు తీవ్రంగా గాయపడిన సంఘటన లక్ష్మీపురం పల్లిపాలెం వంతెన సమీపంలో శనివారం చోటు చేసుకుంది. సేకరించిన వివరాల ప్రకారం మాట్లం గ్రామానికి చెందిన బొమ్మిడి ధర్మరాజు, లక్ష్మీపురంకు చెందిన పులగం రాధాకృష్ణ ద్విచక్ర వాహనంపై లోసరి వెళుతుండగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నుండి రేపల్లె వెళుతున్న మినీ వ్యాన్ ఎదురుగా వచ్చి ఢీకొంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ క్షతగాత్రులను భీమవరంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం కాకినాడ ఆస్పత్రికి తరలించారు. దీనిపై ఎస్‌ఐ లోవరాజును వివరణ కోరగా ప్రమాదంపై ఫిర్యాదు అందలేదన్నారు.
అప్పు తీర్చమన్నందుకు కర్రతో దాడి
తోట్లవల్లూరు, డిసెంబర్ 19: ఇచ్చిన అప్పుని తీర్చమని అడిగితే ఎడ్లబండి చిడతతో కొట్టి గాయపరిచాడని చాగంటిపాడుకు చెందిన వీరంకి చంద్రశేఖర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. హెడ్‌కానిస్టేబుల్ జ్వానేష్ తెలిపిన వివరాలు ప్రకారం కె చంద్రశేఖరరెడ్డి అనేవ్యక్తికి వీరంకి చంద్రశేఖర్ రూ.600 అప్పుగా ఇచ్చాడని, శుక్రవారం రాత్రి బాకి చెల్లించమని అడిగితే గొడవకుదిగి ఎడ్లబండి చిడతతో కొట్టాడని తెలిపారు. ఉయ్యూరు ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు