కృష్ణ

రివాల్వర్, 50 బుల్లెట్లు నగదుతో కారుడ్రైవర్ పరార్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (పాతబస్తీ), జూన్ 5: కడప జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు, వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ సి రామచంద్రయ్య బంధువు చెన్నంశెట్టి శశికుమార్ కారులోని సూట్‌కేస్‌ని తీసుకుని డ్రైవర్ పరార్ కాగా నగరంలోని సిసిఎస్, కొత్తపేట పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. పోలీసుల కథనం ప్రకారం.. కడప జిల్లాకు చెందిన చెన్నంశెట్టి శివకుమార్ ఓబులాపురం మైన్స్ కేసులో సాక్షిగా ఉన్నాడు. ఇతనికి ప్రాణహాని ఉందనే భయంతో ముందుజాగ్రత్త చర్యగా రాష్ట్ర ప్రభుత్వం నలుగురు గన్‌మెన్‌లను రక్షణగా కేటాయించింది. సొంత కారులో నలుగురు గన్‌మెన్‌లతో బయలుదేరిన శశికుమార్ విజయవాడ సాయిరామ్ థియేటర్ సమీపంలోని నాగమ్మ సత్రం వద్ద నివాసముంటున్న దుర్గారావు అనే స్నేహితుడి ఇంటికి వచ్చాడు. దుర్గారావుకి ఇటీవలే గుండె శస్తచ్రికిత్స జరిగింది. స్నేహితుడిని పరామర్శించేందుకు వచ్చిన శశికుమార్ వ్యక్తిగత రివాల్వర్, 50 బుల్లెట్లు, రూ.90వేల నగదును సూట్‌కేసులో పెట్టుకున్నాడు. మార్గంమధ్యలో గుంటూరు దగ్గర ఓ హోటల్‌లో అల్పాహారం తిన్నాక సూట్‌కేసులో నుంచి డబ్బులు తీసి ఇవ్వటాన్ని డ్రైవర్ మదన్‌మోహనరెడ్డి గమనించాడు. ఆదివారం రాత్రి 8.15కి విజయవాడకు రాగానే శశికుమార్, అతని నలుగురు గన్‌మెన్‌లు దుర్గారావు ఇంటికి వెళ్లి ఓ గంటపాటు గడిపారు. అంతవరకు డ్రైవర్ కారులోనే ఉన్నాడు. దుర్గారావు ఇంటి నుంచి కారు దగ్గరకు వచ్చిన శశికుమార్‌కు తరువాత కారుడ్రైవర్ కనిపించలేదు. అనుమానం వచ్చి సూట్‌కేసు కోసం చూస్తే కనిపించలేదు. డ్రైవర్ మదన్‌మోహనరెడ్డి వారం క్రితమే తనవద్ద పనికి చేరినట్లు శశికుమార్ పోలీసులకు తెలిపాడు. జరిగిన సంఘటన వివరిస్తూ శశికుమార్ కొత్తపేట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సిసిఎస్ ఎసిపి సుందరరాజు, వెస్ట్‌జోన్ ఎసిపి జి రామకృష్ణ, కొత్తపేట సిఐ దుర్గారావు, సిసిఎస్ సిఐలు, ఎస్‌ఐలు సంఘటనా స్థలానికి పరుగులు తీశారు. పారిపోయిన వ్యక్తి రివాల్వర్‌తో వెళ్లటం, సూట్‌కేసులో 50 బుల్లెట్లు ఉండటం, రివాల్వర్ కెపాసిటీ .03.2 కావటంతో నగర పోలీసులు మిగతా జిల్లాల పోలీసు యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. పోలీసులు నాలుగు బృందాలుగా ఏర్పడి రైల్వేస్టేషన్, బస్టేషన్, స్థానిక లాడ్జీల్లో గాలింపు చర్యలు చేపట్టారు. ప్రాణహాని వుందని నలుగురు గన్‌మెన్‌లను పెట్టుకున్నా గాని శశికుమార్‌కు చెందిన రివాల్వర్ దొంగలించటానికే మదన్‌మోహనరెడ్డి నాటకీయంగా ఇతని వద్ద విధుల్లో చేరినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అతని ఆచూకీ కోసం నగరాన్ని జల్లెడ పడుతున్నారు. విజయవాడ నగర చరిత్రలో గన్‌మెన్‌లు ఉండి కూడా వ్యక్తి రివాల్వర్, బుల్లెట్లు మాయమవటం అదే ప్రథమం. అదీనూ నవ్యాంధ్ర రాజధానిలో తొలిసారి చోటుచేసుకున్న ఈ సంచలన సంఘటన పోలీసుల పనితీరుకు సవాల్ విసిరినట్లుగా ఉంది.