కృష్ణ

కృష్ణా పుష్కరాలు అట్టహాసంగా నిర్వహిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెడన, జనవరి 21: త్వరలో రానున్న కృష్ణా పుష్కరాలను నభూతో న భవిష్యతి అన్న రీతిలో అట్టహాసంగా నిర్వహించడానికి విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు తెలిపారు. స్థానిక నియోజకవర్గ నేత డా. వాకా వాసుదేవరావు ఆధ్వర్యంలో పట్టణంలోని బిజెపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన జనతావాణిని మంత్రి గురువారం ప్రారంభించారు. ఈసందర్భంగా జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ గోదావరి పుష్కరాలను నిర్వహించిన అనుభవంతో కృష్ణా పుష్కరాలను మరింత విజయవంతంగా జరిపి తీరుతామన్నారు. గోదావరి పుష్కరాల సమయంలో జరిగిన లోటుపాట్లను సవరించుకుని ముందుకు వెళతామన్నారు. ఇప్పటికే కొత్త స్నానఘట్టాలు నిర్మాణం చేపట్టామని, కొన్ని స్నానఘట్టాలకు మరమ్మతులు నిర్వహించామని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కృష్ణా పుష్కరాల నిర్వహణ పట్ల ఉన్న ఆసక్తి తమకు ఉత్సాహాన్ని కలిగిస్తోందని మంత్రి అన్నారు. రాజకీయ చతురతతో పాకిస్తాన్‌ను కూడా దారిలోకి తీసుకొస్తూ ప్రధాని మోదీ నూతన చరిత్రను సృష్టిస్తున్నారన్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ విద్యార్థి రోహిత్ మరణం తనను తీవ్రంగా కలచివేసిందన్నారు. అయితే విద్యార్థి మరణాన్ని రాజకీయం చేస్తున్న కొందరు నాయకుల తీరును మాణిక్యాలరావు తప్పుపట్టారు. జనతావాణిని ఏర్పాటు చేసిన బిజెపి నేత వాసుదేవరావు మాట్లాడుతూ వారంలో ఆరురోజులు ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించి ప్రభుత్వ అధికారులకు చేరవేయడమే జనతావాణి లక్ష్యమని తెలిపారు. ఈసందర్భంగా మాణిక్యాలరావును నాయకులు ఘనంగా సత్కరించారు. బిజెపి జిల్లా అధ్యక్షులు రామినేని వెంకటకృష్ణ, బందరు పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ పంతం గజేంద్ర, పెడన నియోజకవర్గ ఇన్‌చార్జ్ పుప్పాల రామాంజనేయులు, కట్టా జ్యోతీశ్వరరావు, బైరిశెట్టి రాజా సుదర్శనరావు, బాటసారి, తలుపులు కృష్ణ, పిచ్చుక శంకర్, కంకటావ సర్పంచ్ రామాంజనేయులు, తదితరులు పాల్గొన్నారు.

అగ్రిజోన్ నిబంధనలు సవరించాలి
మైలవరం, జనవరి 21: రాజధాని సిఆర్‌డిఏ పరిధిలోని వ్యవసాయ పరిరక్షణ జోన్ నిబంధనలను సవరించాలని సిపిఎం డిమాండ్ చేసింది. గురువారం స్థానిక పార్టీ కార్యాలయంలో జిల్లా కమిటీ సభ్యులు పివి ఆంజనేయులు, సిఐటియు మండల అధ్యక్షుడు సాల్మన్‌రాజు, పార్టీ నేత ఎండి జాని విలేఖర్లతో మాట్లాడుతూ సిఆర్‌డిఏ పరిధిలో కృష్ణా, గుంటూరు జిల్లాల్లో 56 మండలాలను అగ్రిజోన్ పరిధిలోకి తెచ్చి దీనిపై అభ్యంతరాలను ఈ నెల 25లోగా చెప్పాలని ప్రభుత్వం నిర్దేశించిందని తెలిపారు. ఇందులో మైలవరం, జి.కొండూరు మండలాలు కూడా ఉన్నాయని, ఈ మండలాలను అగ్రిజోన్ పరిధిలోకి తీసుకురావటం వల్ల ఈ ప్రాంతంలో ఎలాంటి భవనాలు నిర్మించకూడదని ఉత్తర్వులు ఇవ్వటం శోచనీయమన్నారు. పంటలు పండే అమరావతి ప్రాంతంలో భవనాలు నిర్మిస్తున్న ప్రభుత్వం, కేవలం వర్షాలపైనే ఆధారపడే మెట్ట ప్రాంతంలో పంటలు మాత్రమే పండించాలని సూచించటం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రభుత్వం అగ్రిజోన్‌గా కేటాయించిన ప్రాంతంలో పంటలు పండటానికి అవసరమైన సౌకర్యాలు లేవని, ఇలాంటి పరిస్థితుల్లో పంటలు మాత్రమే పండించాలని ప్రభుత్వం నిర్దేశించటం సమంజసం కాదన్నారు. పైగా దీనిపై అభ్యంతరాలను ఈ నెల 25వరకే నిర్ణయించటం వల్ల సమయం సరిపోదన్నారు. మార్చి 31వరకూ సమయం ఇవ్వాలని డిమాండ్ చేశారు. పైగా ప్రభుత్వం అగ్రిజోన్‌గా కేటాయించే విషయంపై నిర్ణయం తీసుకోవటానికి అఖిలపక్షాన్ని కూడా ఏర్పాటు చేయకుండా ఏకపక్షంగా నిర్ణయించటం శోచనీయమన్నారు. ప్రభుత్వ నిర్ణయంలో సమూలమైన మార్పులు జరగాలన్నారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఈ నెల 22న మధ్యాహ్నం 3గంటలకు స్థానిక చలవాది కల్యాణ మండపంలో అన్ని పార్టీల నేతలతో కలిసి అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన వివరించారు.