కృష్ణ

కాల్‌మనీ బాధితులకు న్యాయం చేస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), మే 31: రాష్ట్రాన్ని పట్టి కుదిపేసిన కాల్‌మనీ ఉదంతం ద్వారా వెలుగులోకి వచ్చిన ఎంతోమంది బాధితులకు న్యాయం చేశామన్న సంతృప్తి ఉందని నగర పోలీసు కమిషనర్ దామోదర్ గౌతం సవాంగ్ అన్నారు. నష్టపోయిన వారికి భద్రతే కాకుండా చట్టపరిధిలో వారికి న్యాయం చేసేందుకే పోలీసు శాఖ కృషి చేస్తుందని, దీంతోపాటు సంస్కరణలకు సంబంధించి మరిన్ని అంశాలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. కాల్‌మనీ - స్థితిగతులు అంశంపై నగర పోలీసు శాఖ ఆధ్వర్యాన మంగళవారం ఎ-వన్ కనె్వన్షన్ సెంటర్‌లో జరిగిన వర్క్‌షాపులో ఆయన ప్రారంభోపన్యాసం చేశారు. ఈ సదస్సుకు సమాజంలోని అన్ని వర్గాలు హాజరయ్యారు. మేధావులు, రాజకీయ, సామాజిక కార్యకర్తలతోపాటు పారిశ్రామిక, వ్యాపార వేత్తలు, వైద్యులు, అధ్యాపకులు, పాత్రికేయులు, మహిళా సంఘాలు, న్యాయవాద వర్గాలు పాల్గొని చర్చించారు. ఇదే సమయంలో కాల్‌మనీ బాధితులు సైతం హాజరై తాము ఎదుర్కొన్న ఇబ్బందులను వివరించారు. పోలీసులను ఆశ్రయించిన మీదట తమకు లభించిన ఊరటను గుర్తు చేసి కన్నీటి పర్యంతమయ్యారు. ఈ సందర్భంగా పోలీసు కమిషనర్ దామోదర్ గౌతం సవాంగ్ మాట్లాడుతూ గత ఏడాది డిసెంబర్ 10వ తేదీన ఓ కాల్‌మనీ బాధితురాలు ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేయడం ద్వారా ఈ ఆకృత్యాలు, ఉదంతాలు వెలుగులోకి వచ్చాయన్నారు. అప్పటివరకు 2010 నుంచి కాల్‌మనీ వ్యవహారానికి సంబంధించి కేవలం ఎనిమిది కేసులు మాత్రమే నమోదయ్యాయని, ఆ తర్వాత ఫిర్యాదుల పరంపరతో రాష్ట్రంలోనే లేని విధంగా కమిషనరేట్‌లో ప్రత్యేకంగా కాల్‌మనీ సెల్ ఏర్పాటు చేయడం ద్వారా మూడు బెంచ్‌లు ఏర్పాటు చేసి న్యాయవాదులు, సామాజిక కార్యకర్తలతో కేసుల పరిష్కారానికి కృషి చేశామన్నారు. కాల్‌మనీ ఫిర్యాదులపై 176 దాడులు నిర్వహించి 51 మంది వ్యాపారులను అరెస్టు చేశామన్నారు. 1468 ఖాళీ ప్రామిసరీ నోట్లు, 911 చెక్కులు, 59 బ్యాంకు పాస్‌బుక్‌లు, 88 ఎటిఎం కార్డులు స్వాధీనం చేసుకున్నామన్నారు. 1234 ఫిర్యాదులు అందాయని, 441 కేసులు పరిష్కారం కాగా, 208 కేసులు పోలీస్టేషన్లకు రిఫర్ చేశామన్నారు. ఫిర్యాదుల్లో 63 కేసులు తప్పుడు కేసులు కాగా, 110 కేసులు ఎఫ్‌ఐర్ నమోదు చేశామని చెప్పారు. ఈ తరహా కేసులకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చామన్నారు. కాల్‌మనీ సెక్స్ రాకెట్ కేసులో ఇంకా ఒకరిని అరెస్టు చేయలేదని మహిళా సమాఖ్య నాయకులు దుర్గ్భావాని, శ్రీదేవి లెవనెత్తిన ప్రశ్నలకు సిపి స్పందిస్తూ ఈ దిశగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. తమపై ఎలాంటి రాజకీయ జోక్యం లేదని అందులో అనుమానమే వద్దన్నారు. అన్నింటికి అతీతంగా బాధితులకు న్యాయం చేయడమే తమ లక్ష్యమన్నారు. సదస్సుకు వక్త ఎంసి దాస్ అధ్యక్షత వహించారు. జాయింట్ పోలీసు కమిషనర్ హరికుమార్, డిసిపి జివిజి అశోక్‌కుమార్, చెన్నుపాటి విద్య, ప్రభుత్వ సలహాదారులు రామలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
