కృష్ణ

గణతంత్ర వేడుకలకు ముమ్మర ఏర్పాట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 21: రాష్టస్థ్రాయి 67వ గణతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లు ముమ్మరంగా చేపట్టాలని జిల్లా ఇన్‌ఛార్జి కలెక్టర్ గంథం చంద్రుడు అధికారులను ఆదేశించారు. స్థానిక ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఏర్పాట్లను సబ్ కలెక్టర్ సృజనతో కలిసి ఆయన బుధవారం పర్యవేక్షించారు. ప్రధానంగా రాష్ట్ర ప్రగతిని తెలిపే విధంగా ఏర్పాటుకానున్న శకటాలను రూపొందించడంలో ప్రభుత్వం ఆమోదించిన డిజైన్లు మాత్రమే అనుమతించాలన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఏర్పాటవుతున్న శకటం 3డి నమూనాను పరిశీలించిన అనంతరం లైవ్ మోడల్స్ ఏర్పాటులో తగు శ్రద్ధ వహించాలని ఇన్‌ఛార్జి కలెక్టర్ కోరారు. సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో రూపొందుతున్న శకటంలో ఇ-పోస్‌కు సంబంధించిన సమాచారం సమగ్రంగా యివ్వాలని ఆయన ఆదేశించారు. అదే విధంగా గ్రామీణాభివృద్ధి, వ్యవసాయం, జలవనరులశాఖలు ఏర్పాటు చేస్తున్న శకటాల నమూనాలను ఆయన పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. విద్యాశాఖకు సంబంధించిన శకటం ఏర్పాట్లు జాప్యం కావడం పట్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. వెంటనే తగు ఏర్పాట్లు చేయవలసిందిగా విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. ఫైనల్ రిహార్సిల్ నాటికి పూర్తిస్థాయి శకటాలను రూపొందించాలని అందుకు ఆయా శాఖల అధికారులు నిరంతరం పర్యవేక్షణ జరపాలని ఆయన ఆదేశించారు. అనంతరం స్టేడియంలో శకటాల ప్రవేశం, ప్రదర్శన అనంతరం తిరిగి వెళ్లే మార్గాలను ఇన్‌ఛార్జి కలెక్టర్ పరిశీలించారు. స్టేడియంలో ఆహ్వానితులకు చేసే సీటింగ్ ఏర్పాట్లను పరిశీలించి మరింత వేగవంతం చెయ్యాలని ఆదేశించారు. స్టేడియం పరిసరాల పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచే పనులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం గణతంత్ర దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి ప్రముఖులకు ఇచ్చే ‘హై టి’ ఏర్పాట్లను సమీక్షించారు. ఈ సందర్భంగా ఇన్‌ఛార్జి కలెక్టర్ వెంట సమాచారశాఖ అడిషనల్ డైరక్టర్ డి.శ్రీనివాస్, ఫ్రోటోకాల్ డెప్యూటీ డైరక్టర్ శర్మ, అర్బన్ తహశీల్దార్ శివరాం తదితరులున్నారు.