కృష్ణ

జిల్లాలో బంద్ స్వచ్ఛందం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, సెప్టెంబర్ 10: రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్న తీరును నిరసిస్తూ శనివారం చేపట్టిన రాష్ట్ర బంద్ జిల్లాలో సంపూర్ణంగా ముగిసింది. బంద్‌లో పాల్గొన్న వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ, సిపిఎం, సిపిఐ నాయకులను ఎక్కడిక్కడే పోలీసులు ముందస్తుగా అరెస్టు చేసినప్పటికీ బంద్ విజయవంతమైంది. ఉదయానే్న ఆర్టీసీ డిపోల వద్దకు చేరుకున్న ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేశారు. దీంతో పోలీసుల రక్షణలో ఆర్టీసీ బస్సులు యథావిధిగా తిరిగాయి. వర్తక, వాణిజ్య సంస్థలు, పెట్రోలు బంక్‌లు, టీ, టిఫిన్ హోటళ్లు పూర్తిగా మూతపడ్డాయి. రెండో శనివారం కావటంతో ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంక్‌లు, విద్యాసంస్థలు పనిచేయలేదు. బంద్‌పై విస్తృత ప్రచారం జరగటంతో ప్రైవేట్ విద్యాసంస్థలు, ప్రైవేట్ కార్యాలయాలకు ముందస్తుగా సెలవులు ప్రకటించటంతో తెరుచుకోలేదు. ఎక్కడికక్కడే ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేయటంతో ప్రత్యేక హోదా నినాదం వినిపించక పోయినప్పటికీ బంద్ మాత్రం ప్రశాంతంగా జరిగింది. జిల్లా కేంద్రం మచిలీపట్నంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, ప్రభుత్వ మాజీ విప్ పేర్ని వెంకట్రామయ్య (నాని)ని పోలీసులు హౌస్ అరెస్టు చేసేందుకు ప్రయత్నించారు. తెల్లవారుఝామునే పోలీసులు పేర్ని నాని ఇంటికి వెళ్లి బయటకు రావద్దని సూచించారు. బయటకు వస్తే అరెస్టు చేయాల్సి వస్తుందన్నారు. పోలీసులతో విభేదించిన పేర్ని నాని బంద్‌లో పాల్గొంటానని చెప్పి ఇంటి నుండి బయటకు వచ్చారు. బయటకు వచ్చిన వెంటనే పోలీసులు నానిని అరెస్టు చేసి బంటుమిల్లి పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లారు. సాయంత్రం వరకు స్టేషన్‌లోనే ఉంచి వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేశారు. వైకాపా నాయకులు షేక్ సలార్ దాదా, షేక్ అచ్చాబా, మాదివాడ రాము, కోసూరు లక్ష్మీనాంచారయ్య, వామపక్ష నాయకులు కొడాలి శర్మ, చౌటపల్లి రవి, బూర సుబ్రహ్మణ్యం, సిహెచ్ జయరావు, ఎం హరిబాబు, మోదుమూడి రామారావు, కరపాటి సత్యనారాయణ, తదితరులను తెల్లవారుఝామునే పోలీసులు వారి ఇళ్లకు వెళ్లి మరీ అరెస్టు చేశారు. సమీపంలోని గూడూరు, ఆర్‌పేట పోలీసు స్టేషన్‌లకు తరలించి సాయంత్రం వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేశారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మూడు స్తంభాల సెంటరు సమీపంలో మచిలీపట్నం-విజయవాడ జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. పార్టీ నాయకులు డా. రాధికా మాధవి, అబ్దుల్ మతీన్, బుల్లెట్ ధర్మారావు, దాదా సాహెబ్, ఎండి ఇషాఖ్, రామిశెట్టి ప్రసాద్, కల్లు వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. ముందస్తు అరెస్టులను ఆయా పార్టీల నాయకులు, కార్యకర్తలు తీవ్రంగా ఖండించారు. అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరంటూ నినాదాలు చేశారు. ప్రత్యేక హోదా సాధనే ధ్యేయంగా రానున్న రోజుల్లో మరిన్ని పోరాటాలు చేస్తామని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించారు.

హోదా ఇవ్వని వారు దేశద్రోహులే
ఇంద్రకీలాద్రి, సెప్టెంబర్ 10: ఎపికి ప్రత్యేక హోదా ఇవ్వనోళ్లు, తేనోళ్లు రాష్ట్ర ద్రోహాలేనని భారత విద్యార్థి ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి ఎస్ నూర్ మహమ్మద్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధికి ప్రత్యేక హోదా అవసరమని నాడు ఊదరకొట్టిన కేంధ్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఐదుకోట్ల ప్రజలను మోసం చేస్తున్నారని, ఇప్పుడు ప్రత్యేక సాయం పేరుతో సరికొత్త నాటానికి తెరతీశారన్నారు.

