కృష్ణ

నగరంలో వేగవంతమైన డిజిటల్ నెంబర్ల ఏర్పాటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కార్పొరేషన్), జూన్ 11: నగరంలోని నివాస, వ్యాపార భవనాలకు డిజిటల్ డోర్ నెంబర్ల ఏర్పాటు ప్రక్రియను అధికారులు వేగవంతం చేశారు. విఎంసి కమిషనర్ వీరపాండియన్ ఆదేశాల మేరకు మరో 3 నెలల్లో ప్రతి ఇంటికీ డిజిటల్ డోర్ నెంబర్లను ఏర్పాటు పూర్తికి విస్తృత చర్యలు తీసుకొంటున్నారు. ప్రస్తుతం ఉన్న పాత డోర్ నెంబర్ల స్థానంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన డిజిటల్ డోర్ నెంబర్‌ను కేటాయిస్తారు. డిజిటల్ డోర్ నెంబర్ ఏర్పాటు ప్రక్రియతో మొబైల్ ద్వారా ఇంటి అడ్రస్‌ను సులువుగా కనుగొనే వీలుంటుంది. డిజిటల్ డోర్ నెంబర్‌ను మొబైల్‌లో టైప్ చేస్తే ఇంటి అడ్రస్‌కు సంబంధించి రూట్ మ్యాప్ ఓపెన్ అవుతుంది. దేశంలోనే మొట్ట మొదటిసారిగా పైలెట్ ప్రాజెక్టు కింద విజయవాడ నగరంలోనే చేపట్టడం విశేషం కాగా అందుకు సంబంధించి ఇప్పటికే సాఫ్ట్‌వేర్‌ను రూపొందించారు. ఈమేరకు డిజిటల్ డోర్ నెంబర్ల ఏర్పాటు ప్రక్రియను ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థ జిఆర్‌ఇఎస్ సంస్థకు అప్పగించారు. ఈ సంస్థకు చెందిన ప్రతినిధులు నగరంలోని ప్రతి ఇంటికి వెళ్లి పాత డోర్ నెంబర్ ప్రకారం ఆస్తిపన్ను అసిస్‌మెంట్ నెంబర్ ప్రకారం నూతనంగా డిజిటల్ నెంబర్‌ను కేటాయిస్తారు. ఇంటి యజమానికి సంబంధించిన మొబైల్ నెంబర్‌ను కూడా అప్‌లోడ్ చేయడం జరుగుతుంది. సర్వే సంస్థ ఆదివారం 4వ డివిజన్ గుణదల, 3వ డివిజన్ క్రీస్తురాజుపురం, 20వ డివిజన్ అరండాల్ పేట, సోమవారం 44వ డివిజన్ సత్యనారాయణం రైల్వే క్వార్టర్స్, 45వ డివిజన్ మధురానగర్, 46వ డివిజన్ శ్రీనగర్ కాలనీ పరిసర ప్రాంతాల్లోని గృహాలకు డిజిటల్ డోర్ నెంబర్లను కేటాయించనున్నారు. సర్వే సంస్థ ప్రతినిధులు ఇంటికి వచ్చిన సమయంలో వారికి యజమానులు విధిగా సహకరించి తగిన సమాచారం ఇవ్వాలని కమిషనర్ వీరపాండియన్ పేర్కొన్నారు.

భూములు కోల్పోయిన
రైతులకు పరిహారమివ్వాలి
కృత్తివెన్ను, జూన్ 11: 216ఎ జాతీయ రహదారి విస్తరణలో భాగంగా భూములు కోల్పోయిన రైతులకు తగిన పరిహారం ఇవ్వాలని రైతు సంఘం నాయకులు డిమాండ్ చేశారు. శనివారం వారు విలేకర్లతో మాట్లాడుతూ పక్కనే ఉన్న పశ్చిమ గోదావరి జిల్లాలో మార్కెట్ ధర కంటే ఆరు రెట్లు అధికంగా భూములు కోల్పోయిన రైతులకు పరిహారం ఇస్తుంటే కృష్ణా జిల్లాలో అతి తక్కువ ఇవ్వటం ఏమిటని ప్రశ్నించారు. ఈ నెల 16న తహశీల్దార్ కార్యాలయానికి విస్తరణలో కోల్పోయిన రైతులు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో బంటుమిల్లి రైతు సంఘం అధ్యక్షుడు అజయ్ ఘోష్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం సంయుక్త కార్యదర్శి గౌరిశెట్టి నాగేశ్వరరావు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి పిన్నింటి విశేశ్వరరావు పాల్గొన్నారు

కృష్ణమ్మకు హారతి
నాగాయలంక, జూన్ 11: స్థానిక శ్రీరామపాదక్షేత్రం వద్ద సమరసతా మండలి ఆధ్వర్యంలో శనివారం కృష్ణమ్మకు హారతి కార్యక్రమం నిర్వహించారు. సమరసతా మండలి జిల్లా ఇన్‌ఛార్జి కోట సురేష్, మండల ఇన్‌ఛార్జి పి శ్రీనివాస్ నేతృత్వంలో వివిధ గ్రామాలకు చెందిన పలువురు మహిళలు కార్యక్రమంలో పాల్గొన్నారు. వెంకట్రామా థియేటర్ వద్ద నుంచి వందలాది మంది మహిళలు ప్రధాన వీధిలో భజన చేసుకుంటూ కృష్ణానది ఒడ్డుకు చేరుకున్నారు. అనంతరం కృష్ణమ్మకు హారతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా సురేష్ విలేఖర్లతో మాట్లాడుతూ దుర్భిక్ష పరిస్థితుల నుంచి బయటపడి పాడిపంటలతో ప్రజలు వర్ధిల్లాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు ప్రజలు అధిక సంఖ్యలో హాజరయ్యారు. సమరసతా మండలి నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎఎస్‌ఐ రత్తయ్య బందోబస్తు నిర్వహించారు.