కృష్ణ

బాల కార్మిక విద్యా పథకాన్ని సమర్థవంతంగా నిర్వహించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 21: దేశవ్యాప్తంగా బాల కార్మిక విద్యా పథకం (ఎన్‌సిఎల్‌పి) అమలును సమర్థవంతంగా నిర్వహించాలని కేంద్ర కార్మిక శాఖ ప్రధాన కార్యదర్శి దిరాజ్ కుమార్ ఆదేశించారు. గురువారం న్యూఢిల్లీ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సులో విజయవాడ కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి ఇన్‌ఛార్జి కలెక్టర్ గంధం చంద్రుడు, జిల్లా ఎన్‌సిఎల్‌పి అధికారి డి.ఆంజనేయ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా దిరాజ్ కుమార్ మాట్లాడుతూ, బాల కార్మికులకు జీవనభృతి కలిగించే లైవ్‌లీ హుడ్ కార్యక్రమాలను నిర్వహించుకోవాలని తెలిపారు. నిధులు ఎందుకోసం ఇవ్వడం జరిగిందో వాటికే వినియోగించాలని, పథకం ఏర్పాటుకు చెందిన ఫలాలను లబ్ధిదారులకు విడుదల చేసిన వివరాలు, వినిమయంపై కూలంకషంగా సమీక్షించారు. జిల్లాలో మరింత మంది బాల కార్మికుల గుర్తింపుకు సర్వే కోసం నిధులు విడుదలకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.
జిల్లాకు సంబంధించిన వివరాలను ఇన్‌ఛార్జి కలెక్టర్ జి.చంద్రుడు వివరిస్తూ, కృష్ణా జిల్లాలో 10 బాల కార్మిక పాఠశాలల ద్వారా 496 మందికి బాల కార్మిక విద్యా పథకం అమలు చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో మరింత పారదర్శకంగా నిధులు ఖర్చు చేసే విధానంలో భాగంగా ఈ పథకంలో భాగస్వామ్యం అయ్యే స్వచ్ఛంద సంస్థల ఆధార్ సంఖ్య తప్పనిసరి చేయడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలో బాల కార్మికుల విద్యాపథకం అమలుకు రూ.44.33 లక్షల నిధులు మంజూరు చేయవలసి ఉందని తెలిపారు. వీటిలో స్ట్ఫైండ్‌గా రూ.15.75, స్కూల్ నిర్వహణ కోసం రూ.24.92 లక్షలు, పరిపాలనా పరమైన ఖర్చుల కోసం మరో రూ.3.86 లక్షలు మంజూరు మార్చి 2016 వరకు ప్రతిపాదనలు పంపడం జరిగిందని తెలిపారు. జిల్లాలోని బాల కార్మిక విద్యా పథకం ద్వారా గుర్తించిన బాలలకు ఆధార్ సంఖ్యతో అనుసంధానంపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. 209 మంది ఆధార్ వివరాలు జిల్లాలో మరింత మంది బాల కార్మికుల గుర్తింపునకు 33 స్వచ్ఛంద సంస్థల ద్వారా సర్వే చేపడుతున్నట్లు తెలిపారు. మరో 15 రోజులు సరిపోతుందని తెలిపారు. సర్వే పూర్తి అయ్యాక మరిన్ని కేంద్రాలను గుర్తించడం జరుగుతుందని తెలియజేశారు. నేరుగా నగదు బదిలీ పథకం ఆధార్ అనుసంధానం ద్వారా అసలైన లబ్ధిదారుల ఖాతాకు జమ చెయ్యగలుగుతామన్నారు. జిల్లాలోని స్వచ్ఛంద సంస్థల ఆధార్ సంఖ్య తప్పనిసరిగా సేకరించాలని జాయింట్ కలెక్టర్ గంధం చంద్రుడు, ఎన్‌సిఎల్‌పి అధికారి ఆంజనేయ రెడ్డిని ఆదేశించారు. ఈ సమావేశంలో ఎన్‌సిఎల్‌పి ఫీల్డ్ ఆఫీసర్స్ కె.ప్రసూనాంబ, పాల్‌రాజ్ పాల్గొన్నారు.