కృష్ణ

తల్లి ఒడికి చేరిన బిడ్డ.. 48గంటల్లో వీడిన మిస్టరీ పోలీసు అదుపులో మహిళ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), జూలై 16: రాష్టవ్య్రాప్తంగా సంచలనం రెకెత్తించిన ప్రభుత్వాస్పత్రిలోని పసికందు మాయం కేసులో ఎట్టకేలకు మిస్టరీ వీడింది. బిడ్డను గుర్తించిన పోలీసులు తల్లి ఒడికి చేర్చారు. కాగా శిశువును స్వాధీనం చేసుకున్న మీదట అదుపులోకి తీసుకున్న మహిళను పోలీసులు విచారిస్తున్నారు. మొత్తం మీద బిడ్డ అపహరణకు గురైన 48 గంటల్లోనే దర్యాప్తు బృందాలు కేసు చేధించడం గమనార్హం. కాగా ఆస్పత్రి నుంచి బిడ్డ బయటకు ఎలా వెళ్లింది. అంతలోనే అవనిగడ్డకు ఎలా చేరింది. దీని వెనుక అసలు సూత్రధారులెవరన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. అయితే మహిళను విచారిస్తున్న క్రమంలో కొన్ని కీలక విషయాలు బయటకు వచ్చినట్లు సమాచారం. ఒప్పందం కుదుర్చుకున్నందుకు డబ్బు చేతులు మారడంపై కూడా లోతుగా విచారణ జరుగుతోంది. మహిళతో పాటు మరో వ్యక్తి అదుపులోకి తీసుకున్న పోలీసులు రహస్య విచారణ చేపట్టారు. నేడు లేదా రేపో నిందితులను అరెస్టు చేసి మీడియా ముందు ప్రవేశపెట్టే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. కొత్తపేటకు చెందిన కళ్యాణి, సుబ్రహ్మణ్యం దంపతులు ఐదురోజుల పసికందు పాత ప్రభుత్వాస్పత్రిలోని ఇంక్యుబేటర్ నుంచి ఈనెల 14వ తేదీన మాయం కావడం, శిశువు కిడ్నాప్ ఉదంతం రాష్ట్రంలో సంచలనం కలిగించిన విషయం తెలిసిందే. దీంతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు అప్పటికప్పుడే దర్యాప్తు ముమ్మరం చేశారు. పది ప్రత్యేక బృందాలు ఇటు నగరంలోనూ, మరోవైపు సరిహద్దు మార్గాల వద్ద, పొరుగు జిల్లాల్లోనూ తీవ్ర గాలింపు చర్యలు చేపట్టారు. మరోవైపు పండిట్ నెహ్రూ బస్టేషన్‌లో సిసి కెమేరాల్లో రికార్డయిన దృశ్యాలను కూడా పరిగణనలోకి తీసుకున్న పోలీసులు తొలుత ఓ మహిళను అనుమానించినా.. ఆతర్వాత కాదని నిర్ధారించుకున్నారు. అయితే అనుకోకుండా.. బిడ్డ అవనిగడ్డలో ఉన్నట్లు పౌరుల సమాచారం మేరకు అక్కడి పోలీసులు అప్రమత్తమై నగర దర్యాప్తు బృందాలకు సమాచారం అందించారు. అవనిగడ్డ మండలం తుంగలవారి పాలెంకు చెందిన గంగు నాగమల్లేశ్వరీకి ఏడాది క్రితం గుంటూరు జిల్లా సజ్జావారి పాలెంకు చెందిన రాజతో గత ఏడాది మేలో వివాహమైంది. అవనిగడ్డ వెంకటేశ్వర ధియేటర్ రోడ్డులో ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. నాగమల్లేశ్వరీ తరచూ కోయంబత్తూలోని మేనమామ ఇంటికి వెళ్తూ ఉంటుంది. గురువారం నాగమల్లేశ్వరీ దంపతులు బిడ్డను తీసుకుని అవనిగడ్డకు వచ్చారు. శుక్రవారం రాత్రి నాగమల్లేశ్వరి ఇంటి నుంచి చంటిపిల్ల ఏడుపు వినపడటంతో చుట్టు పక్కల వారు అనుమానం వచ్చి పోలీసులుకు సమాచారం అందించారు. అప్పటికే టివిల్లో, పత్రికల్లో పసికందు కిడ్నాప్ ఉదంతం ప్రచారం కావడంతో స్థానికులు వెంటనే గ్రహించగలిగారు. దీంతో అవనిగడ్డ డిఎస్పీ ఖాదర్‌భాషా, సిఐ మూర్తి ఎస్‌ఐ మణికుమార్‌తో కలిసి అర్ధారత్రి నాగమల్లేశ్వరీ ఇంటికి వెళ్లి బిడ్డతో సహా అదుపులోకి తీసుకున్నారు. దీంతో అక్కడి పోలీసులు నగర పోలీసులను సంప్రదించగా.. విజయవాడ తీసుకురాగా తల్లిదండ్రులు బిడ్డను గుర్తించారు. శనివారం ఉదయం నగర పోలీసు కమిషనర్ స్వయంగా ఆస్పత్రికి వచ్చి తల్లిదండ్రులకు బిడ్డను అప్పగించారు. దీంతో కన్నపేగు సంతోషానికి హద్దే లేదు. అయితే అదుపులోకి తీసుకున్న నాగమల్లేశ్వరీతోపాటు మరో వ్యక్తి కూడా పోలీసులు విచారిస్తున్నారు. ఆమెకు బిడ్డ ఎలా వచ్చాడు. ఆస్పత్రి నుంచి ఎవరూ బయటకు తీసుకువచ్చి అందచేశారు. ఎంతకు ఒప్పందం కుదిరింది అనే కోణాల్లో విచారిస్తున్నారు. దీంతోపాటు ఆస్పత్రినుంచి అపహరించిన వారు గతంలో కూడా ఈ తరహా ఘటనలకు పాల్పడిన దాఖలాలై ఆరా తీస్తున్నారు. మొత్తం మీదట ఆస్పత్రి నుంచి పసిబిడ్డల అపహరణ ఉదంతాన్ని దర్యాప్తులో పూర్తిస్థాయి సమాచారం రాబట్టి శుక్రవారం పోలీసులు వెల్లడించే అవకాశం ఉంది.

పుష్కరాల్లో ప్రతి ఇల్లు ధర్మసత్రంగా మారాలి
* వర్ల రామయ్య పిలుపు
తోట్లవల్లూరు, జూలై 16: కృష్ణా పుష్కరాలకు ఘాట్లకు వచ్చే భక్తులకు ఎలాంటి ఆటంకం కలగకుండా సకల సౌకర్యాలు ఏర్పాటు చేయాల్సిన బాధ్యత అధికారులదేనని రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్, పామ్రరు నియోజకవర్గ టిడిపి ఇన్‌చార్జి వర్ల రామయ్య అన్నారు. శనివారం అన్ని శాఖల అధికారులతో కలిసి మండలంలోని వల్లూరుపాలెం, తోట్లవల్లూరు, ఐలూరు తదితర ఘాట్లలో ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. అనంతరం ఐలూరు దేవాలయంలో అధికారులతో సమావేశం నిర్వహించి పుష్కర పనుల వివరాలు తెలుసుకున్నారు. అనంతరం విలేఖర్లతో మాట్లాడుతూ తోట్లవల్లూరు మండలంలో అన్నిశాఖల అధికారులు సమష్టిగా పుష్కర పనులు వేగంగా చేస్తున్నారని అన్నారు. కొన్ని ప్రతిపక్ష పార్టీలు పనిగట్టుకుని విమర్శలు చేస్తున్నారని, వాటిని నమ్మవద్దని సూచించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషా ణపుష్కరాలు ఘనంగా నిర్వహించాలని, వివిధ ప్రదేశాల నుంచి వచ్చే 4.5 కోట్ల మంది ప్రజలకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు తెలిపారు. పుష్కరాల సమయానికి కృష్ణానదిలో నీళ్ళు రావని అపోహలు వద్దని, పుష్కరాలను పురస్కరించుకునే పులిచింతల ప్రాజెక్టు వద్ద 2.5 టీఎంసీల నీటిని నిల్వ ఉంచారని, వాటిని పుష్కరాలకు రెండు రోజుల ముందుగా విడుదల చేస్తారని వివరించారు. పుష్కరఘాట్ ప్రాంతంలోని ప్రతి ఇల్లు ఒక ధర్మసత్రంగా మారి, వచ్చిన భక్తులకు కొంతవరకు సేవ చేయగలరని పిలుపునిచ్చారు. అలాగే గ్రామం మొత్తం తోరణాలతో అలంకరించి పండుగ వాతావరణం నెలకొనేలా చేయాలని కోరారు. తోట్లవల్లూరు, ఐలూరు గ్రామాల్లో పుష్కర స్నానాలకు వచ్చిన భక్తులకు పలు సంసృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నామని రామయ్య వివరించారు. ఈ సమావేశానికి అన్నిశాఖల అధికారులు హాజరుకాగా, హాజరుకాని ఇరిగేషన్, వైద్యశాఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తహశీల్దార్ జి భద్రు, ఎంపిడిఓ పద్మసుధ, సిఐ వివి సత్యనారాయణ, ఎస్‌ఐ ప్రసాద్, టిడిపి నాయకులు వివి గురుమూర్తి, అంజిరెడ్డి, ఎన్ మురళి, తదితరులు పాల్గొన్నారు.