కృష్ణ

రాష్ట్రాన్ని హరితవనంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంద్రకీలాద్రి, జూన్ 5: రాష్ట్రాన్ని హరివనంగా తీర్చిదిద్దటమే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తెలిపారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఆదివారం ఉదయం గొల్లపూడి మార్కెట్ యార్డు ఆవరణలో సియం 1000 మంది విద్యార్థుల చేత మొక్కలు నాటించారు. ఈసందర్భంగా సియం బాబు మాట్లాడుతూ ఆరోగ్యవంతమైన సమాజస్థాపన చేయాలని, దీనికి కాలుష్య నియంత్రణ చేయాల్సి ఉంటుందన్నారు. కాలుష్య నియంత్రణకు చెట్లు నాటాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రతి ఒక్కరూ పది మొక్కలు నాటాలని ఐదుకోట్ల జనాభా ఒక్కొక్కరు పది మొక్కలు నాటితే 50కోట్ల మొక్కలు పెరుగుతాయన్నారు. ఇళ్లు, స్థలాలు, పొలాలగట్లు, రహదారులు, పార్కులు, ఖాళీ ప్రదేశాల్లో మొక్కలు నాటి వాటిని కాపాడాలని సియం సూచించారు. మొక్కలు నాటటంతో వాటిని పరిరక్షించాల్సిన బాధ్యత కూడా తీసుకోవాలన్నారు, మొక్కలు పెరిగి చెట్లుగా మారితే మంచి వాతావరణం ఏర్పడుతోందన్నారు. నాటిన మొక్కలను జియోట్యాగింగ్ చేయించాలని కలెక్టర్లకు సియం ఆదేశాలు జారీ చేశారు. ప్రైవేట్ నర్సీరీల్లో 15కోట్లు మొక్కలు పెంచాలన్నారు. జూన్ మాసంలో వర్షాలు ప్రారంభమైన నాటి నుండి డిసెంబర్ వరకు ఉద్యమంలా మొక్కలు నాటాలన్నారు. ప్రతినెలా రాష్ట్ర అంతటా ఒకే రోజు మొక్కలు నాటాలని సియం ఆదేశాలు జారీ చేశారు. 1000-2000 మెట్రిక్ టన్నుల విత్తనాలు అడవుల్లో చల్లించాలన్నారు. చెక్‌డామ్‌లు నిర్మించటం, ట్రెంచెస్ కొట్టడటం వల్ల వర్షపునీరు, నిల్వ ఉండి భూగర్భ జలాలు పెరుగుతాయన్నారు. వర్షపునీటిని ఒడిసిపట్టి భూగర్భ జలాలను పెంచుకోవాలన్నారు. భూగర్భ జలాల వివరాలు తెలుసుకోవటానికి రాష్ట్రంలో 1250్ఫజోమీటర్లు, 1000 రెయిన్ గేజెస్‌లను ఏర్పాటు చేశామన్నారు. వీటిని కంప్యూటర్‌తో అనుసంధానించుకోవటం ద్వారా భూగర్భ జల మట్టాల వివరాలు ఆన్‌లైన్‌లో పొందవచ్చన్నారు. రాష్ట్రాన్ని 2020 నాటికి దేశంలోని మూడు అత్యుత్యమ రాష్ట్రాల్లో ఒకటిగా, 2029నాటికి దేశంలో అత్యుత్తమ రాష్ట్రంగా 2050 నాటికి ప్రపంచంలో అత్యుత్తమ రాష్ట్రాల్లో ఒకటిగా నిలపాలన్నదే ప్రభుత్వ ధ్యేయమని దీనిని సాధించి తీరుతామని ముఖ్యమంత్రి ధీమా వ్యక్తం చేశారు. మన భవిష్యత్ మనచేతుల్లోనే ఉందని పట్టుదలతో సాధించలేనిది ఏమిలేదన్నారు. సామాజిక బాధ్యతతో మన పూర్వీకులు చెరువులు తవ్వించారని కాటన్ మహాశయుడు బ్రిటిష్ పౌరుడు అయినప్పటికీ ధవళేశ్వరం బ్యారేజీ, ప్రకాశం బ్యారేజీలను కట్టిన విషయాన్ని ఈసందర్భంగా గుర్తు