కృష్ణ

పోలీసు స్టేషన్‌పై నుండి దూకేసిన వినోద్ కదంబి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాతబస్తీ, జనవరి 21: వన్‌టౌన్ పోలీసు స్టేషన్ సిసిఎస్ విభాగం పై నుండి కిందకి దూకిన కేసులో క్షతగాత్రుడు చికిత్స పొందుతూ గురువారం తెల్లవారుజామున మృతి చెందాడు. కాగా వినోద్ కదంబి దూకిన సంఘటనపై కానిస్టేబుల్ గోపి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసు కస్టడి నుండి వినోద్ పరారైనట్లుగా నమోదు చేశారు. వినోద్ కదంబి మంగళవారం ఉదయం పోలీసు స్టేషన్ భవనం పై నుండి దూకిన విషయం విదితమే. మృత్యువుతో పోరాడిన వినోద్ ప్రాణాలు విడిశాడు. మృతదేహానికి గురువారం ఉదయం పోస్టుమార్టం నిర్వహించి అనంతరం బంధువులకు అప్పగించారు. రాజమండ్రి నుండి ముగ్గురు బంగారు వ్యాపారులను నగరానికి తీసుకొచ్చిన సిసిఎస్ పోలీసులు వారిని రికవరీ కోసం తమదైన శైలిలో విచారించగా భయపంకితుడైన వినోద్ కిందకి దూకడంతో మృతి చెందాడు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ విద్యార్థి వేముల రోహిత్ ఆత్మహత్యకు పాల్పడిన సంఘటనకు దారి తీసిన పరిస్థితులు దానికి కారకులైన వారిపై కేసులు నమోదు చేశారు. నిందితులను అరెస్ట్ చేయాలని దేశ వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయి. అలాంటప్పుడు పోలీసుల కస్టడీలోని నిందితుడు భయభ్రాంతులకు గురై చివరకు ఆత్మహత్యయత్నం, అనంతరం మృతి చెందడం జరిగింది. వినోద్ కదంబి మృతికి కారణమైన పోలీసులకు కూడా అదే చట్టం వర్తిస్తుందా? వినోద్ ఆత్మహత్యకు కారణమైన పోలీసులపై కేసు నమోదు చేస్తారా? అంటూ స్థానికుల్లో ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. అది యూనివర్శిటీ, ఇది పోలీసు స్టేషన్ రెండు సంఘటనల్లో రెండు నిండు ప్రాణాలు పోయాయి. ఉన్నతాధికారులు ఈ ఘటనపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాల్సిందే. ఈ కేసును వన్‌టౌన్ సిఐ పి వెంకటేశ్వర్లు దర్యాప్తు చేస్తున్నారు.