కృష్ణ

ఉత్సాహంగా రాష్టస్థ్రాయి అథ్లెటిక్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (స్పోర్ట్స్), సెప్టెంబర్ 16: స్థానిక ఇందిరాగాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియంలో కృష్ణాజిల్లా అథ్లెటిక్స్ ఆసోసియేషన్ ఆధ్వర్యంలో రెండు రోజులుగా జరుగుతున్న రాయపాటి లీలాకుమారి మెమోరియల్ 3వ ఆంధ్రప్రదేశ్ జూనియర్ అంతర జిల్లాల అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ ఉత్సాహంగా జరుగుతుంది. మొదటి రోజు వర్షం కారణంగా కొంత వరకు ఇబ్బంది పడిన అథ్లెట్లు రెండో రోజైన శుక్రవారం ఉరకలేసే ఉత్సాహంతో పాల్గొన్నారు. శనివారంతో ఈ పోటీలు ముగియనున్నాయి. రెండు రోజు ఫలితాలు ఇలా ఉన్నాయి.
అండర్-16 బాలికల షాట్‌పట్ విభాగంలో ఐ.పూజ, వి సుష్మ, కె సంగీత ( కృష్ణా)లు మొదటి మూడు స్థానాలను సాధించారు. అండర్-18 విభాగంలో ఎన్‌విఎస్ కీర్తిక (కృష్ణా) ద్వితీయస్థానం, అండర్-20 విభాగంలో జె సుభశ్రీ (కృష్ణా) ప్రథమస్థానం, అండర్-16 బాలికల 400 మీటర్లలో ఎం షర్మిలాదేవి (కృష్ణా) ద్వితీయస్థానం, అండర్-18 విభాగంలో డి జ్యోతిక శ్రీ (కృష్ణా) ప్రథమస్థానం, అండర్-20 విభాగంలో ఎస్‌డి బాజిబీ, పి వాసంతి (కృష్ణా)లు ద్వితీయ, తృతీయ స్థానాలు, అండర్-20 బాలుర 10000 మీటర్లలో వి సాయివలీ (కృష్ణా) ద్వితీయస్థానం, బాలకల హైజంప్‌లో పి ఆదిలక్ష్మీ (కృష్ణా) ప్రధమస్థానం, అండర్-16 బాలుర హైజంప్‌లో జి సాయి మణికంఠ (కృష్ణా) తృతీయస్థానం, అండర్-20 డిస్కస్‌త్రోలో బి అజయ్ (కృష్ణా) ద్వితీయస్థానం, అండర్-18 400మీటర్లలో జి రవిచందు తృతీయస్థానం, అండర్-20 బాలికల లాంగ్‌జంప్‌లో ఎస్ రాధిక (కృష్ణా) ప్రథమస్థానం, అండర్-18లో బి భవానీ (కృష్ణా) ప్రథమస్థానం, 100 మీటర్లలో బి భవానీయాదవ్ (కృష్ణా) ప్రథమస్థానం, అండర్-20 100 మీటర్లలో ఎస్ రాధిక, ఎల్ భాగ్యశ్రీ (కృష్ణా)లు ప్రథమ, ద్వితీయ స్థానాలు, అండర్-16 డిస్కస్‌త్రోలో కెఎ లక్ష్మీ, బి సుప్రియ, బి శ్రీజ (కృష్ణా)లు మొదటి మూడు స్థానాలు, అండర్-20 బాలుర 100 మీటర్లలో ఎస్‌ఎస్‌వి రోహిత్ (కృష్ణా) తృతీయస్థానం, బాలికల జావెలిన్‌త్రోలో సిహెచ్ పావని (కృష్ణా) తృతీయస్థానం, డిస్కస్‌త్రోలో జె సుభశ్రీ (కృష్ణా) ప్రధమస్థానం, టి నవ్యసుమ (కృష్ణా) తృతీయస్థానం, బాలుర లాంగ్‌జంప్‌లో ఎస్‌ఎస్‌వి రోహిత్ (కృష్ణా) ప్రథమస్థానం, బాలుర హేమర్‌త్రోలో బి అజయ్ (కృష్ణా) ద్వితీయస్థానం, బాలికల హేమర్‌త్రోలో ఎల్ లక్ష్మీ (కృష్ణా) ప్రథమస్థానం కైవసం చేసుకున్నారు.