కృష్ణ

జంక్షన్‌లో ఘనంగా హనుమజ్జయంతి వేడుకలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హనుమాన్ జంక్షన్, మే 31:మంగళవారం హనుమంతుని జన్మదినోత్సవం సందర్భంగా హనుమాన్ జంక్షన్‌లో హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల ఆరాధ్యదైవం స్థానిక అభయాంజనేయుని దేవస్థానంలో విశేషపూజలు జరిగాయి. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు బారులుతీరడంతో ఉదయం నుంచి సాయంత్రం వరకు అధికారులు దర్శనాన్ని కొనసాగించారు. స్వామివారిని 40,000 మంది భక్తులు దర్శించుకున్నట్లు ఆలయ కార్యనిర్వహణ అధికారి కెవిఆర్ నాగేశ్వరరావు తెలిపారు. స్వామివారికి ఉదయం ప్రత్యేక అభిషేకాలు, పూజా కార్యక్రమాలను ఆలయ అర్చకులు మారేపల్లి సీతారామానుజాచార్యులు శాస్రోక్తంగా నిర్వహించారు. సాయంత్రం జరిగిన లడ్డూప్రసాదం వేలంపాటలో 50 కేజీల లడ్డూను పశ్చిమగోదావరి జిల్లా ఏలూరుకు చెందిన కొండూరు శివశంకర్ రెడ్డి 35,000కు సొంతం చేసుకున్నారు. 15 కేజీల లడ్డూను బాపులపాడు మండల పరిషత్ అధ్యక్షురాలు తుమ్మల కోమలి దంపతులు 14,000లకు సొంతం చేసుకున్నారు. అనంతరం స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని హనుమాన్ జంక్షన్ ప్రధాన రహదారుల వెంబడి ఉరేగింపు వైభవంగా జరిగింది. హనుమాన్ జయంతిని పురస్కరించుకుని హనుమాన్ జంక్షన్ లారీ ఓనర్స్ అండ్ వర్కర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమానికి భక్తులు భారీగా హాజరయ్యారు. దాదాపు 70 వేల మంది భక్తులు స్వామి వారి ప్రసాదాన్ని స్వీకరించినట్లు అసోసియేషన్ ప్రతినిధులు వెల్లడించారు.

రోడ్డు ప్రమాదంలో ప్రయాణికుడి మృతి

కైకలూరు, మే 31: గుడివాడ - భీమవరం ప్రధాన రహదారిలో పల్లెవాడ - ఆలపాడు మధ్యలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు చనిపోగా ఇరువురు ఆసుపత్రి పాలయ్యారు. రూరల్ ఎస్‌ఐ రంజిత్‌కుమార్ కథనం ప్రకారం మంగళవారం మధ్యాహ్నం సుమారు 12.30 గంటల సమయంలో ఆటో ఆకివీడు నుంచి కైకలూరు వస్తోంది. ఆలపాడు దాటిన తరువాత సాయన నరేంద్ర చేప పిల్లల కేంద్రం వద్ద వచ్చే సరికి ఆటో బోల్తా కొట్టిందని అన్నారు. ఆటోలో ప్రయాణిస్తున్న భుజలపట్నంకు చెందిన సోమల సాల్మన్‌రాజు (50), గోపావరానికి చెందిన పి శ్యామసుందర్ ప్రసాద్ (30), భుజలపట్నంకు చెందిన వి మాణిక్యాలరావు (50)లు తీవ్రగాయాలకు గురయ్యారు. క్షతగాత్రులను కైకలూరు ప్రభుత్వాసుపత్రికి తీసుకురాగా, ప్రభుత్వ వైద్య అధికారులు సాల్మన్‌రాజు మృతి చెందాడని నిర్ధరించారు. మాణిక్యాలరావుకు ప్రథమ చికిత్స చేసి మెరుగైన వైద్యం కోసం ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. శ్యామసుందర్ ప్రసాద్‌కు కైకలూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స నిర్వహిస్తున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నామనీ ఎస్‌ఐ రంజిత్‌కుమార్ తెలిపారు.