కృష్ణ

ధన్యజీవి మదర్ థెరిస్సాకు పోప్ ఫ్రాన్సీస్‌చే పునీత పట్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పటమట, సెప్టెంబర్ 3: అనార్థుల ఆశాకిరణం, ధన్యజీవి మదర్ థెరిస్సాకు ఆదివారం జగద్గురువులు పోప్ ఫ్రాన్సీస్ వారిలో రోమ్‌నగర్‌లోని వాటికన్ మహానగరంలో లక్షలాది మంది భక్తుల మధ్య పునీత పట్టం (సెయింట్ హుడ్) హోదా ఇవ్వనున్నారని ఆంధ్ర లయోలా కళాశాల రెక్టార్ ఫాదర్ దూసి రాజశేఖర్ తెలిపారు. శనివారం సాయంత్రం గుణదల మేరిమాత పుణ్యక్షేత్రంలో జరిగిన సమావేశంలో పుణ్యక్షేత్రం ఇన్‌చార్జి రెక్టార్, ఎస్‌ఎస్‌సి డైరెక్టర్ ఫాదర్ మువ్వలప్రసాద్, ఫాదర్ రవిశేఖర్, ఫాదర్ మరియదాస్, అసిస్టెంట్ ఫాదర్ జి.ప్రతాప్ మదర్ థెరిస్సా బ్రోచర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఫాదర్ రవిశేఖర్ మాట్లాడుతూ మదర్ థెరిస్సాకు సెయింట్ హుడ్ హోదా ఇవ్వనన్ను నేపథ్యంలో నగరంలో సుమారు 6వేల మంది ఆదివారం ఉదయం 10 గంటలకు భారీ శాంతి ర్యాలీ నిర్వహించటం జరుగుతుందన్నారు. పుణ్యక్షేత్రం రెక్టార్, ఫాదర్ మువ్వలప్రసాద్ మాట్లాడుతూ వాటికన్ మహానగరంలో జరిగే మదర్ థెరిస్సా సెయింట్ హుడ్ హోదా కార్యక్రమానికి భారతదేశం తరుపున కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జి, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ హాజరవుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫాదర్ డి. సతీష్, కోనాల కుమార్, మందిమాల సుమన్, తోట మోజెస్ తదితరులు పాల్గొన్నారు.