పుష్కర నగర్‌లకు అంచనాలు
ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ, మే 31: పుష్కరనగర్‌లలో యాత్రికులకు వసతులు కల్పించేందుకు అవసరమైన సామాగ్రి అంచనాలు రూపొందించాలని జిల్లా రెవెన్యూ అధికారి చెరుకూరి రంగయ్య అధికారులను ఆదేశించారు. నగరంలోని సబ్-కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో మంగళవారం జిల్లా రెవెన్యూ అధికారి, సబ్ కలెక్టర్ డా.జి.సృజనతో కలిసి ఎంపిడివోలు, పంచాయతీరాజ్ శాఖ అధికారులతో పుష్కరనగర్‌లలో వౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి మాట్లాడుతూ ఆగస్టు 13వ తేదీ నుండి జరగనున్న కృష్ణా పుష్కరాలను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించేందుకు పుష్కర ఘాట్లు, పుష్కర నగర్ల నిర్మాణం పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు. దాదాపు 3 కోట్లకు పైగా యాత్రికులు పుష్కరాలకు వచ్చే అవకాశం ఉందన్నారు. జిల్లా వ్యాప్తంగా 80కి పైగా పుష్కర ఘాట్లతో పాటు 38 పుష్కరనగర్లు ఏర్పాటు చేసేందుకు జిల్లా యంత్రాంగం ఇప్పటికే పనులు ప్రారంభించిందన్నారు. ఘాట్ల సమీపంలో ఏర్పాటు చేసే పుష్కరనగర్‌లలో యాత్రికులకు తాత్కాలిక వసతులు కల్పించేందుకు అవసరమైన సదుపాయాల సామాగ్రి ఏ మేరకు అవసరమో అంచనాలు తయారుచేయాలన్నారు. పంచాయతీశాఖ అధికారులు ఆ సామాగ్రికి టెండర్ల ప్రక్రియ నిర్వహించేందుకు అవకాశం ఉంటుందన్నారు. పుష్కరనగర్లలో ప్రధానంగా షామియానాలు, పార్కింగ్, మంచినీరు, తాత్కాలిక మరుగుదొడ్లు, చెప్పుల స్టాండ్, శానిటేషన్‌కు అవసరమయ్యే బ్లీచింగ్, ఫినాయిల్ వంటి వాటిని గుర్తించి నివేదికలో పొందుపరచాలన్నారు. షామియానాలు, తాత్కాలిక షెడ్లు వర్షాలను తట్టుకునే విధంగా ఉండాలన్నారు. పుష్కరనగర్లు ఏర్పాటు చేసే ప్రాంత విస్తీర్ణం దృష్టిలో ఉంచుకుని షామియానా కొలతలను నిర్ధారించుకోవాలన్నారు. యాత్రికులకు అన్నదానం చేసేందుకు స్వచ్ఛంద సంస్థలు ముందుకు వస్తున్నాయని, వారి అవసరాలకు అనుగుణంగా వంట చేసే ప్రాంతాన్ని గుర్తించాలన్నారు. ఎంపిడివో, తహశీల్దార్, పంచాయతీరాజ్ ఎ, ఇఓ, పిఆర్‌డిలు సభ్యులుగా మండల స్థాయిలో కమిటీ ఏర్పాటు చేశామని, కమిటీ పుష్కరనగర్‌లో పర్యటించి అవసరాల నివేదిక రూపొందిస్తుందని డిఆర్‌ఓ తెలిపారు.
సబ్ కలెక్టర్ డా. జి.సృజన మాట్లాడుతూ పుష్కరాల్లో యాత్రికుల సంఖ్యను అంచనా వేసి ఘాట్లను గ్రేడ్లుగా విభజించామన్నారు. యాత్రికుల సంఖ్య అంచనాతో పుష్కరనగర్లలో వసతులు ఉండాలన్నారు. పుష్కరాలు ప్రారంభం నాటికి మూడు రోజులు ముందుగా పుష్కర నగర్‌లలో యాత్రికులకు అన్ని వౌలిక వసతులు కల్పించి సిద్ధం చేయాలని సబ్ కలెక్టర్ ఆదేశించారు. ప్రత్యేక సమావేశంలో జడ్‌పి సిఇఓ వి.నాగార్జునసాగర్, బందరు ఆర్‌డిఓ పి.సాయిబాబా, జిల్లా పంచాయతీరాజ్ అధికారి వి.కృష్ణకుమారి, ఐసిడిఎస్ పిడి కె.కృష్ణకుమారి, ఎంపిడివోలు, పంచాయతీరాజ్ శాఖ అధికారులు పాల్గొన్నారు.