చేశారు. జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రంలో 40వేల చెరువుల్లో పూడికతీత పనులు చేపట్టి రెండువేల కోట్లలతో 18కోట్ల క్యూబిక్ మీటర్ల మట్టిని తొలగించి పొలాలకు ఎరువులుగా వేశామన్నారు. ప్రతి ఒక్కరూ పదిచెట్లు నాటాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. యంపి కేశినేని మాట్లాడుతూ ప్రతి జిల్లాలో నగరవనం ఏర్పాటు చేస్తున్నారన్నారు. 60ఏళ్లుగా విజయవాడ నగరంలో జరగని అభివృద్ధి కేవలం రెండేళ్లలో జరుగుతోందన్నారు. ఈకార్యక్రమంలో జిల్లా కలెక్టర్ బాబుఏ, జాయింట్ కలెక్టర్ గంధం చంద్రుడు, నగరపాలక సంస్థ కమిషనర్ జి వీరపాండియన్, సబ్‌కలెక్టర్ డాక్టర్ జి సృజన, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, నగర మేయర్ కోనేరు శ్రీ్ధర్, డిఇఒ సుబ్బారెడ్డి, డిఎఫ్‌ఒ అశోక్ కుమార్, గ్రామ సర్పంచ్ సాధనాల వెంకటేశ్వరమ్మ, యంపిపి వి జగన్‌మోహనరావు, జడ్‌పిపిసి కె అంజనీకుమారి, ఎంయంసి చైర్మన్ జాలిపర్తి గోపాలకృష్ణ, వివిధ కళాశాలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు.

ఉల్లాసంగా.. ఉత్సాహంగా హ్యాపీ సండే
విజయవాడ (స్పోర్ట్స్), జూన్ 5: గ్రామీణ ప్రాంతాల కంటే నగరంలోని ప్రజలు అనేక పని ఒత్తిడి మధ్య జీవనం కొనసాగిస్తుండగా నెలలో ఒక ఆదివారం అన్నీ మరచి ఆనందంగా నగర వీధుల్లో కేరింతల మధ్య ఉల్లాసంగా గడపాలనే ఆకాంక్షతో ముఖ్యమంత్రి సూచనల మేరకు నగరపాలక సంస్థ, పోలీస్‌శాఖల సమన్వయంతో పలు స్వచ్ఛంద సంస్థల సహకారంతో హ్యాపీ సండేను నిర్వహిస్తున్నట్లు నగర కమిషనర్ జి.వీరపాండియన్ తెలిపారు. ప్రతి నిత్యం రద్దీగా ఉండే మహాత్మాగాంధీ రోడ్డు నందు ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వద్ద వై స్క్రీన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇండియా లిమిటెడ్‌వారి స్పాన్సర్స్‌తో డీప్ ట్రస్ట్‌వారి సహకారంతో జూన్ మొదటి ఆదివారం నిర్వహించిన హ్యాపీ సండే కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా నగరపాలక సంస్థ కమిషనర్ వీరపాండియన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో ప్రతి ఒక్కరూ అనేక ఒత్తిళ్ల మధ్య ప్రతిరోజూ ఎంతో బిజీగా జీవనం కొనసాగించటం జరుగుతుందని, ప్రజలకు ఆహ్లాదకరమైన ప్రకృతి వాతావరణంలో నడిరోడ్డుపై ఎవరికి ఇష్టం ఉన్న ఆటలను ఆడుకొని ఆనందించేలా ఈ హ్యాపీ సండే కార్యక్రమం ముఖ్యోద్దేశన్నారు. గ్రామీణ ప్రాతాల్లో మాత్రమే ఈ విధమైన కార్యక్రమాలను ఏర్పాటు చేసుకునే వారమని నగరంలో బిజీగా ఉన్న తరుణంలో ఈ విధమైన ఆటలు పాటలు కరువై కనీసం కుటుంబ సమేతంగా సరదాగా గడపలేని ప్రస్తుత రోజుల్లో