కృష్ణ

ఐదుగురికి పునర్జన్మ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 13: నగరంలోని అరుణ్ కిడ్నీ సెంటర్ యాజమాన్యం చొరవతో ఐదుగురు పునర్జన్మ పొందిన ఘటన బుధవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే నగరంలోని పంట కాలువ రోడ్డులో నివాసం ఉండే రేగాని భవానీ ప్రసాద్ (27) అనే యువకుడు ఈ నెల 14న అర్ధరాత్రి ఏలూరురోడ్డులోని జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే స్థానికులు బాధితుడ్ని నగరంలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఈ నెల 12న రాత్రి 11 గంటల సమయంలో బ్రెయిన్ డెడ్ కావడంతో జీవన్‌దాస్ కార్యక్రమంలో భాగస్వామ్యంగా ఉన్న సూర్యరావుపేటలోని అరుణ్ కిడ్నీ సెంటర్‌కు భవానీ ప్రసాద్‌ను తరలించారు. ప్రముఖ కిడ్నీ వ్యాధి నిపుణులు డాక్టర్ నలమాటి అమ్మన్న బ్రెయిన్ డెడ్ విషయాన్ని జీవన్‌దాన్ ట్రస్ట్‌కు తెలియజేయడమే కాకుండా వారి సహకారంతో భవానీప్రసాద్ అమ్మ లక్ష్మీనారాయణమ్మ, అన్న రమణలకు అవయవదానంపై అవగాహన కల్పించారు. వారు అంగీకరించడంలో బ్రెయిన్ డెడ్ అయిన భవానీ ప్రసాద్ నుండి లివర్, రెండు కిడ్నీలు, రెండు కళ్లు సేకరించారు. మణిపాల్ ఆసుపత్రికి లివర్‌ను, ఆయుష్ ఆసుపత్రికి ఒక కిడ్నీని, అరుణ్ కిడ్నీ సెంటర్‌కు ఒక కిడ్నీని, వాసన్ ఐ కేర్‌కు రెండు కళ్లను అక్కడ గ్రహీతలుగా ఉన్న ఐదుగురికి అమర్చడం ద్వారా వారికి పునర్జన్మను ప్రసాదించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ప్రముఖ నెఫ్రాలజిస్ట్, హాస్పిటల్ ఎండి డాక్టర్ నలమాటి అమ్మన్న మాట్లాడుతూ భవానీ ప్రసాద్‌కు జరిగిన రోడ్డు ప్రమాదంలో తలకు బలమైన గాయం తగలడం ద్వారా బ్రెయిన్ డెడ్ కావడం జరిగిందన్నారు. అతనికి శరీరంలో మరెక్కడా గాయాలు లేవని, హెల్మెట్ ధరించి ఉంటే మరణం సంభవించేది కాదన్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా వాహన చోదకులు తప్పక హెల్మెట్ ధరించాలని సూచించారు. యువకుడైన భవానీ ప్రసాద్ తుది శ్వాస విడుస్తూ అవయవదానంతో పలువురికి నూతన జీవితాన్ని ప్రసాదించాడని, అందుకు చొరవ చూపిన అతని కుటుంబీకులు అభినందనీయులన్నారు. 1997లో ప్రారంభించిన అరుణ్ కిడ్నీ సెంటర్‌లో ఆంధ్రప్రదేశ్‌లోనే మొట్టమొదటిసారిగా కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ తామే నిర్వహించామని, ఇప్పటివరకు 506 కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్స్ జరిగాయన్నారు. జీవన్‌దాన్‌లో భాగస్వామ్యం అయిన రెండేళ్లలో ముగ్గురు బ్రెయిన్‌డెడ్ వ్యక్తుల నుండి అవయవాలను సేకరించడం జరిగిందని, ఇప్పటి వరకు తమ ఆసుపత్రి నుండి 12మంది గ్రహీతలు కిడ్నీలను పొంది నూతన జీవితాన్ని పొందారన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్టణం, విజయవాడ, తిరుపతి జోన్‌లలో జీవన్‌దాస్ కార్యక్రమం ద్వారా ప్రతినెల కనీసం 5 అవయవదాన కార్యక్రమాల ద్వారా 20 మంది నూతన జీవితాన్ని పొందుతున్నారని, ఈ కార్యక్రమంపై ప్రజల్లో మరింత అవగాహన పెరగాల్సిన ఆవశ్యకత ఉందని ఈ సందర్భంగా డాక్టర్ నలమాటి అమ్మన్న తెలిపారు.