కృష్ణ

సిఆర్‌డిఏ మాస్టర్ ప్లాన్‌పై అభ్యంతరాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాయకాపురం, జనవరి 21: సిఆర్‌డిఏ విడుల చేసిన క్యాపిటల్ రీజియన్, కాపిటల్ సిటీ మాస్టర్ ప్లాన్‌పై అనేక అభ్యంతరాలు ఉన్నాయని అఖిలపక్ష నాయకులు అన్నారు. సిఆర్‌డిఏ రూపొందించిన మాస్టర్‌ప్లాన్‌లో మార్పులు కోరుతూ గురువారం ఉదయం అఖిలపక్షం ఆధ్వర్యంలో సిఆర్‌డిఏ కమిషనర్‌కు వినతిపత్రం సమర్పించారు. మాస్టర్ ప్లాన్‌పై ప్రజాస్వామ్యయుతంగా, సమగ్రంగా చర్చించాల్సి ఉందనీ, కాని సిఆర్‌డిఏ అటువంటి చర్చకు అవకాశం కల్పించకపోవడం విచారకరమన్నారు. మాస్టర్ ప్లాన్‌ను తెలుగులో ప్రచురించాలనీ, అభ్యంతరాల గడువు మార్చి నెలాఖరు వరకు పొడిగించాలని డిమాండ్ చేశారు. మాస్టర్ ప్లాన్‌పై అఖిలపక్షాలతోను, వివిధ ప్రజా సంఘాలు, అసోసియేషన్‌లతో అధికారయుతంగా సమావేశాలు ఏర్పాటు చేయాలన్నారు. స్థానిక సంస్థల్లో చర్చ జరపాలనీ, వాటి తీర్మానాలకు అనుగుణంగానే మాస్టర్ ప్లాన్ రూపొందించాలనీ, ప్రతి మండలంలోనూ అవగాహన సదస్సులు జరపాలని, వాటి తీర్మానాలకు అనుగుణంగానే మాస్టర్ ప్లాన్ రూపొందించాలని డిమాండ్ చేశారు. అభ్యంతరాలు పరిశీలించి తగు మార్పులు చేయటానికి నిపుణులు, మేధావులతో స్వతంత్ర సంస్థను ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే వ్యవసాయ పరిరక్షణజోన్‌లను సమూలంగా మార్చాలని, స్థానిక సంస్థలు, ప్రజల అభిప్రాయాల మేరకు జోన్‌లు మార్చాలనీ, అన్ని మండలాల్లో అభివృద్ధి జరిగే విధంగా వికేంద్రీకరణ దిశలో ప్లాన్ ఉండాలని, జోన్లు ఉండాలన్నారు. ప్రతి మండలంలో నివాస, వ్యాపార, పరిశ్రమలు, సర్వీసు, విద్య, వైద్యం, పర్యాటక తదితర రంగాల్లో భవిష్యత్ అభివృద్ధికి వీలుగా మాస్టర్‌ప్లాన్‌లో మార్పులు చేయాలన్నారు. పెండింగ్‌లో ఉన్న లే అవుట్లు, నిర్మాణాలకు అనుమతులు మంజూరు చేయాలనీ, పేద, మధ్య తరగతి ప్రజలకు గృహవసతి కల్పించే విధంగా సిఆర్‌డిఏ ప్రత్యేక గృహ విధానాన్ని రూపొందించాలని కోరారు. క్యాపిటల్ రీజియన్ మాస్టర్ ప్లాన్‌లో సమూల మార్పులు చేయాలనీ, స్వదేశీ, స్థానిక నిపుణులతో ప్రత్యేకంగా మాస్టర్ ప్లాన్ రూపొందించాలనీ, దాని పై కూడా అభిప్రాయాలు సేకరించాలనీ, మెరుగైన మాస్టర్ ప్లాన్‌ను ఎంపిక చేయాలన్నారు. అవుటర్ రింగ్‌రోడ్డు, ఇన్నర్ రింగ్‌రోడ్డు, ఇతన అభివృద్ధి కార్యక్రమాలకు భూసేకరణ, సమీకరణ ఏకపక్షంగా చేయరాదన్నారు. బలవంతపు భూ సేకరణ ఆపాలనీ, పూలింగ్ ఆపాలనీ, నివాసాలు తొలగించకుండా చూడాలని, అనివార్యమైతే రైతులు, నివాసితులు కోరిన విధంగా పూర్తి స్థాయి నష్టపరిహారం చెల్లించిన తరువాతే భూ సేకరణ చేయాలన్నారు. దశలవారీగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలనీ, అన్నింటికీ ముందస్తుగానే భూమి సేకరించరాదనీ, పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులు ముందు పూర్తి చేయాలని, అటవీ భూములను డీ ఫారెస్టు చేసే చర్యలు విరమించుకోవాలన్నారు. వ్యవసాయ పరిరక్షణకు ప్రత్యేక విధానం రూపొందించాలని, చట్టం చేయాలనీ, అనేక దేశాలలో ఉన్న విధంగా వ్యవసాయాన్ని పరిరక్షించే రైతులు, కూలీలకు ప్రత్యేక రాయితీలు, ప్రోత్సహాలు ఇవ్వాలని, భూ సేకరణ ద్వారా ఏర్పడే పరిశ్రమలు, వాణిజ్య సంస్థల ద్వారా వచ్చే లాభాల్లో రైతాంగానికి వాటా ఇచ్చే ఏర్పాట్లు పరిశీలించాలని కోరారు. సిఆర్‌డిఏ పని తీరును ప్రజాస్వామీకరించాలనీ, ప్రజలకు జవాబుదారీగా ఉండాలనీ, రాజకీయపక్షాలు, ప్రజాప్రతినిధులు, స్థానిక సంస్థల ప్రతినిధులు, అసోసియేషన్లు, ప్రజాసంఘాల ప్రతినిధులతో సిఆర్‌డిఏ సలహా మండలిని ఏర్పరచాలని వినతి పత్రంలో కోరారు. వినతిపత్రం ఇచ్చిన అఖిలపక్షం నేతల్లో సిపిఎం నాయకులు సిహెచ్.బాబూరావు, సిపిఐ నాయకులు వెంకన్న, కాంగ్రెస్‌పార్టీ నాయకులు దేవినేని నెహ్రూ, వైసిపి నాయకులు కె.పార్థసారథి, న్యూడెమోక్రసీ నాయకులు రామారావు, ఎంసిపిఐ(యు) నాయకులు జి.ప్రసాద్, లిబరేషన్ పార్టీ నాయకులు హరనాథ్, ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు.