కృష్ణ

గుణదలలో పాస్కా వేడుకలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పటమట, మార్చి 27: గుణదలమాత పుణ్యక్షేత్రంలో ఆదివారం తెల్లవారుజామున ఈస్టర్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఎస్‌ఎస్‌సి సెంటర్ డైరెక్టర్ ఫాదర్ మువ్వల ప్రసాద్ పాస్కా కొవ్వొత్తిని వెలిగించి వేడుకలను ప్రారంభించారు. అనంతరం మేరిమాత పుణ్యక్షేత్ర ప్రాంగణంలో ప్రత్యేకంగా అలంకరించిన పూజాపీఠంపై ఫాదర్ మువ్వలప్రసాద్, పుణ్యక్షేత్రం సహాయ గురువులు కె.ప్రశాంత్, కె. శేఖర్‌లు పాస్కా దివ్యపూజాబలి సమర్పించారు. ఫాదర్ మువ్వలప్రసాద్ భక్తులకు ఈస్టర్ సందేశమిచ్చారు. అనంతరం కతోలిక భక్తులకు ఫాదర్లు దివ్యసత్ప్రసాదం అందజేశారు. ఈస్టర్ వేడుకల్లో పాలుపంచుకోవటానికి పలు ప్రాంతాల నుండి భక్తులు తరలిరావటంతో పుణ్యక్షేత్రం ప్రాంగణం భక్తులతో నిండిపోయింది. పూజానంతరం భక్తులకు గురువులు పాస్కా శుభాకాంక్షలు తెలిపారు.