అనేక అనారోగ్య పరిస్థితులు కూడా ఉత్పన్నమవుతున్నాయని, వాటినన్నింటిని అధిగమించి ప్రతి నెలలో ఒకరోజు నగర ప్రజలందరూ కుటుంబ సమేతంగా సరదాగా ఉల్లాసంగా ఆట పాటల మధ్య కొంత సమయం గడపాలనే ప్రధానోద్దేశ్యంతో ప్రారంభించిన ఈ కార్యక్రమం ప్రజల నుండి ఎంతో ఆదరణ లభించి స్వచ్ఛందంగా అనేక సంఘాలవారు పాల్గొంటున్నారన్నారు. గతంలో ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రాజధానిగా అభివృద్ధి చెందుతున్న మన నగరంలో 10కె రన్, 5కె రన్, సైకిల్ మారథాన్ కార్యక్రమాల్లో ప్రజలు స్వచ్ఛందంగా, ఉల్లాసంగా, ఉత్సాహంతో పాల్గొన్నారని, నగరంలో ఆనందమైన ఆదివారం కార్యక్రమంలో ప్రజలు పాల్గొని వారి జీవితంలో పడే బాధలు, కష్టాలు మరచిపోయి కొన్ని గంటలపాటు ఎంతో ఆనందంగా, ఆహ్లాదంగా గడపటం ద్వారా ఆరోగ్యకరమైన జీవనాన్ని కొనసాగించగలమన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రజలు ఒక ఆటవిడుపుగా ఆరోగ్యాన్ని పెంచేలా, ఆనందంగా, ఉత్సాహంగా పరుగులు తీస్తూ నగరపాలక సంస్థ వివిధ పాఠశాలల విద్యార్థులు, వివిధ స్వచ్ఛంద సంస్థల నుండి వచ్చిన బాలబాలికలు, క్రీడాకారులు అన్ని వయస్సులవారు స్కేటింగ్, సైక్లింగ్, చెస్, టెన్నీకాయిట్, వాలీబాల్, కరాటే, స్కేటింగ్, స్కిప్పింగ్, త్రోబాల్, టేబుల్ టెన్నిస్, విలువిద్య, తొక్కుడుబిళ్ల, యోగా, మెడిటేషన్ వంటి ఎన్నో రకాల ఆటలు, పాటలు, డ్యాన్స్‌ల మధ్య కుటుంబ సమేతంగా వచ్చి హ్యాపీ సండే కాన్‌సెప్ట్‌ని అర్థం చేసుకుని ఆనందించారు. ఈ సందర్భంగా స్పెషల్ పోలీస్‌శాఖ వారు సైక్లింగ్ నిర్వహించగా డీప్ ట్రస్ట్‌వారు రాష్ట్రంలోనే మొదటిగా 2500 మంది విజయవాడ పోలీసులకు హెల్త్ చెకప్ నిర్వహించి డిజిటలైజ్ ఫ్రీగా చేయటం జరిగింది. అదే విధంగా నగరపాలక సంస్థ విఎం రంగా స్కూలు విద్యార్థినులు నిర్వహించిన యోగా, వైస్క్రీన్స్ సంస్థ నుండి జార్జీటీమ్‌వారు నిర్వహించిన జింబా డ్యాన్స్ అందరినీ విశేషంగా అలరించింది. అదే విధంగా చైల్డ్ హెల్ప్‌లైన్, ప్రయోజ్ ఆర్గనైజేషన్ ఏర్పాటుచేసిన కార్యక్రమాలు, శ్రీరామచంద్రా మిషన్ వారు నిర్వహించిన మెడిటేషన్ కార్యక్రమంలో అందరూ ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ అధికారులు రీజినల్ ఫైర్ ఆఫీసర్ ఎస్‌విఎస్ చౌదరి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ధనుంజయ, పోలీస్ అధికారులు, డీప్ ట్రస్ట్ నిర్వాహకులు జగదీష్, సైక్లింగ్ క్లబ్ వ్యవస్థాపకులు టి.పద్మ, ఈ కార్యక్రమం స్పాన్సర్స్ వై స్క్రీన్స్ తరుపున శిరీషా, చరణ్, ప్రమోద్, పలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, క్రీడాకారులు పాల్గొన్నారు.