కృష్ణ

నున్న మార్కెట్ నుంచి రూ.45.43కోట్ల మామిడి ఎగుమతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ రూరల్, మే 29: ఆసియాఖండంలోకెల్లా అతి పెద్ద మామిడి మార్కెట్‌గా పేరొందిన నున్న మామిడి మార్కెట్ నుంచి రూ.45కోట్ల 43లక్షల రూపాయల విలువైన మామిడి కాయలు ఎగుమతులు పొరుగు రాష్ట్రాలకు జరిగాయి. గత సీజన్‌తో పోల్చితే సగానికి సగం పైగా ఎగమతులు తగ్గాయి. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవటంతో పూత, పిందె దశల్లో తెగళ్లు సోకటంతో మామిడి దిగుబడి సగానికి సగం పైగా పడిపోయింది. జిల్లాలోని 27 మండలాల్లోని గ్రామాల్లోని మామిడి తోటల నుంచి నున్న మామడి మార్కెట్‌కు ట్రాక్టర్లపై రైతులు, వ్యాపారస్థులు తీసుకొస్తారు. కమీషన్ ఏజెంట్ల సహకారంతో బహిరంగ వేలం, ఇతర పద్ధతుల్లో గ్రేడింగ్ చేసి మామిడి కాయల్ని సేట్‌లు కొనుగొలు చేస్తారు. ప్రధానంగా నున్న మామిడి మార్కెట్ నుంచి అహ్మదాబాద్, అజ్మీర్, కోట, ఫరిదాబాద్, పాట్నా, బిల్‌వార్, జీన్స్, ఆగ్రా ప్రాంతాలకు లారీలకు లోడ్ చేసి 10 టన్నులు, 17 టన్నుల సామర్థ్యంతో ఏగుమతులు జరుగుతాయి. ప్రధానంగా బంగినపల్లి, కలెక్టర్ (తోతాపురి), చెరుకురసం, సువర్ణరేఖ ఇతర రకాల మామిడి ఎగుమతులు జరిగాయి. 98శాతం దాకా బంగినపల్లి, కలెక్టర్ మామిడికాయలు ఎగుమతులు జరిగాయి. బంగినపల్లి రకం టన్ను 25వేలు, కలెక్టర్ రూ.11వేలు, చెరుకురసం 20వేల రూపాయల చప్పున టన్నుధర పలికింది. మామిడి ధరలు ఏరోజుకారోజు ఎలక్ట్రానిక్ పద్ధతుల్లో ప్రదర్శన నిర్వహించటం, మూగ సైగల విధానాలకు క్రమంగా మార్పుచేసుకొంటూ బహిరంగ పద్ధతుల ద్వారా వ్వాపార లావాదేవీలు నిర్వహించేందుకు ప్రభుత్వం తగు చర్యలు చేపట్టింది. జిల్లాలో పెరుగుతున్న మండీల ద్వారా మామిడి వ్యాపార లావాదేవీలు పెరిగాయి. హామీలు, ట్రాన్స్‌పోర్టు ఖర్చులు తక్కువుగా ఉండటంతోపాటు గ్రామాల్లోని మామిడి తోటల దగ్గరకు సేట్‌లు నేరుగా వెళ్లటంతో అక్కడ కూడా 10శాతం దాకా మామిడి వ్యాపార లావాదేవీలు జరిగాయి. ఈ మండీల విధానం నున్న మామడి మార్కెట్ మామిడి వ్యాపార లావాదేవీలకు కొంత నష్టం కలిగించింది. గాలివానకు వందలాది కోట్ల రూపాయల విలువైన మామిడి రాలిపోవటంతో రైతులకు పెద్ద మొత్తంలో నష్టం ఏర్పడింది. గత సీజన్‌తో పోల్చితే సగానికి సగం పైగా మామిడి ఎగుమతులు పాడైపోయాయి. వాతావారణంలో మార్పులు చేసుకోవటంతో దిగుబడి పూర్తవుతుండటంతో ఈ మాసాంతానికి, వచ్చేనెల మొదటి వారానికి మామిడి సీజన్ పూర్తి అవుతుందని చెబుతున్నారు.