కృష్ణ

రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కార్పొరేషన్), జూన్ 4: రాష్ట్ర విభజన జరిగి రెండేళ్లు పూర్తయినా విభజన పాపం కాంగ్రెస్ పార్టీకే అంటగడుతూ విమర్శలతోనే కాలం గడుపుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు తీరు రాష్ట్ర ప్రయోజనాలకు తీవ్ర విఘాతమని, నాడు మాటతిప్పని వెంకయ్యనాయుడు నేడు మెడ తిప్పి రాష్ట్రాన్ని వదిలి వెళ్లిపోయిన తీరు హేయమని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు దేవినేని నెహ్రూ ఎద్దేవా చేశారు. ఇటీవల రాష్ట్రంలో నెలకొన్న ఘటనలపై శనివారం ఉదయం నగరంలోని ఆంధ్రరత్న భవన్‌లో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో నెహ్రూ మాట్లాడుతూ టిడిపి-బిజెపి మధ్య కొనసాగుతున్న మైత్రి కేవలం అవసరాలకే పరిమితమని, కేవలం వారి రాజకీయ ప్రయోజనాలకే మిత్ర బంధాన్ని కొనసాగిస్తున్న తీరు శోచనీయమన్నారు. నాడు రాష్ట్ర విభజనలో చోటుచేసుకొన్న ఘటనలు కాంగ్రెస్ పార్టీకే అపాదిస్తున్న వైనంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన ఏ పార్టీ చేసినా విభజన అదేవిధంగా చేస్తారే కానీ ముందుగానే రాజధాని నిర్మాణం, అభివృద్ధి చేసి అప్పగించరని, గతంలో బిజెపి చేసిన విభజన రాష్ట్రాల విభజన కూడా ఇదే మాదిరిగా జరగలేదాని ప్రశ్నించారు. ఏళ్లు దాటుతున్నా ఇప్పటికీ ఆయా రాష్ట్రాల రాజధాని నిర్మాణాలు, ఇతర సదుపాయాల కల్పనలు జరుగుతున్నాయన్నారు. విభజన సమయంలో బిజెపి చేసిన వాగ్దానాలను ఇప్పుడు వారెందుకు అమలుచేయడం లేదో స్పష్టం చేయాలన్నారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీతోపాటు వెంకయ్య, అరుణ్‌జైట్లీ, చేసిన డిమాండ్లు, ఇచ్చిన హామీలు ఇప్పటికీ రాష్ట్ర ప్రజలకు గుర్తున్నాయన్నారు. సిఎం చంద్రబాబు నోరు విప్పకపోతే నష్టపోయేది రాష్ట్రంతోపాటు రాష్ట్ర ప్రజలేనన్న విషయాన్ని గుర్తించి మిత్ర లాభాన్ని కొద్దిసేపు పక్కన పెట్టి రాష్ట్ర ప్రయోజనాలపై కార్యాచరణ చేయాలన్నారు. రాష్ట్రానికి కావాల్సిన నిధులు, ఇతర సంస్థల ప్రయోజనాల సాధనలో సిఎం చంద్రబాబు ఘోరంగా విఫలమైతే ఆవిషయాన్ని పక్కన పెట్టి టిడిపి నాయకులు చేస్తున్న రాజకీయ యాగి గర్హనీయమన్నారు. ప్రత్యేక హోదాతోపాటు ప్రత్యేక నిధులపై ఎటువంటి స్పందన లేని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్రంలోని ఐదు కోట్ల మంది ప్రజలను మోసం చేస్తోందన్నారు. కేంద్ర మంత్రి సురేష్ ప్రభుకు రాజ్యసభ సీటు కేటాయించడం వలన ప్రత్యేక రైల్వే జోన్ వచ్చే అవకాశం ఉంటుందన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం కాంగ్రెస్ పార్టీ అలుపెరగని పోరాటం చేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకే కాకుండా టిడిపి - బిజెపికు తగిన గుణపాఠం చెబుతామని ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశంలో పిసిసి సంయుక్త కార్యదర్శి బాబూరావు, అధికార ప్రతినిధి కొలనుకొండ శివాజీ, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కడియాల బుచ్చిబాబు, మాజీ డెప్యూటీ మేయర్లు చెరుకూరి కృష్ణకుమార్, ఎ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.