కృష్ణ

స్వాతంత్య్ర సమరయోధుడు మేకా నరసయ్య కన్నుమూత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కూచిపూడి, జనవరి 26: స్వాతంత్య్ర సమరయోధుడు, శతాధిక వృద్ధుడు మేకా నరసయ్య(100) మంగళవారం తెల్లవారుఝామున కోసూరులోని స్వగృహంలో మృతిచెందారు. మహాత్మా గాంధీ, తదితర జాతినేతలతో సాన్నిహిత్య సంబంధమున్న నరసయ్యకు గత ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ సత్కారం అందుకునేలా ఆంధ్రభూమి తనవంతు కృషిచేసిన సంగతి విదితమే. ఈయనకు కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. నరసయ్య భౌతికకాయానికి ఆర్డీవో ఆదేశం మేరకు తహశీల్దార్ ఎల్ రామారావు, ఆర్‌ఐ ఎ శ్రీనివాసరావు ప్రభుత్వం తరపున పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు. సర్పంచ్ చిందా వీర వెంకట నాగేశ్వరరాజు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు గోగినేని పెరుమాళ్ళు, ఉమామహేశ్వరరావు, కెవి అప్పారావు, బాబ్జి, తదితరులు పాల్గొన్నారు.

క్రీడోత్సవాలు ప్రారంభం
కూచిపూడి, జనవరి 26: మొవ్వ మండలం పెడసనగల్లు ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ డెవలెప్‌మెంట్ సంస్థ ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని విద్య, సాంస్కృతిక, క్రీడోత్సవాలను ప్రారంభించారు. సర్పంచ్ నన్నపనేని స్వర్ణలత జాతీయ పతాకాన్ని ఆవిష్కరించగా వైఎస్ ఎంపిపి నన్నపనేని వీరేంద్ర క్రీడాపోటీలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంఇఓ బాణావత్ కోటేశ్వరరావు, పిఇటిలు బి రాము, రత్నశేఖర్, ఉపాధ్యాయులు కూరపాటి చింతయ్య, పాగోలు రమేష్, భాస్కర్, రిటైర్డ్ పిఇటి చెరుకూరి రాజారావు, పెడసనగంటి భాస్కరరావు, ఎ రత్నశేఖర్, అవిర్నేని శివరామకృష్ణప్రసాద్, పామర్తి శ్రీనివాసరావు, విజయసాయి, తదితరులు పాల్గొన్నారు.

అభయహస్తం స్కాలర్‌షిప్‌ల పంపిణీ
కూచిపూడి, జనవరి 26: డ్వాక్రా మహిళల కుటుంబాలకు చెందిన 1059 మంది విద్యార్థులకు మంగళవారం స్కాలర్‌షిప్‌లను ఎంపిపి కిలారపు మంగమ్మ, జెడ్పీటిసి చిమటా విజయశాంతి పంపిణీ చేశారు. ఒక్కొక్కరికి ఏడాదికి రూ.1200 వంతున రూ.12లక్షల 70వేల 800 చెక్కుల ద్వారా అందచేశారు. ఈసందర్భంగా నాలుగు గ్రామైఖ్య సంఘాలు, 10 డ్వాక్రా గ్రూపులకు జిల్లా కలెక్టర్ ఆదేశం మేరకు ప్రశంసాపత్రాలను అందచేశారు. ఈ కార్యక్రమంలో ఎంపిడివో వై పిచ్చిరెడ్డి, ఎంఇఓ బాణావత్ కోటేశ్వరరావు, ఎంపిఎం సిహెచ్ ప్రధానరావు, ఎపిఓ రామ్మోహనరావు, తదితరులు పాల్గొన్నారు.

హత్యాయత్నానికి పాల్పడ్డ ముగ్గురిపై కేసు
పెనమలూరు, జనవరి 26: వివాహేతర సంబంధం విషయంలో జరిగిన వివాదంలో ముగ్గురిపై హత్యాయత్నం కేసు నమోదు చేసినట్టు మంగళవారం పోలీసులు పేర్కొన్నారు. పెనమలూరు పోలీసుల కథనం మేరకు వివరాలిలా వున్నాయి. గుంటూరుకు చెందిన గొర్రిపాటి విజయరాజు, మందా వందనం, గూడవల్లి మల్లీశ్వరిలు పెనమలూరులోని గూడవల్లి వెంకటేశ్వరరావు ఇంటికి వచ్చారు.