ఆంధ్రుల్ని నిలువునా ముంచిన పాలకులు
షమైలవరం, సెప్టెంబర్ 10: రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న నిర్లక్ష్య వైఖరికి నిరసనగా శనివారం మైలవరంలో పూర్తి బంద్ జరిగింది. ఉదయం నుండి వైసిపి, కాంగ్రెస్, సిపిఎం, సిపిఐ నాయకులు కలిసి పూర్తి బంద్ చేయించారు. బస్సులు, ఆటోలు, ఇతర వాహనాలను తిరగనీయలేదు. పట్టణంలో ప్రదర్శనగా బోసుబొమ్మ సెంటరుకు చేరుకుని ధర్నా నిర్వహించారు. ధర్నాలో వైసిపి రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే జోగి రమేష్ మాట్లాడుతూ చంద్రబాబు, మోదీ తోడుదొంగలని ధ్వజమెత్తారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని గత రెండున్నరేళ్లుగా ప్రజలను నమ్మించి చావుకబురు చల్లగా చెప్పారని విమర్శించారు. హోదా ఇవ్వకపోగా దానికి సమానమైన ప్యాకేజీ ఇవ్వకుండా నిలువునా ముంచారని విమర్శించారు. కేంద్ర వైఖరిని నిరసించాల్సిన చంద్రబాబు స్వాగతిస్తూ అధికారం కోసం, ఓటుకు నోటు కేసు నుంచి బయటపడి పదవిని కాపాడుకోవటం కోసం 5 కోట్ల మంది ఆంధ్రులను కేంద్రానికి తాకట్టు పెట్టాడని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ బొర్రా కిరణ్ మాట్లాడుతూ తాము అధికారంలోకి వస్తే రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని బిజెపి, రాబట్టుకుంటామని తెలుగుదేశం చెప్పి నేడు ప్రజలకు మొండిచేయి చూపాయని విమర్శించారు. ప్రత్యేక హోదా రాకపోవటం వల్ల ఇప్పటికే పీకల్లోతు అప్పుల ఊబిలో ఉన్న రాష్ట్ర పరిస్థితి మరింత దిగజారిపోతుందన్నారు. వామపక్ష నాయకులు ఆంజనేయులు, వాసు మాట్లాడుతూ ప్రత్యేక హోదా మోదీ, చంద్రబాబుల భిక్ష కాదని, ఆంధ్రుల హక్కన్నారు. దానిని సాధించుకునే వరకూ పోరాటం ఆగదని హెచ్చరించారు. విపక్ష పార్టీల నాయకులు పామర్తి శ్రీనివాసరావు, రహీమ్, కరీమ్, ఆజాద్, ఏసుబాబు, ననే్నబాబు, కోటిరెడ్డి, రజనిరెడ్డి, వౌలాలి, అప్పసాని సందీప్, గాళ్ళ సాంబశివరావు, బండి చంటి, కటారి ఉమ, రాంబాబు, రాము, వీరంకి శ్రీ్ధర్, జానీ, సాల్మన్‌రాజు, వెంకట్రావ్, శ్రీరాములు పాల్గొన్నారు.

నూజివీడులో బంద్ ప్రశాంతం
నూజివీడు, సెప్టెంబర్ 10: రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని కోరుతూ వామపక్షాలు, వైకాపా పిలుపు మేరకు రాష్ట్ర బంద్ నూజివీడు డివిజన్‌లో శనివారం ప్రశాంతంగా జరిగింది. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, విద్యాలయాలు మూతబడ్డాయి. వామపక్షాలు, వైకాపా నాయకులు ఊరేగింపుగా వెళ్ళి బంద్‌కు సహకరించాలని కోరారు. డివిజన్ ప్రధాన కేంద్రమైన నూజివీడులో బంద్ ప్రశాంతంగా జరిగింది. ఉదయం బస్టాండ్ వద్ద వామపక్షాల నాయకులు బస్టాండ్ ధర్నా చేశారు. బస్సుల రాకపోకలను నిలిపివేసే ప్రయత్నం చేశారు. నూజివీడు డిఎస్‌పి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పోలీసులు బంద్ చేస్తున్న వామపక్షాల నాయకులను అదుపులోకి తీసుకున్నారు. దీంతో బస్సుల రాకపోకలు యధావిధిగా నడిచాయి. బ్యాంకులు, పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు మూతబడ్డాయి. ఈ సందర్భంగా ఎఐటియుసి రాష్ట్ర అద్యక్షులు చలసాని వెంకట రామారావు మాట్లాడుతూ ఎపికి ప్రత్యేక హోదా కేటాయించే విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నాటకాలు ఆడుతున్నాయని విమర్శించారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిలో సిపిఎం నాయకులు యెలినేని దుర్గారావు, జి రాజు తో సుమారు 100 మంది ఉన్నారు. అనంతరం వైకాపా నాయకులు మోటారు సైకిళ్ళ పై వెళ్ళి బంద్‌కు సహాకరించాలని వ్యాపార వర్గాలను కోరి షాపులు మూయించి వేశారు. భారత కార్మిక సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు జె రమేష్ నేతృత్వంలో ప్రత్యేక హోదా కల్పించాలని కోరుతూ మండలంలోని అన్నవరం గ్రామం ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సమాఖ్య ప్రతినిధులు డి శ్రీనివాసరావు, ఎ పార్వతి, అప్పలకొండ, రమణ తదితరులు పాల్గొన్నారు.